kingmakers Posted April 3, 2009 Report Posted April 3, 2009 ఏలూరు : చిరంజీవి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామం అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ విదితమే. చిరంజీవి రాజకీయాల్లోకి రావడంతో ఆయన స్వగ్రామం పేరు రాష్టవ్య్రాప్తంగా మోగిపోయింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి డా.వైయస్ రాజశేఖరరెడ్డి చిరంజీవి తన స్వంత ఊరైన మొగల్తూరుకు ఒక్క ఎర్ర యాగాణి కూడా ఖర్చు చేయలేదని, ఇక రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారంటూ రాష్టవ్య్రాప్తంగా పదేపదే విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. చిరంజీవి, పవన్‌కళ్యాణ్, ప్రజారాజ్యం పార్టీ నేతలంతా అందుకు ధీటుగా సమాధానం ఇచ్చారు. చివరకు మొగల్తూరు గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్‌షోలో కూడా ముఖ్యమంత్రి వైయస్ ఈ ప్రస్తావన పదేపదే తెచ్చారు. అయితే తాజాగా ప్రజారాజ్యం పార్టీ అగ్రనేత, మాజీ ఎంపి చేగొండి వెంకట హరిరామజోగయ్య చిరంజీవి నాన్నగారి ఊరు పెనుగొండ అని, మొగల్తూరు అమ్మమ్మగారిదని, చిరంజీవి పెదనాన్నది దొడ్డిపట్ల దగ్గర కుమ్మరిపాలెం అని ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో మీడియా సమావేశంలో సైతం చిరంజీవి సమక్షంలోనే మరోసారి హరిరామజోగయ్య ఈ విషయాలు వెల్లడించారు. దీంతో అందరూ ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. చిరంజీవి మాత్రం తానక్కడ పదో తరగతి వరకూ చదువుకున్నానని చెబుతున్నారు. తనకు రాష్ట్రమంతా మొగల్తూరుతో సమానమని, రాష్ట్ర ప్రజలందరూ కావలసిన వారని చెప్తున్నారు గానీ ఇంతకీ చిరుది మొగల్తూరా, పెనుగొండన అన్నది చిరంజీవే చెప్పాలి మరి...
Recommended Posts