Jump to content

allu gadi comedy free show


Recommended Posts

Posted

ఎన్నికల్లో తమ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయన్న విషయం లో ముఖ్యమంత్రి వై. ఎస్. తో ప్రజారాజ్యం పార్టీ అధినేత రాష్ట్ర కార్యదర్శి ఆల్లు ఆరవింద్ పోటీ పడుతున్నట్లు ఉంది. ఈ విషయంలో వై. ఎస్. కాస్త బెటర్ అని అనిపిస్తోంది.  రాష్ట్రంలో మొత్తం  294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తమ పార్టీ 236 స్థానాల్లో విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి ఇప్పటికీ  చెబుతున్నారు.  ప్రతిపక్షం లేక పోతే మజా ఉండదని పైగా ఆది ప్రజాస్వామ్య పాలన అనిపించుకోదని అభిప్రాయపడిన ముఖ్యమంత్రి ప్రతిపక్షాలకు 58 స్థానాలను వదిలి నట్లు ఆయన మాటల్లో మనకు అర్థం అయింది.

ఇక ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆల్లు ఆరవింద్ ఆలోచన మరో రకంగా ఉంది. ఎన్నికల్లో తమకు  292 స్థానాలు వస్తాయని ఆయన ఎంతో ధీమాగా చెబుతున్నారు. రెండు స్థానాలు మాత్రమే ప్రతిపక్షానికి ఆయన వదిలినట్లు అర్థం అవుతోంది. ఒకవేళ నీజానగానే పి. ఆర్. పి. 292 స్థానాలను సాధిస్తే అపుడు నిజంగానే పి. ఆర్. పి. ప్రజారాజ్యం పార్టీ  ప్రజాస్వామ్య యూతంగా పాలన సాగించే అవకాశం ఏ మాత్రం ఉండదు. నిరంకుశ పాలన సాగుతుంది. ఇప్పటికీ సర్వేలన్ని 60 లోపు సీట్లు మాత్రం పి. అర్.పి. సాదించగలుగుతుందని ఘోషిస్తుంటే ఆళ్ళ మాత్రం292 స్థానాలు  మావే అని చెప్పడం అత విశ్వాసం అని అనిపించుకోదు. అతి విశ్వాసం అని అనిపించుకుంటుంది. కాదంటారా  ఆల్లు గారు.! ~"! ~"! ~"!

×
×
  • Create New...