Jump to content

Recommended Posts

Posted

బావమరిది అల్లు అరవింద్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని అంతగా భ్రష్టు పట్టిస్తున్నాడా? ప్రజారాజ్యం పార్టీకి గుడ్ బై చెబుతున్న వారంతా అల్లు అరవింద్ పై విమర్శలు చేసి వెళ్తున్నారు. ఆయన నిర్మాతలాగా వ్యవహరిస్తూ పార్టీ టికెట్లను ఏరియాల వారీగా అమ్ముకున్నారన్నది ప్రధాన విమర్శ. తన మీదనే విమర్శలు రావడంతో అల్లు అరవింద్ నేడు పార్టీ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ ఇంటికి వెళ్ళి గంట సేపు వేచి ఉన్నారు. అయినా పరకాల ఆయనను కలుసుకోవడానికి ఇష్టపడకపోవడం విశేషం.

చిరంజీవి మీద అల్లు అరవింద్ పట్టు ఇప్పటిది కాదు. చిరంజీవి తనకు తానుగా స్టార్ అయితే ఆయనను మెగాస్టార్ ని చేసింది అల్లు అరవింద్ వ్యాపార నైపుణ్యమే. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఆయన చిరంజీవితో తీసిన అనేక సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. బయట అశ్వనీదత్ కు తప్ప మరెవరికీ చిరంజీవి కాల్షీట్స్ దొరకని పరిస్ధితిని సృష్టించింది అల్లు అరవిందే. కథ దగ్గర నుంచి దర్శకుడి వరకు, క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి హీరోయిన్ల వరకు ఎంపిక అధికారం అల్లుదే. చిరంజీవికి వచ్చే పారితోషికాన్ని పెట్టుబడులుగా మార్చే బాధ్యత కూడా బామ్మర్దిదే.

చిరంజీవి చిన్న నటుడిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రాణ స్నేహితులుగా ఉన్న వారిని మెగాస్టార్ అయ్యాక చిరంజీవి దూరంగా ఉంచే బాధ్యతను కూడా అల్లు అరవిందే తీసుకున్నారన్న విషయం సినీ పరిశ్రమలో అందరికీ తెలుసు. చిరంజీవికి లంచ్ లో ఏం ఉండాలి, డిన్నర్ లో ఏం కావాలి? ఏ హీరోయిన్లతో చిరు చనువుగా ఉండొచ్చు? ఎవరికి దూరంగా ఉందాలి అన్నది నిర్ణయించేది అల్లు అరవిందేనని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇంతగా చిరంజీవి ఒక వ్యక్తి చేతిలో బందీ అయిపోయినప్పుడు ఆయన పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కానీ, సైద్ధాంతిక కట్టుబాటును కానీ ఆశించడం కష్టం.

సినీనటుడు బుగ్గల సుధాకర్ మీకు బాగా తెలుసు. చిరంజీవికి సినిమా రంగంలో బ్రేక్ రాకముందు చిరంజీవి, సుధాకర్ మరో ఇద్దరు రూమ్ మేట్స్. తాను కానిస్టేబుల్ కొడుకునని చిరు ఇప్పుడు చెబుతున్నారు. సుధాకర్ తండ్రి అప్పట్లోనే తహసీల్దారు. సుధాకర్ కు ఇంటి నుంచి వచ్చే డబ్బే చిరుకు కూడా కొంత ఆధారంగా ఉండేది. చిరంజీవి కంటే ముందే సుధాకర్ కు హీరోగా అవకాశమొచ్చింది తమిళ సినిమాలో. ఆ తర్వాత తెలుగులో సుధాకర్ కమెడియన్ గా స్ధిరపడ్డాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆయన విజయవంతమయ్యాడు. అయినా అల్లు అరవింద్ దృష్టిలో అతను సక్సెస్ లేని వ్యక్తి. సుధాకర్ చిరంజీవిని ఇప్పటికీ ఓరేయ్ అని సంబోధించడం విన్న అల్లుకు ఒళ్ళు మండిపోయిందట. ఒక కమెడియన్ గాడితో నలుగురిలో ఒరేయ్ అన్పించుకోవద్దు అని అల్లు చిరుకు చెప్పారట. అంతేకాదు సుధాకర్ చిరు ఇంటికి వస్తే వెళ్ళగొట్టమని సెక్యూరిటీ గార్డులకు అల్లు చెప్పినట్టు తెలిసింది. ఒకసారి చిరు ఇంటికి వెళ్ళి భంగపడిన సుధాకర్ జరిగిన అవమానానికి మానసికంగా కుంగిపోయినట్టు చెబుతున్నారు. అతను చిరంజీవికి ఫోన్ చేసినప్పుడు చిరు అల్లు మనోభావాలను చూచాయగా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు, చిరంజీవి అల్లు అరవింద్ చేతిలో కీలుబొమ్మ అని చెప్పడానికి.

నిజానికి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్న సమయంలో అల్లు అరవిందే ఆయనను బలవంతం చేసి పాలిటిక్స్ లోకి రప్పించారు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చిరంజీవి పార్టీ గురించి చెబుతారంటూ మీడియాను పిలిపించడం, అందుకు సిద్ధంగా లేని చిరంజీవి మొహం చాటేయడం అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ఎలాగోలా చిరంజీవిని అల్లు అరవింద్ రాజకీయాల్లోకి తేగలిగారు. వయసు మీద పడుతున్న చిరంజీవి సినిమాల్లో కంటే రాజకీయాల్లో ఉండడమే తమ కుటుంబానికి మంచిదని అల్లు దూరదృష్టితో తెలుసుకున్నారు. పైగా అల్లు అర్జున్, రామ చరణ్ తేజ, పవన్ కల్యాణ్ ముగ్గురూ గొప్ప డిమాండ్ తో ఉన్నప్పుడు ఇంకా చిరంజీవి హీరోగా కొనసాగనవసరం లేదని, చిరు సినిమాల వల్ల ఈ కుర్ర హీరోల సినిమాలకు ఎంతో కొంత నష్టం జరుగుతుందని గ్రహించిన వ్యాపార మేధస్సు అల్లుది.

అయితే ఈ విషయాలన్నిటికీ అల్లు అర్జున్ ను పూర్తి బాధ్యుడిని చేయడం సమంజసం కాదు. చిరంజీవి లౌక్యుడు, స్వార్ధపరుడు అని ఒకప్పటి ఆయన సన్నిహితులు చెబుతారు. స్నేహానికి రజనీకాంత్ ఇప్పటికీ ఎంతో విలువ ఇస్తారని, చిరంజీవిలో ఆ లక్షణం లేదన్నది విమర్శ. తన అభిమానుల మీద కూడా చిరంజీవికి సదభిప్రాయం లేదని ఇటీవలే రుజువులు లభిస్తున్నాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారే గానీ పునాదిరాళ్ళుగా ఉన్న తమకు విలువలేకుండా పోయిందంటూ చిరు అభిమాన సంఘాల నాయకులు ఇటీవల అనేక సార్లు వీధులకెక్కారు.

తన జన్మదినం రోజున అభిమానులు ఇంటికి వచ్చి ఎక్కడ ఇబ్బంది పెడాతారోనని ప్రతి ఏడాది ఆయన ఆ రోజున హైదరాబాద్ లో ఉండడం లేదని మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చిన సందర్భాలు అనేకం. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. రాజకీయ నాయకుడికి నటనతో పాటు స్పందించే హృదయం కూడా ఉండాలి. సామాన్యులకు ఏదైనా చేయాలన్న ఫైర్ కడుపులో ఉండాలి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి చిరంజీవికి చాలా విషయాలు తెలియకపోవచ్చు. అటువంటప్పుడు ఆయన ఆ విషయాలను నేర్చుకుంటే ఆయనకూ సమాజానికీ మేలు జరుగుతుంది.

Posted

ALLU gadu ring master aithe siru Bonu lo unnaa chimpu, gilla gilla kottukuntunadu...bayatiki raavataniki...Ring master voorukuntada....!!! hunter tesukoni naalugu piki kurchopedutunaadu..!!!! Papam Chimpu...!!! bayata emo pilla chimpu emi cheyali ardham kaka kallu taagi bojjuntunadi...!!!

Posted

ALLU gadu ring master aithe siru Bonu lo unnaa chimpu, gilla gilla kottukuntunadu...bayatiki raavataniki...Ring master voorukuntada....!!! hunter tesukoni naalugu piki kurchopedutunaadu..!!!! Papam Chimpu...!!! bayata emo pilla chimpu emi cheyali ardham kaka kallu taagi bojjuntunadi...!!!

you rock
×
×
  • Create New...