Jump to content

Recommended Posts

Posted

చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ భరద్వాజ్ తెలుగుదేశంలో చేరబోతున్నాడా? తమపై చూపుతున్న నిరాదరణకు ఆగ్రహం చెందిన చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, అల్లుడు శిరీష్‌ భరద్వాజ్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. శిరీష్‌ ఒకడుగు ముందుకేసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం..ఈ ఎన్నికల్లో తమను పిలిస్తే ప్రచారానికి వెళదామని చిరు చిన్న కుమార్తె, అల్లుడు చాలాకాలం క్రితం భావించారు. అయితే, తాజా పరిస్థితిలో ప్రచారానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్ధి సుధీష్ రాంబోట్ల బాహ్మణుడు. శిరీష్ భరద్వాజ్ కూడా ఆయన సామాజిక వర్గానికి చెందినవారే. ఇప్పటికే శిరీష్ ఆయనను కలుసుకుని ఆయన తరఫున ప్రచారం చేయడానికి ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది.

చిన్నల్లుడంటే చిరుకి గిట్టదా?

పార్టీ పేరు ప్రకటించిన సమయంలో పెద్ద కూతురు, కొడుకు పక్కనే ఉండగా, చిరంజీవి నామినేషన్‌ సమయంలోనూ వారిద్దరే ఉన్నారు. తాజాగా రైలుయాత్ర సమయంలో కూడా వారే ఉండటంతో మనస్తాపం చెందిన చిన్న కూతురు, అల్లుడు ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో శ్రీజ తన తల్లి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిజానికి శ్రీజ ప్రేమ వివాహం తర్వాత చిరంజీవి వారి పెళ్లిని ఇప్పటికీ అంగీకరించలేదు. ఆమెకు బిడ్డ పుట్టినప్పటికీ వెళ్లలేదు. ఆ తర్వాత కొంచెం మనసు మార్చుకుని కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పటికీ, అల్లుడు శిరీష్‌తో మాత్రం ఇప్పటిదాకా మాట్లాడనేలేదు. పెళ్లయి ఏడాది దాటుతున్నా ఇప్పటిదాకా చిరు తన అల్లుడు ముఖమే చూడకపోవడం విశేషం.

సామాజిక న్యాయం గురించి గొప్పగా చెబుతున్న చిరంజీవి కులాంతర వివాహం చేసుకున్న నన్ను దూరంగా ఉంచారు. కత్తి పద్మారావు కొడుకు ప్రేమ వివాహాన్ని దగ్గరుండి మరీ జరిపించిన ఆయన మమ్మల్ని దూరంగా ఉంచి సామాజిక న్యాయం గురించి మాట్లాడటం వింతగా ఉంది. నేను ఆ సామాజికవర్గానికి చెందిన వాడిని కానందుకే ఈ శిక్ష విధించార'ని శిరీష్‌ తన మిత్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే, మీడియా సమావేశాల్లో తామంతా కలిసే ఉన్నామని చిరంజీవి చెప్పినప్పటికీ, అదంతా అబద్ధమేనని శిరీష్‌ మిత్రులు చెబుతున్నారు. అది ఇటీవలి చిరు నామినేషన్‌, రైలు యాత్రలో స్పష్టమయిందని గుర్తు చేస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలోనే శ్రీజ తన తండ్రి ఇంటికి వెళుతోందంటున్నారు.

రాజకీయాలపై బాగా ఆసక్తి ఉన్న శిరీష్‌ భరద్వాజ్‌ తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. పొలిట్‌బ్యూరోసభ్యుడొకరు ఆయనతో ఈ మేరకు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. తెలుగుయువత ప్రచార కార్యదర్శి లేదా ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తామని ఈ సందర్భంగా ప్రతిపాదించినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో ఆయన తన నిర్ణయం ప్రకటించనున్నారు. ఈ విషయంలో చిరు కుటుంబం నుంచి చాలకాలంగా ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ, ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

చిరంజీవి తమను దూరంగా ఉంచడానికి ఆయనకు అన్నీ తానయి వ్యవహరిస్తున్న ఆత్మబంధువు, టికెట్ల పంపిణీలో కీలకపాత్ర పోషించిన ఆయన సోదరి కారణమని శిరీష్‌ మిత్రులు చెబుతున్నారు. వారిద్దరి వల్లే శ్రీజ దంపతులను చిరంజీవి దూరంగా ఉంచుతున్నారన్నారు.`చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత టికెట్ల పంపిణీలో కీలకపాత్ర వహించిన ఆ బంధువు మా మిత్రుడిని చిరంజీవి దగ్గరకు తీసుకోకుండా అడ్డుపడ్డారు. ప్రేమపెళ్లి చేసుకుని మనల్ని ఏడిపించిన వాడిని దగ్గరకు తీసుకుంటే ఇంకేమైనా ఉందా అని చిరు మనసు చెడగొట్టార'ని శిరీష్‌కు అత్యంత సన్నిహితుడొకరు చెప్పారు. చిరంజీవి తండ్రి చనిపోయిన సమయంలో అక్కడికి వెళ్లిన శ్రీజ మనసు మార్చి, శిరీష్‌ను దూరం చేసే ప్రయత్నాలు కూడా జరిగాయని గుర్తుచేస్తున్నారు.

Posted

samajika nayam a gadida M---A.......... antha allu gadi sollu .....vadu vadi jathe antha.... monkeydanceds monkeydanceds

×
×
  • Create New...