Jump to content

Recommended Posts

Posted

ప్రజారాజ్యం పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేసిన మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న ఇంకా శాంతించలేదు. చిరంజీవి, నాగబాబులతో కలిసి తీయించుకున్న ఫోటోలను ఆయన తగులబెట్టారు. కర్నూలు లోని మీడియా పాయింట్ వద్ద కొద్ది రోజుల క్రితం ప్రజారాజ్యం పార్టూ జెండాలను, ప్రచార సామగ్రిని తగులబెట్టిన ఈరన్న మంగళవారం మరింత ఆగ్రహంతో ఫోటోలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23న రెండోవిడత జరుగనున్న ఎన్నికల్లో భూమా నాగిరెడ్డిని, ఆయన అనుచరవర్గాన్ని ఓడించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. భూమావర్గాన్ని ఓడించకపోతే జిల్లాలో గూండారాజకీయం విస్తరిస్తుందన్నారు. ఆలూరు నియోజకవర్గంలో ప్రజారాజ్యం రెబెల్ గా పోటీలో వున్న కురువల్లి శివరాంను, టివి గుర్తుపై ఓటువేసి, గెలిపించాలని కోరారు.

'కాంగ్రెస్ అభ్యర్ధి నీరజారెడ్డిని గెలిపిస్తే హైదరాబాద్ లోనే ఉంటుంది. సిపిఐ అభ్యర్ధి రామకృష్ణ అనంతపురంలో ఉంటారు. అందువల్ల ఈ ఇద్దరికీ ఓటువేయడం దండగ. ఇంకా అనేకమంది పోటీలో ఉన్నా వారంతా నామమాత్రులే. కురుపల్లి శివరాం బడుగువర్గాలకు చెందినవారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తారనే నమ్మకం నాకు ఉంది' అని ఈరన్న చెప్పారు. ప్రజారాజ్యం అభ్యర్ధి గెలుపుకోసం కర్నాటక మంత్రి బళ్లారి నుండి కోట్లాది రూపాయలు పంపిస్తున్నారని, ఈ విషయమై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని, అయితే ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఈరన్న వివరించారు.

Posted

MASALA EERANNA VELLI VALLA JATINI ANTHA TAGALA PETTEI ANNA seni rastraniki pattina seni vadilipoddii22810_B1b.gif

×
×
  • Create New...