Jump to content

Recommended Posts

Posted

తన  ఇంటికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తనకు రక్షణ  కల్పించాలని  ప్రజారాజ్యం పార్టీ మాజీ నేత పరకాల ప్రభాకర్ డి. జి. పి. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి కి విజ్ఞప్తి చేశారు.  పరకాల బుధవారం డి. జి. పి. మహంతిని కలిసి తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ గురించి వివరించారు.

  ప్రజారాజ్యం పార్టీ లో కీలక పాత్ర పోషించిన పరకాల ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీపై రెండు సార్లు తీవ్రమైన విమర్శలు ఆరోపణలు చేసహ్ఱు. ప్రజారాజ్యం ఒక విషవృక్షం అని ఆది పార్టీ కాదు ఒక కంపెనీ అని విమర్శించారు.

ప్రజారాజ్యంలో  అంతర్గత ప్రజాస్వామ్యం ఏ మాత్రం లేదని గతంలో ఆరోపించారు.  ప్రజారాజ్యం దాదాపు 35 నుంచి 40 మంది ఒ.సి.లను బి. సీలుగా చూపి సీట్లు కేటాయించిందని ఆరోపించి తీవ్ర సంచలనం సరస్తించారు. పరకాల ఆరోపణలు పార్టీ పైనే కాకుండా ప్రజల్లోనూ ప్రభావాన్ని చూపిందనే చెప్పాలి.  ఈ నేపథ్యంలో తనకు బెదిరింపు కాల్స్  వస్తున్నాయని తనకు సెక్యూరిటీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

×
×
  • Create New...