BuzzShah Posted February 23, 2016 Report Posted February 23, 2016 జై.. జగన్! హైదరాబాద్, న్యూస్‌లైన్: గురువారం ఉదయం చంచల్‌గూడ జైలు ప్రధాన ద్వారం నుంచి జగన్ అప్పుడే బయటకు అడుగుపెట్టారు. తనను చూసేందుకు దూరంగా నిలుచుని ఉన్నవారికి ఎప్పటిలాగే చిరునవ్వుతో అభివాదం చేశారు. ఇక అధికారులు ఏర్పాటుచేసిన నల్ల స్కార్పియో కారులోకి ఎక్కుతారనగా విన్పించిందా నినాదం..! భద్రతా అధికారులు ఉలిక్కిపడేలా విన్పించిన ‘జై.... జగన్’ నినాదం ఒక్క క్షణం అందరినీ కలవరపాటుకు గురిచేసింది. ఒక్కసారి కాదు...పలుమార్లు జై జగన్... జై జగన్ అనే నినాదం విన్పించింది. జగన్ అభిమానులెవరూ జైలు పరిసరాలలోకి రాకుండా బారికేడ్‌లు, ఇనుప కంచెలతో కట్టుదిట్టమైన భద్రత చేపట్టిన పోలీసులు.. దీంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు. అంతలోనే తేరుకుని పరిసరాలు గమనించిన వారు.. అలా నినదించింది ఓ ఎనిమిదేళ్ల బాలుడని గుర్తించారు. ఆ బాలుడి నినాదాలు విన్న జగన్‌మోహన్‌రెడ్డి కారులోకి ఎక్కబోతూ ఒక్క నిమిషం ఆగారు. ఆ బాలుడిని, పక్కనే ఉన్న అతని తల్లిని ఆప్యాయంగా చూపులతోనే పలుకరించారు. తనదైన శైలిలో చేయి ఊపారు. తర్వాత ఆయన కారు ఎక్కడంతో వాహనాలు కోఠి వైపునకు సాగిపోయాయి. జగన్ వాహనం వెళ్లిన తరువాత నినాదాలు చేసిన బాలుడు గురించి పోలీసులు వాకబు చేశారు. పాతబస్తీకి చెందిన ఆ బాలుడి పేరు శివానంద్. మూడవ తరగతి చదువుతున్నాడు. చంచల్‌గూడ జైలు సమీపంలోని చావుని ప్రాంతంలో అతని కుటుంబం నివాసం ఉంటోంది. జైల్లో ఉన్న జగన్‌ను చూడాలని శివానంద్ మారాం చేయడంతో తల్లి మల్లిక అతన్ని తీసుకుని ఉదయం 9 గంటలకే జైలు వద్దకు వచ్చారు. జగన్ అంటే తన కుమారుడికి ఎంతో అభిమానమని, ఆయన్ను చూపించాలని పదేపదే అడగడంతో తీసుకువచ్చానని మల్లిక మీడియాకు తెలిపారు. జగన్‌ను చూసిన ఆనందంలోనే తన కుమారుడు జై... జగన్ అని అన్నాడని వివరించారు. కాగా జగన్ అంకులంటే తనకెంతో ఇష్టమని శివానంద్ ఆనందంగా చెప్పాడు.
Recommended Posts