[b]జై.. జగన్! హైదరాబాద్, న్యూస్‌లైన్: గురువారం ఉదయం చంచల్‌గూడ జైలు ప్రధాన ద్వారం నుంచి జగన్ అప్పుడే బయటకు అడుగుపెట్టారు. తనను చూసేందుకు దూరంగా నిలుచుని ఉన్నవారికి ఎప్పటిలాగే చిరునవ్వుతో అభివాదం చేశారు. ఇక అధికారులు ఏర్పాటుచేసిన నల్ల స్కార్పియో కారులోకి ఎక్కుతారనగా విన్పించిందా నినాదం..! భద్రతా అధికారులు ఉలిక్కిపడేలా విన్పించిన ‘జై.... జగన్’ నినాదం ఒక్క క్షణం అందరినీ కలవరపాటుకు గురిచేసింది. ఒక్కసారి కాదు...పలుమార్లు జై జగన్... జై జగన్ అనే నినాదం విన్పించింది. జగన్ అభిమానులెవరూ జైలు పరిసరాలలోకి ర