మందార మకరంద మాధుర్యమున దేలు  మధుపంబు వోవునే, మదనములకు?  నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ జనునె, తరంగిణులకు?  లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు  కోయిల చేరునే, కుటజములకు?  పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే, సాంద్ర నీహారములకు?    అంబుజోదర దివ్య పాదారవింద  చింతనామృత పాన విశేష మత్త  చిత్త మేరీతి యితరంబు జేయ నేర్చు?  వినుత గుణ శీల, మాటలు వేయు నేల?