kingmakers Posted April 21, 2010 Report Posted April 21, 2010 మలయాళంలో సిద్దిక్ దర్శకత్వంలో నయనతార, దిలీప్ నటించిన చిత్రం 'బాడీగార్డ్'. ఈ చిత్రం మళయాళంలో అద్భుత విజయం సాదించటంతో ఇదే చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్, అశిన్ జంటగా సిద్దిక్ దర్శకత్వంలో తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కారైకాల్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా జరుగుతుంది.తిరుమయం ప్రాంతంలో జరిగిన షూటింగ్‌లో పాల్గొనేందుకు అశిన్, ఆమె తండ్రి జోసఫ్, మేకప్‌మేన్‌తో అక్కడికి వచ్చింది. వెంటనే అక్కడ ఉన్న కెమెరావ్యాన్‌లోకి వెళ్లారు. చాలా సమయం గడిచినా ఆమె షూటింగ్ స్పాట్‌కు రాలేదు. దీంతో అనుమానించిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కెమెరా వ్యాన్ తలుపు తెరిచి చూశారు.వ్యాన్‌లో అశిన్‌తో పాటు ఆమె తండ్రి, మేకప్‌మెన్ స్పృహతప్పి పడిపోయి ఉన్నారు. వెంటనే షూటింగ్‌ను ఆపివేసి అశిన్‌తో పాటు ముగ్గురిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ముగ్గురు కోల్కొని షూటింగ్ స్పాట్‌కు వచ్చారు. కెమెరా వ్యాన్‌లో గ్యాస్ లీకేజీతో వీరు స్పృహతప్పినట్లు విచారణలో తేలింది. వెంటనే మరో కెమెరావ్యాన్‌ను అక్కడి రప్పించారు. 3గంటల తరువాత మళ్లీ షూటింగ్ ప్రారంభమైంది
Recommended Posts