SweetBreeze Posted April 27, 2016 Report Posted April 27, 2016 అల్లు బాబుకు ఇంకో సినిమా తగిలింది April 27th, 2016, 04:38 PM IST మెగా ఫ్యామిలీ హీరోల్లో దాదాపుగా అందరూ స్థిరపడ్డారు. అందరికంటే లేటుగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ కూడా హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించాడు. తొలి సినిమా ‘రేయ్’ చేదు అనుభవాన్ని మిగిల్చినప్పటికీ సాయిధరమ్ సైతం నిలదొక్కుకున్నాడు. కానీ అల్లు అరవింద్ చిన్న కొడుకు.. బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ పరిస్థితే అయోమయంగా ఉంది. తొలి సినిమా ‘గౌరవం’ ఫ్లాప్ కావడమే కాదు.. అతడికి చాలా చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘కొత్త జంట’ సైతం చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇప్పుడిక శిరీష్ ఆశలన్నీ ‘శ్రీరస్తు శుభమస్తు’ మీదే ఉన్నాయి. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా మీదే దృష్టిపెట్టాడు శిరీష్. ఆ సినిమాను ఇటీవలే పూర్తి చేసిన శిరీష్.. అది విడుదల కాకుండానే ఇంకో అవకాశం దక్కించుకోవడం విశేషం. డెబ్యూ డైరెక్టర్ మల్లిడి వేణు దర్శకత్వంలో శిరీష్ ఓ సినిమా చేయబోతున్నాడు శైలేంద్ర ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ వేణు నితిన్ హీరోగా సినిమా చేయాలని ప్రయత్నించాడు. ఓ దశలో ఆ ప్రాజెక్టు ఓకే అయింది కూడా. కానీ ఏవో కారణాల వల్ల పట్టాలెక్కలేదు. తాను చెప్పిన కథను శిరీష్ ఓకే చేయడంతో సినిమా మొదలుపెట్టేస్తున్నాడు. మరోవైపు ‘సోలో’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీరస్తు శుభమస్తు’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. లావణ్య త్రిపాఠి.. ప్రకాష్ రాజ్.. తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను ‘సోలో’ తరహాలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మలిచాడు పరశురామ్. ఈ సినిమా జూన్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. - See more at: http://telugu.gulte.com/tmovienews/14771/Allu-Sirish-Gearing-up-for-next-project#sthash.WXA19rm1.dpuf Quote
rrc_2015 Posted April 27, 2016 Report Posted April 27, 2016 baboi allu sirish anta ... paaaaarrriiii poooooooooooooonnddroooooo ............. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.