అదిగదిగో... విజయ పతాక! సింధు రాక నేడే... ఘన స్వాగతానికి ఏర్పాట్లు విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వరకు ప్రదర్శన భారత జాతి జై కొట్టింది... జనబంధు మురిసింది... నగర క్రీడా ఖ్యాతి ఖండాంతరమై విరిసింది... తెలుగు తేజం తెగువకు ప్రపంచమే నివ్వెరపోయింది... గగనమంత ఘనత సొంతమై నగరాన అడుగిడుతున్న భాగ్యనగర ముద్దుబిడ్డా నీకిదే మా స్వాగతాంజలి..
విజయ యాత్ర ఇలా.. ఉదయం 9.20-9.30: విమానాశ్రయానికి రాక, ప్రముఖులు,
ముఖ్యుల నుంచి అభినందనల స్వీకరణ
9.30-10.00: తోటి క్రీడాకారులు, క్రీడా సంఘాల అభినందన