అనంతనాగ్‌: ‘మేం బస్సులో ఉన్నాం. బయట అంతా చీకటిగా ఉంది. అంతలో ఒక్కసారిగా కాల్పుల శబ్ధాలు. బస్సుపైకి బులెట్ల దూసుకొస్తున్నాయి. అయినా సరే డ్రైవర్‌ బస్సును ఆపకుండా కిలోమీటర్‌ దూరం తీసుకొచ్చాడు’ అని అమర్‌నాథ్‌ ఘటనలో గాయపడిన మహారాష్ట్రకు చెందిన భాగ్యమణి తెలిపారు. పవిత్ర అమర్‌నాథ్‌ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులు సోమవారం రాత్రి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు యాత్రికులు మృతిచెందగా.. మరో 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అనంత్‌నాగ్‌ ఆసుప