ఔషధ రంగంలో ఏపీని దేశానికే ముఖ్యకేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో ఫార్మారంగ అభివృద్ధికి అచ్యుతాపురం-రాంబిల్లి, కృష్ణపట్నం, పులివెందుల, డిండి ప్రాంతాలలో భారీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. నవ్యాంధ్రప్రదేశ్ నుంచి రూ.12 వేల కోట్ల మేర ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని, 39,162 మంది ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 162 ఫార్మా యూనిట్లు ఉండగా, రానున్న కొద్దికాలంలో ఈ సంఖ్య రెండు, మూడు రెట్లు పెరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకో