నవ్యాంధ్ర రాజధానిలో అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్న హైపర్‌లూప్‌ వన్‌ సంస్థ దానికి సంబంధించిన విశేషాలను సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రికి వివరించింది. హైపర్‌లూప్‌ పరిజ్ఞానం ద్వారా అత్యాధునిక రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని, ఈ వ్యవస్థ కార్యరూపం దాల్చితే అమరావతి నుంచి విశాఖకు 23 నిమిషాల్లో, తిరుపతికి 25 నిమిషాల్లో చేరుకోగలుగుతామని హైపర్‌లూప్‌ వన్‌ సంస్థ పేర్కొంది. మెట్రో కంటే వేగవంతమైన ఈ రవాణా వ్యవస్థ ప్రాజెక్ట్ పై అధ్యయనం చేసి సాధ్యాసా