yaman Posted December 30, 2017 Author Report Posted December 30, 2017 పెద్ద నోట్ల రద్దు, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల ప్రతికూలతల మధ్య ఎటు పయనించాలో తెలియని స్థితిలో ఈ ఏడాది మన మార్కెట్ ప్రయాణం ప్రారంభమయ్యింది. సెన్సెక్స్ 25,000 దిగువకు.. నిఫ్టీ 7000 కిందకు వచ్చేస్తాయని లెక్కలుకట్టారు ఆ సమయంలో చాలా మంది. వాస్తవానికి అప్పుడు పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంది. బడ్జెట్ వరకు అదే నిస్తేజం.. అదే నిసత్తువ. ఎప్పుడైతే బడ్జెట్ ప్రతిపాదనలు వెల్లడయ్యాయో.. ఆ రోజు నుంచి మార్కెట్ దిశే మారిపోయింది. ఒక్కసారిగా వేగాన్ని పెంచిన సెన్సెక్స్.. కొద్ది రోజుల్లోనే 30000 పాయింట్లను అధిగమించింది. అంతకంటే ముందే నిఫ్టీ 9000 లాంఛనాన్ని పూర్తి చేసింది. విదేశీ మార్కెట్ల సానుకూల పవనాలు, ప్రభుత్వ సంస్కరణలు, కంపెనీల ప్రోత్సాహకర ఫలితాలు జోష్ నింపడంతో కొత్త రికార్డులే లక్ష్యంగా సూచీలు ముందుకు సాగాయి. 31,000.. 32,000.. 33,000 ఇలా ఒక్కో మైలురాయిని దాటుకుంటూ సెన్సెక్స్ దూసుకెళ్లింది. నిఫ్టీ తొలిసారి ఐదంకెల పాయింట్లను అందుకుంది. అప్పుడప్పుడు మదుపర్లను ఉత్తరకొరియా భయపెట్టినా.. మార్కెట్ జోరుముందు ఆ ప్రభావం చిన్నబోయింది. ఏడాది ఆఖర్లోనూ సూచీల జైత్రయాత్ర కొనసాగింది. సెన్సెక్స్ 34,000; నిఫ్టీ 10,500 పాయింట్లనూ అధిగమించేశాయి. సంవత్సరం చివరిరోజున లాభాలతో ముగియడమే కాకుండా మరో కొత్త శిఖరాలను చేరాయి. సెన్సెక్స్ 209 పాయింట్ల లాభంతో 34,056.83 వద్ద ముగిసింది. నిఫ్టీ 52.80 పాయింట్లు పెరిగి 10,530.70 వద్ద స్థిరపడింది. ఇలా ఈ ఏడాది బిక్కుబిక్కుమంటూ మధ్య మొదలైన మన స్టాక్ మార్కెట్ ప్రయాణం.. ఊహించని లాభాలతో ముగిసింది. అందుకే ఇలాంటి అత్యుత్తమ సంవత్సరం మళ్లీ మళ్లీ రావాలని కోరుకుందాం. Quote
guduraju Posted December 30, 2017 Report Posted December 30, 2017 Lupin year end lo pedda bokka Quote
TampaChinnodu Posted December 30, 2017 Report Posted December 30, 2017 banks index 40% raised aa. baaledu annaru gaa vaati condition , ina kooda raised aa. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.