Skip to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

క్లౌడ్‌ వర్డ్‌తో కొత్త ప్రయోగం

Featured Replies

636564211653136707.jpg
  • ప్రజా సమస్యల వార్తలు.. తక్షణం ప్రభుత్వ దృష్టికి
  • తొలుత పంచాయతీరాజ్‌లో అమలు
  • మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యేక చొరవ
  • త్వరలో అన్ని శాఖలకు విస్తరణ
అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): రోజూ పత్రికల్లో అనేక వార్తలు వస్తుంటాయి. రాజకీయ కథనాలతోపాటు ప్రజా సమస్యలపై వచ్చే వార్తలు ఎన్నో. వీటిని చదివి స్పందించే ప్రజాప్రతినిధులు, అధికారులు అరుదుగా ఉంటారు. కానీ ఈ విషయంలో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి నారా లోకేశ్‌. సమస్య ఏదైనా...సంబంధిత మంత్రి వరకూ అది చేరేలా క్లౌడ్‌వర్డ్‌ అనే సాంకేతికతను రూపొందించారు. కేవలం చదివి ఊరుకోకుండా వాటిని పరిష్కరించేందుకు కూడా చొరవ తీసుకుంటున్నారు.
 
 
ప్రజా సమస్యలను లేవనెత్తుతూ రాసే వార్తలన్నింటినీ క్రోడీకరించే సాంకేతికత ‘క్లౌడ్‌వర్డ్‌’లో ఉంది. ముందుగా తన పంచాయతీరాజ్‌ శాఖలోనే ఆయన దీనిని ఏర్పాటు చేసుకుని సక్సెస్‌ అయ్యారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి సంబంధించిన సమస్య అయినా, ఆయా జిల్లాలు, మండలాల పేజీల్లో ఇచ్చిన వార్తలైనా అన్నీ సాయంత్రానికి ఆయనకు చేరిపోతాయి. వాటిని రాత్రికి రాత్రే ఉన్నతాధికారులకు పంపిస్తారు. మర్నాడు ఉదయం నుంచి ఆ సమస్యలపై స్పందన ఉంటుంది. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణతో పాటు, ఇతర కార్యక్రమాల సక్రమ అమలుకు ఇది తోడ్పాటు ఇస్తుండటం విశేషం. అదే సమయంలో ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి వచ్చేందుకు క్లౌడ్‌వర్డ్‌ వారధిగా మారుతుందని భావిస్తున్నారు.
 
 
సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌
రాష్ట్రంలో ఏటా 15శాతం వృద్ధిరేటు సాధించాలని ప్రభుత్వం శ్రమిస్తోంది. ఏపీ ఫైబర్‌నెట్‌ ఏర్పాటుచేసి రూ.149కే వైఫై, టెలివిజన్‌, టెలిఫోన్‌ సేవలు అందిస్తున్నారు. డాటా వినియోగం పెరిగితే వృద్ధిరేటు పెరిగే అవకాశం ఉంది. అయితే సాంకేతికత వినియోగం పెరిగే కొద్దీ సైబర్‌ దాడి కూడా అధికంగా ఉంటుంది. అందుకే ఆ సమస్య ఎదురుకాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పేందుకు ‘అకమై’ కంపెనీ అంగీకరించింది.
 
 
ఈ కంపెనీ ఆసియా పసిఫిక్‌, జపాన్‌ డైరక్టర్‌ గ్రామీ బియర్డ్సెల్‌తో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇటీవల చర్చలు జరిపారు. సైబర్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ అందివ్వడంలో అకమైకు మంచి పేరుంది. టెక్నాలజీతో అనుసంధానమై ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే ఈ సెంటర్‌ లక్ష్యం. ఏపీతో కలిసి పనిచేయాలని మంత్రి నారా లోకేశ్‌ కోరడంతో...అకమై ప్రతినిధులు స్పందిస్తూ ఐఐడీటీతో భాగస్వామ్యం అవుతామని, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేస్తామని తెలిపారు.
 
 
ఎలా గుర్తిస్తారు?
చాలా సింపుల్‌. ఉదాహరణకు నీటిఎద్దడి అనే పదం ఉందని అనుకుందాం. ఆ పదాన్ని క్లౌడ్‌వర్డ్‌లో టైప్‌ చేస్తే..ఆ రోజు నీటిఎద్దడి అనే పదంతో వచ్చిన వార్తలన్నీ ఇందులో కనిపిస్తాయి. అందులోనూ విభాగాలుంటాయి. ఒకే పదం మూడు నాలుగు రంగుల్లో కనిపిస్తుంది. ఒక్కో రంగు అక్కడి సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. ఎరుపు రంగులో పదం కనిపించిందని అనుకుందాం. అంటే సమస్య చాలా తీవ్రమని అర్ధం చేసుకుంటారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రం కూడా ఈ అంశాలను సమీక్షించి పరిష్కారానికి వెంటపడుతుంది. ప్రజా సమస్యలు తెలుపుతూ...ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే వార్తలు కూడా క్లౌడ్‌వర్డ్‌కు అందుతాయి. అదే సమయంలో ఆయా సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కరిస్తే ఆ సమాచారం కూడా చేరుతుంది.
 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.