హైదరాబాద్‌ను తాను కట్టించానని ఎక్కడా చెప్పలేదని, కులీకుతుబ్‌షా దాన్ని కట్టారన్నారు. సైబరాబాద్‌ను తానే కట్టానని స్పష్టంచేశారు. శంషాబాద్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, మైక్రోసాఫ్ట్ కంపెనీని తాను తీసుకొచ్చానన్నారు. దేశంలో అత్యున్నత నగరంగా హైదరాబాద్ ఎదగడంలో అడుగడుగునా తన కృషి, కష్టార్జితం ఉందన్నారు. తాను చేసిన అభివృద్ధిని, తన విజన్‌ను కాంగ్రెస్ ఆరోజున చెడగొట్టకుండా కొనసాగించినందువల్లే అభివృద్ధి సాధ్యమైందన్నారు. విభజన జరిగిన తర్వాత కేసీఆర్ వచ్చి చెడగొట్టారని విమర్శించారు.