చంద్రబాబు కంటే లోకేష్ జాతకం చాలా బాగుంది’ 12-12-2018 15:24:30   హైదరాబాద్:  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే ఆయన కుమారుడు లోకేష్ జాతకం చాలా బాగుందని జ్యోతిష్య గురువు రమణారావు పేర్కొన్నారు. లోకేష్ జాతకం బాగుండటం వలనే ప్రభుత్వం సక్రమంగా నడుస్తోందని ఆయన అన్నారు. ఏపీలో చంద్రబాబు పరిస్థితి బాగాలేదని రమణారావు అన్నారు. ఏపీ సచివాలయంలో చంద్రబాబుకు నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయన్నారు. ఏపీ సచివాలయంలో భారీ మార్పులు చేస్తే చంద్రబాబుకు రాజకీయంగా బాగుంటుందని ఆయన జోస్యం చెప్పారు.