పవన్‌తో సినీ నటుడు అలీ భేటీ  అమరావతి: ప్రముఖ హాస్యనటుడు అలీ రాజకీయ ప్రవేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈనెల 9న అలీ వైకాపాలో చేరనున్నారని సామాజిక మాధ్యమాల్లో నిన్న విస్తృత ప్రచారం జరిగింది. అయితే, ఈ రోజు ఉదయం అలీ హఠాత్తుగా విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. విజయవాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ .. అలీని జనసేన పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరే విషయంపై త్వరలో నిర్