ఈరోజు శాసన సభలో డ్రాట్ చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే అబద్దాలు చెప్పి ఛాలెంజ్ చేయడం చూశాం. కరవు గురించి మాట్లాడాలి, అదితప్ప అన్ని విషయాలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీపై, వ్యక్తిగతంగా నాపై దాడి చేయడం, కించపరచడం చూశాం. 35ఏళ్లుగా ఎమ్మెల్యేగా నేను ఈ సభలో ఉన్నాను. ఇంత దుర్మార్గంగా, బాధాకరంగా వ్యవహరించడం చూడలేదు. ‘అక్కడ ప్రాజెక్టులు కడుతుంటే గాడిదలు కాస్తున్నారా’ అని ముఖ్యమంత్రి అంటారు... ‘దొబ్బేయండి’ అని మంత్రి అంటారు. ఇదేనా ముఖ్