తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాలను కూల్చి నూతన అసెంబ్లీని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టిపారేసింది. ఎర్రమంజిల్‌లోని చారిత్రాత్మక భవనాలను కూల్చి ఆ స్థానంలో కొత్త భవనాలకు తెలంగాణ ప్రభుత్వం భూపూజ కూడా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గం కూడా ఏకగ్రీవం తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఎర్రమంజిల్ భవనాలను కూల్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ కలిపి ఉమ్మడిగా విచారించిన ధర్మాససం