1 [December 12th 1998 అమెరికా లో ఒక నగరం…]   [ఉదయం 7:00 గంటలు , అలారం మోగుతూ వుంది... ]   బద్ధకంగా లేచాడు అవినాష్, లేచి ఆలా కూర్చుని శూన్యం లోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు…     ఎంత ప్రయత్నిస్తున్నా, తన ఆలోచనలు మరలటం లేదు, తనని  విడిచి వెళ్లిపోయిన తన ప్రేమికురాలు గురించి. అంత సులభం గా మరిచిపోగలిగితే అది ప్రేమ ఎలా అవుతుంది? అలా అని గుర్తుకుతెచ్చుకుని  సాధించేదేమీ లేదు...కానీ  ఆ జ్ఞాపకాలే అతని జీవిత గుణపాఠాలు...    అలా తన జ్ఞాపకాల లోతుల్లోకి జారుకున్నాడు...