అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దావిద్‌ సిటీలోని సెంట్రల్‌ పార్కులో ఉన్న భారత జాతిపిత విగ్రహాన్ని ధ్వంసంచేయడంపై భారతీయ అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాత్యహంకార దుశ్చర్యపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత విదేశాంగ శాఖ ఈ చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొంది. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది. ఈ ఘటనపై అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు జరుపు