నగ్న వీడియోలు, ఫొటోల చిత్రీకరణ వాటితో బెదిరింపులు.. రెండుసార్లు గర్భస్రావం గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: నగ్న వీడియోలతో తనను బెదిరించి లొంగదీసుకుని.. పెళ్లి చేసుకుని.. బలవంతంగా మతమార్పిడి చేయడంతో పాటు.. తనను చిత్రహింసలు పెట్టి, ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని గుంటూరుకు చెందిన ఓ యువతి గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేశారు. సినీనటి కరాటే కల్యాణి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి వచ్చిన బాధిత యువతి ఫిర్యాదుచేసిన తర్వాత విలేకర్లతో మాట్లాడారు.  ‘గుం