విశాఖలోని విలువైన భూములపై కొందరు అక్రమార్కుల కన్ను పడింది. ఎలాగైనా వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడిన వారి స్థలాలపై దృష్టి పెట్టి స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం తప్పుడు జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) సృష్టించి తప్పుడు సంతకాలు, ఇతర వివరాలతో ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకునే యత్నం చేస్తున్నారు. స్థల యజమానులకు తెలియకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయి. విశాఖ నగర పరిధి కొమ్మాదిలో రూ.100కోట్ల విలువ చేసే స్థలానికి ఈ తరహాలో రిజిస్ట్రేషన్‌ చేసేందుకు మధురవాడ సబ్‌