లండన్‌: ‘ఒమిక్రాన్‌’ కారణంగా వచ్చే ఏప్రిల్‌ చివరినాటికి 25,000 నుంచి 75,000 వరకూ మరణాలు చోటుచేసుకోవచ్చని తాజా అధ్యయనం హెచ్చరించింది! డెల్టా కారణంగా ఈ ఏడాది జనవరిలో నమోదైన కేసులతో పోలిస్తే, ఒమిక్రాన్‌ ఉద్ధృతి మరింత జోరుగా ఉంటుందని అంచనా వేసింది. ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌’ శాస్త్రవేత్తలు ఈ విశ్లేషణ సాగించారు. వ్యాక్సినేషన్‌ కారణంగా శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలను సైతం ఒమిక్రాన్‌ తప్పించుకుంటోంది. అందుకే టీకా రెండు డోసులు తీసుకున్నవారు కూడా ఈ వేరియంట్‌కు గురవుతున్నారు