Jump to content

Rip super star Krishna


kakatiya

Recommended Posts

krishna15.webp

సూపర్‌స్టార్ కృష్ణ ఇకలేరు. అశేష సంఖ్యలో ఉన్న అభిమానుల్ని శోకసంద్రంలో ముంచివేస్తూ ఆంధ్రాజేమ్స్ బాండ్ మరలిరాని లోకాలకు తరలిపోయారు. బుర్రిపాలెం బుల్లోడు కృష్ణ కన్ను మూశారు. ఆదివారం అర్ధ రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స కోసం చేరిన ఆయన, మంగళవారం తెల్లవారిజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. 1942 మే 31న తెనాలి దగ్గరలోని బుర్రిపాలెం గ్రామంలో కృష్ణ జన్మించారు. ఆయన తల్లితండ్రులు నాగరత్నం, వీరరాఘవయ్య చౌదరి. ఐదుగురు సంతానంలో కృష్ణే పెద్దవారు.  

50 సంవత్సరాల నట జీవితంలో కృష్ణ 365 సినిమాల్లో నటించారు. 2016లో విడుదలైన 'శ్రీశ్రీ' ఆయన చివరి చిత్రం. నటునిగా, నిర్మాతగా ఆయన చేసినన్ని ప్రయోగాలు, సాహసాలు మరే నటుడూ చేయలేదనే కీర్తిని పొందారు. అన్ని రకాల జానర్ సినిమాల్లో ఆయన నటించారు. సాంఘిక, జానపద, పౌరాణిక సినిమాల్లో నటించిన కృష్ణను స్వల్ప కాలంలోనే స్టార్ హీరోగా చేసినవి యాక్షన్ అండ్ క్రైం సినిమాలే. అలాగే 'గూఢచారి 116'తో ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా, 'మోసగాళ్లకు మోసగాడు ' సినిమాతో ఇండియన్ కౌబాయ్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు. 'అల్లూరి సీతారామరాజు ' సినిమా ఆయన సినీ జీవితంలోనే కలికితురాయిగా నిలిచింది.  For more information visit Teluguone.com official website

Click here to get more details about Super star Krishna's death details

Link to comment
Share on other sites

krishna-funeral-update.webp

సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఆనారోగ్యంతో ఆస్పత్రి పాలైన ఆయన చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణ పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి తరలించారు. ఎందరో ప్రముఖులు ఆయనకు నివాళి అర్పించడానికి తరలి వెళ్తున్నారు.

ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్ధం కృష్ణ పార్ధివదేహాన్ని ఉంచనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం. కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. For more information visit teluguone.com official website

Click here to get more details about Superstar krishna's funeral updates

Link to comment
Share on other sites

1 hour ago, kakatiya said:

Satyanarayana , murali Mohan is there

They are side artists , when we say industry NTR, ANR, krishna, krishnam raju , these are the main people we rememeber 

Link to comment
Share on other sites

11 hours ago, id_ego_superego said:

Hitchcock range suspension thriller in Telugu 

 

i remember a lot of fuss about this movie in my home when i am small. manollaki thriller movies thakkuva kada...

  • Upvote 1
Link to comment
Share on other sites

3 members in 2022. Really sad.

8 జనవరి 2022 - అన్నయ్య రమేష్ బాబు
28 సెప్టెంబర్ 2022 - అమ్మ ఇందిరా దేవి గారు
15 నవంబర్ 2022 - నాన్న కృష్ణ గారు
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...