Jump to content

Itlu maredumilli prajaneekam movie review


Telugumoviereviews

Recommended Posts

maredumilli-movie-review.webp

విభిన్న పాత్రలు పోషించి మెప్పించగల సత్తా ఉన్న నటుడు అల్లరి నరేష్. అయితే అతను ఎక్కువగా కామెడీ సినిమాలు చేయడంతో, అడపాదడపా విభిన్న పాత్రలు పోషించినప్పటికీ అతనిపై కామెడీ హీరో అనే ముద్ర పడింది. ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. 'నాంది' సినిమాతో దానికి బలమైన పునాది వేసుకున్న నరేష్.. ఇప్పుడు 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనే మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. మరి అల్లరోడు 'నాంది' లాంటి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడో లేదో తెలుసుకుందాం.

కథ:
మారేడుమిల్లి అనే అటవీ ప్రాంతంలో కొండపైన సుమారు 300 మంది నివసిస్తుంటారు. చుట్టూ ప్రపంచమంతా ఇంత అభివృద్ధి చెందుతున్నా, వారికి కనీస వసతులు కూడా ఉండవు. బడి ఉండదు, ఆసుపత్రి ఉండదు, రోడ్డు కూడా ఉండదు. ఆపదలో ఉన్నవారిని సిటీలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లాలంటే.. భుజాలపై మోసుకుంటూ అంతంత దూరం తీసుకెళ్లేసరికి వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. అందుకే అడవిని ఆనుకొని ఉన్న వాగుపై వంతెన నిర్మిస్తే తమ ప్రాణాలు నిలబడతాయని భావించి ఎన్నో ఏళ్ళ నుంచి వేడుకుంటున్నా ప్రభుత్వం గానీ, అధికారులు గానీ పట్టించుకోరు. ఇంతలో ఆ గ్రామం ఉన్న నియోజకవర్గంలో ఎన్నికలు వస్తాయి. ఆ జిల్లా కలెక్టర్(సంపత్ రాజ్) ఈసారి వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా చూడాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. అందులోభాగంగా అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఓటుపై అవగాహన కలిగించడం కోసం ఎలక్షన్ డ్యూటీలో ఉన్న తెలుగు టీచర్ శ్రీనివాసరావు(అల్లరి నరేష్) కాస్త ముందుగానే అక్కడికి వెళ్తాడు. అయితే తమ బతుకుల్ని పట్టించుకోనప్పుడు తాము ఓటు ఎందుకు వేయాలంటూ మారేడుమిల్లి ప్రజలు ఎదురు తిరుగుతారు. సాటి మనిషి కష్టంలో ఉంటే స్పందించే మనసున్న శ్రీనివాసరావు మారేడుమిల్లి ప్రజల కోసం ఏం చేశాడు? వారందరి చేత ఓట్లు వేయించడానికి వెళ్లిన అతని లక్ష్యం నెరవేరిందా? ఏ సంబంధంలేని వారి కోసం అతను ప్రాణాలకు తెగించి ఎందుకు పోరాడాల్సి వచ్చింది? అతని పోరాటం వల్ల మారేడుమిల్లి ప్రజల బ్రతుకులు మారాయా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

'నాంది' తర్వాత అల్లరి నరేష్ నుంచి వచ్చిన మరో మంచి ప్రయత్నం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ప్రేక్షకులను ఆలోచనలో పడేసే ఆవేదన ఈ కథలో ఉంది. హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఉన్నాయి. ద్వితీయార్థం మీద మరింత దృష్టి పెట్టుంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Itlu maredumilli prajaneekam movie review and rating

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...