Jump to content

Rajamouli speech at hit 2 pre release event


Telugumoviereviews

Recommended Posts

rajamouli-suggestion-for-nani.webp

దర్శకధీరుడు రాజమౌళి సినిమాని ఎంత గొప్పగా తెరకెక్కిస్తాడో, అంతకంటే గొప్పగా ప్రమోట్ చేస్తాడు. సినిమాని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లడం కోసం ఆయన అనుసరించే ప్రమోషనల్ స్ట్రాటజీలు బాగుంటాయి. అందుకే ఆయనను మాస్టర్ మైండ్ అంటుంటారు. తాజాగా ఆయన నేచురల్ స్టార్ నానికి అదిరిపోయే సలహా ఇచ్చారు.

నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో రూపొందిన 'హిట్-2' డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2020లో విడుదలై విజయం సాధించిన 'హిట్'కి ఇది సీక్వెల్. ఈ ఫ్రాంచైజ్ లో మొత్తం ఏడు సినిమాలు రానున్నాయని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చే సినిమాల విడుదల విషయంలో ఒక స్ట్రాటజీ ఫాలో అయితే బాగుంటుందని రాజమౌళి సలహా ఇచ్చారు.

సోమవారం సాయంత్రం జరిగిన 'హిట్-2' ప్రీ రిలీజ్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. "మన దేశంలో ఇలాంటి ఫ్రాంచైజ్ లేదు. హీరో, దర్శకుడు ఎవరని ఆలోచించకుండా హిట్ సిరీస్ చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగేలా చేశారు. అయితే ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చే సినిమాలను ప్రతి ఏడాది ఒకే సీజన్ లో విడుదల చేస్తే బాగుంటుంది. ఇది హిట్ సీజన్ అని ప్రేక్షకులకు అర్థమయ్యేలా ప్రతి ఏడాది ఒకే సమయంలో విడుదల చేయాలి" అని రాజమౌళి సూచించారు. For more information visit Teluguone.com official website

Click here to get more details about Hit 2 movie latest updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...