Jump to content

20 years for khadgam movie


Telugumoviereviews

Recommended Posts

20-years-of-khadgam.webp

కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన అద్భుతమైన సినిమాలలో 'ఖడ్గం' ఒకటి. దేశభక్తిని పెంపొందించేలా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ప్రసారమైతే ఇప్పటికీ ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ప్రేక్షకుల హృదయాల్లో అంతలా స్థానం సంపాదించుకున్న ఈ చిత్రం విడుదలై నేటికి 20 ఏళ్ళు పూర్తయింది.

దేశభక్తి, మత ఘర్షణలు వంటి సున్నిత అంశాలను కృష్ణవంశీ చక్కగా చూపించారు. కొన్ని కొన్ని సన్నివేశాలు కదిలించేలా, కంటతడి పెట్టించేలా ఉంటాయి. 'ఖడ్గం'లో ప్రతి పాత్ర పవర్ ఫుల్ గా గుర్తుండిపోయేలా ఉంటాయి.

దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ చిత్రంలో 'నువ్వు నువ్వు', 'అహ అల్లరి', 'మేమే ఇండియ‌న్స్', 'గోవిందా గోవిందా', 'ముసుగు వేయొద్దు', 'ఖ‌డ్గం ఖ‌డ్గం' ఇలా అన్నీ పాట‌లు విశేష ఆదరణ పొందాయి. కార్తికేయ మూవీస్ బ్యానర్ పై సుంకర మధుమురళి నిర్మించిన ఈ చిత్రం 2002 నవంబరు 29న విడుదలై ఘన విజయం సాధించింది. ఉత్తమ దర్శకులు(కృష్ణవంశీ)తో పాటు మొత్తం ఐదు విభాగాల్లో ఈ చిత్రం నంది అవార్డులు గెలుచుకుంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about 20 years for khadgam movie News

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...