Mediahypocrisy Posted September 11, 2023 Report Posted September 11, 2023 ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో.. గత రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే చంద్రబాబు అరెస్ట్‌ను టీడీపీతో పాటు పలు రాజకీయ పక్షాలు ఖండిస్తున్నాయి. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కక్ష సాధింపులా కనిపిస్తుందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ చేసిన విధానం సరికాదు. తప్పు జరిగితే విచారణ జరిపించాలని.. ప్రతీకారంతో ఎవరినీ ఏమీ చేయకూడదని అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు సమర్థనీయం కాదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, చంద్రబాబు అరెస్ట్‌ను రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి మనోజ్ ఝా ఖండించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులపై విపరీత ధోరణితో వెళ్లడం భారత రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌గా మారిందని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను కటకటాల వెనక్కి నెట్టడం ప్రధాని మోదీ, హెచ్‌ఎం అమిత్ షా సంప్రదాయమని.. కొత్త శిష్యులు కూడా దానిని ఫాలో అవుతున్నారని మనోజ్ ఝా అన్నారు. ప్రత్యర్థులను జైలు పెట్టడాన్ని మోదీ, అమిత్ షాల నుంచి జగన్ నేర్చుకున్నారని.. అలాంటి చర్యలకు ఎక్కువ కాలం ఉండదని అన్నారు. చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదని.. ఆధునిక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని చెప్పారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ స్పందించారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్ట్ సరికాదన్నారు. ఎలాంటి వివరణ అడగకుండా టీడీపీ అధినేతను అరెస్ట్ చేశారన్నారు. ఎఫ్ఐఆర్‌లో పేరు చేర్చకుండానే అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఆయనను అరెస్ట్ చేసిన తీరును బీజేపీ తప్పుబడుతోందన్నారు. Quote
Mediahypocrisy Posted September 11, 2023 Author Report Posted September 11, 2023 I guess TG BJP expecting Babu support in next assembly elections.... Laxman always supports Babu Quote
Mediahypocrisy Posted September 11, 2023 Author Report Posted September 11, 2023 It looking like a triangle love story...Babu likes modi...INDIA kutami likes Babu... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.