Jump to content

felli ayina ventane batting lo record srushtinchina Shoaib Malik - manchi aata gaade!


Recommended Posts

Posted

batting ante whato whatu anukuni vachi sachara mee mohal manda....cricket pitch meedha batting raa..meeru anukune grassy/wet pitch kaadu...idhigo sadivi saavandi..

Shoaib Malik: పెళ్లైన కొద్ది గంటల్లోనే షోయబ్‌ మాలిక్ అరుదైన ఘనత

Eenadu
~3 minutes

మూడో పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్ మరో అరుదైన ఘనత సాధించాడు. 

Published : 21 Jan 2024 10:50 IST

210124shoaib-malik-sr1.jpg

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ షోయబ్‌ మాలిక్ సృష్టించిన ఓ రికార్డు నెట్టింట వైరల్‌గా మారింది. మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు శనివారం సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైన క్రమంలో షోయబ్‌ మాలిక్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 13 వేలకుపైగా పరుగులు చేసిన తొలి ఆసియా క్రికెటర్‌గా అవతరించాడు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (BPL)లో ఫార్చూన్ బరిషల్‌ తరఫున బరిలోకి దిగాడు. రాంగ్‌పుర్‌ రైడర్స్‌ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్య ఛేదనలో షోయబ్‌ 18 బంతుల్లో 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన జట్టును గెలిపించాడు. 

టీ20 కెరీర్‌లో 13,010 పరుగులు చేసిన బ్యాటర్‌గా షోయబ్‌ నిలిచాడు. అతడి కంటే క్రిస్‌ గేల్ (14,562) మాత్రమే ముందున్నాడు. మాలిక్ మొత్తం 526 మ్యాచ్‌లు ఆడాడు. 124 అంతర్జాతీయ టీ20ల్లో 2,435 పరుగులు చేశాడు. మిగతావన్నీ ఫ్రాంచైజీ క్రికెట్‌లోనే ఆడాడు. ఐపీఎల్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన మాలిక్.. పాకిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌, కరేబియన్‌ లీగ్‌, బీపీఎల్‌తో సహా ఇతర టోర్నీల్లో పాల్గొన్నాడు. 

వచ్చే టీ20 ప్రపంచ కప్‌ కోసం సన్నద్ధత

పాకిస్థాన్‌ తరఫున టెస్టులు, వన్డేలకు వీడ్కోలు పలికిన షోయబ్‌ మాలిక్‌ టీ20లకు మాత్రం విశ్రాంతి ప్రకటించలేదు. ఇటు ఫ్రాంచైజీ లీగుల్లో ఆడుతూనే.. జాతీయ జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. జూన్ నుంచి మొదలయ్యే పొట్టి కప్‌ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. జట్టు ఎంపికకు అందుబాటులో ఉంటానని ఇప్పటికే ప్రకటించాడు. అయితే, యువకులతో పోటీపడి అతడు ఎంపిక కావడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

 

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...