Jump to content

500 yrs dream about to be fulfilled


psycopk

Recommended Posts

https://www.instagram.com/reel/C2RBJHyrHb5/?igsh=MTFpNWJ2bG5wdG1lMg==

Pawan Kalyan: లక్నో చేరుకున్న పవన్ కల్యాణ్ 

21-01-2024 Sun 18:17 | Andhra
  • జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ
  • హాజరవుతున్న పవన్ కల్యాణ్
  • 500 ఏళ్ల తర్వాత ప్రజల కల సాకారమవుతోందని వెల్లడి 
 
Pawan Kalyan arrives Lucknow

జనసేనాని పవన్ కల్యాణ్ ఉత్తరప్రదేశ్ లోని లక్నో చేరుకున్నారు. పవన్ కల్యాణ్ రేపు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ, దేశ ప్రజల సుదీర్ఘ కల నెరవేరబోతోందని తెలిపారు. 500 ఏళ్ల తర్వాత ప్రజల కల సాకారం అవుతోందని పేర్కొన్నారు. రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొంటుండడం చాలా సంతోషం కలిగిస్తోందని వివరించారు. 

 

  • Upvote 1
Link to comment
Share on other sites

Ayodhya Ram Mandir: రేపు రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ... అయోధ్యకు భారీగా తరలివస్తున్న సాధువులు 

21-01-2024 Sun 17:57 | National
  • జనవరి 22న అయోధ్యలో  రామ మందిరం ప్రారంభోత్సవం
  • దేశం నలుమూలల నుంచి వస్తున్న సాధువులు
  • అయోధ్యలోని తీర్థ క్షేత్రపురంలో సాధువులకు బస
  • రేపటి కార్యక్రమంలో 4 వేల మంది సాధువులు పాల్గొంటారని అంచనా 
 
Huge number of Saints arriving Ayodhya

అయోధ్యలో రేపు బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ మహా సంరంభంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు అయోధ్యకు భారీగా తరలి వస్తున్నారు. దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న సాధువులతో అయోధ్య కిటకిటలాడుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు  చేసిన తీర్థ క్షేత్రపురంలో సాధువులకు బస ఏర్పాటు చేశారు. రేపటి రామ మందిర ప్రారంభోత్సవంలో దాదాపు 4 వేల మంది సాధువులు పాల్గొంటారని అంచనా. ప్రస్తుతం అయోధ్య నగరంలో ఎక్కడ చూసినా అధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో నగరాన్ని అలంకరించారు. అందమైన ముగ్గులు, రామాయణ విశిష్టతను చాటే చిత్రాలతో అయోధ్య కనువిందు చేస్తోంది.

Link to comment
Share on other sites

Ayodhya: రామ మందిరానికి ఉగ్రవాద బెదిరింపులు.... భద్రతా వలయంలో అయోధ్య 

21-01-2024 Sun 18:05 | National
  • రేపు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం
  • జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు
  • అప్రమత్తమైన భద్రతా దళాలు
 
Full security in Ayodhya in the wake of terror threats

రామాలయానికి ఉగ్రవాదుల బెదిరింపులతో అయోధ్యలో  హైఅలర్ట్ నెలకొంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. జైషే మహ్మద్ గ్రూపు హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. 

జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. దాదాపు 7 వేల మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా ఏటీఎస్ కమాండోలు, సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు దర్శనమిస్తున్నారు. అయోధ్యలో భద్రతను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ విభాగం పర్యవేక్షిస్తోంది. డ్రోన్లతో ముప్పును అరికట్టేందుకు డ్రోన్ జామర్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

 
ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు
 
అయోధ్యలో  రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో సైబర్ మోసగాళ్లు విజృంభిస్తున్నారు. భక్తుల విశ్వాసాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వాలంటూ నకిలీ క్యూఆర్ కోడ్ లను పంపుతున్నారు. మోసగాళ్లు పంపే సందేశాలకు స్పందించవద్దని, లింకులపై క్లిక్ చేయవద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
Link to comment
Share on other sites

KS Bharat: ఇంగ్లండ్ లయన్స్ పై సెంచరీ చేసి అయోధ్య రాముడికి అంకితం ఇచ్చిన తెలుగుతేజం కేఎస్ భరత్ 

21-01-2024 Sun 17:30 | Sports
  • అహ్మదాబాద్ లో ఇండియా-ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య మ్యాచ్
  • కేఎస్ భరత్ వీరోచిత సెంచరీ
  • భరత్ సెంచరీతో మ్యాచ్ లో ఓటమి తప్పించుకున్న భారత్
  • భరత్ సెంచరీ సెలబ్రేషన్ వీడియో వైరల్
 
KS Bharat dedicates his century to Lord Rama

ప్రస్తుతం ఇంగ్లండ్ లయన్స్ (ఇంగ్లండ్-ఏ) జట్టు భారత్ లో పర్యటిస్తోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఏ, ఇంగ్లండ్ లయన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ లో తెలుగుతేజం, ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎస్ భరత్ వీరోచిత సెంచరీ చేయడం విశేషం. 

రెండో ఇన్నింగ్స్ లో 490 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్-ఏ జట్టు ఓ దశలో ఓటమిదిశగా పయనిస్తున్నట్టు కనిపించింది. అయితే భరత్ అద్భుత పోరాటపటిమ కనబర్చి జట్టును ఓటమి బారి నుంచి కాపాడాడు. ఆరో వికెట్ కు మానవ్ సుతార్ తో కలిసి అజేయంగా 207 పరుగులు జోడించాడు. 

భరత్ 165 బంతుల్లో 116 పరుగులు చేశాడు. కాగా, సెంచరీ పూర్తి కాగానే భరత్ తన బ్యాట్ ను విల్లుగా మార్చి బాణం సంధిస్తున్నట్టుగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తద్వారా తన సెంచరీని అయోధ్య రాముడికి అంకితం ఇస్తున్నట్టుగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

  • Like 1
  • Haha 1
Link to comment
Share on other sites

హెయ్ నారాజు గాకుర మా అన్నయా నజీరు అన్నయా ముద్దుల కన్నయా హొయ్ మనరోజు మనకుంది మన్నయా నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుని గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుని గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలు ఆర్పేస్తాడమ్మో నాయకుడు తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలు ఆర్పేస్తాడమ్మో నాయకుడు మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు మా ధర్మం భేష్ అంటాడమ్మో నాయకుడు మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు మా ప్రార్థన చేయంటాడమ్మో నాయకుడు దేవుళ్లనడ్డంగా పెట్టి నాయకుడు దేవునిలా దోచేస్తాడమ్మో నాయకుడు అధికారం తన పదవి కొరకు నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు

Link to comment
Share on other sites

HanuMan: అయోధ్య రామాలయానికి రూ. 2.66 కోట్ల విరాళం ఇచ్చిన హనుమాన్ సినిమా టీం 

21-01-2024 Sun 12:26 | Entertainment
  • ఇప్పటి వరకు 53,28,211 టికెట్ల అమ్మకం
  • మొత్తం రూ. 2,66,41,055 విరాళం ఇస్తున్నట్టు ప్రకటించిన చిత్ర బృందం
  • సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలను ఎదుర్కొని విజయం సాధించిన హనుమాన్
 
HanuMan Movie Team Donates Rs 2 Crore To Ayodhya Ram Temple

సంక్రాంతి పండుగ బరిలో నిలిచి పెద్ద సినిమాలను ఎదుర్కొని విజయం సాధించింది హనుమాన్ సినిమా. ఈ సినిమాకు వచ్చే ప్రతి టికెట్ నుంచి రూ. 5 అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తామని ప్రకటించిన చిత్రబృందం అనుకున్నట్టే ఇప్పటి వరకు వచ్చిన రూ. 2,66,41,055ను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం 53,28,211 టికెట్లు అమ్ముడుపోగా ఒక్కో టికెట్ నుంచి రూ. 5 చొప్పున ఇంత మొత్తం అయినట్టు చెబుతూ వివరాలను వెల్లడించింది.

తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. అంజనాద్రి అనే కల్పిత ప్రాంతం చుట్టూ తిరిగే కథ ఇది. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్‌రాయ్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. ఈ సినిమాలో ‘కోటి’ అనే వానరానికి ప్రముఖ నటుడు రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

  • Like 1
Link to comment
Share on other sites

Ayodhya Ram Mandir: ప్రాణప్రతిష్ఠ తెల్లారి నుంచే మళ్లీ నిర్మాణ పనులు 

21-01-2024 Sun 11:45 | National
  • రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడి
  • మూడు అంతస్తులలో మందిర నిర్మాణం.. గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి
  • ఈ ఏడాది డిసెంబర్ లోగా ఆలయం నిర్మించాలని డెడ్ లైన్ 
 
Ram Mandir Temple Construction will start from Jan 23 Says Nripendra Mishra

అయోధ్య రామమందిరంలో సోమవారం బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. దీనికోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన పూజలు వారం రోజులుగా నిర్విగ్నంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం తుది అంకం జరగనుంది. ఈ కార్యక్రమం ముగిసిన తెల్లారి.. అంటే మంగళవారం (ఈ నెల 23) నుంచే రామమందిరంలో మళ్లీ నిర్మాణ పనులను మొదలు పెడతామని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.

రామమందిరాన్ని మూడు అంతస్తులలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే పూర్తయింది. మిగతా రెండు అంతస్తులను ఈ ఏడాది డిసెంబర్ లోగా పూర్తిచేయాలని నిర్మాణ కమిటీ డెడ్ లైన్ పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా పనులు జరిపించేందుకు కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. గడువులోగా మందిర నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ప్రాణప్రతిష్ఠ వేడుక జరిగిన తెల్లవారి నుంచే నిర్మాణ పనులు మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈమేరకు ఆయన ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు.

Link to comment
Share on other sites

Ayodhya: అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సంబరాలు.. దేశవ్యాప్తంగా ముస్తాబైన నగరాలు.. ఫొటోలు, వీడియోలు ఇవిగో! 

21-01-2024 Sun 11:22 | National
  • ఆలయాలు, పర్యాటక ప్రదేశాలను విద్యుత్ దీపాలతో అలంకరణ
  • నేపాల్ లోని జనక్ పూర్ లోనూ సంబరాలు
  • మహారాష్ట్రలోని చంద్రపూర్ లో వేల దీపాలతో రామ నామం
 
PranaPratishta Celebrations In Different Cities

బాల రాముడి విగ్రహా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామ జన్మభూమి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దీపాల కాంతుల్లో నగరం మెరిసిపోతోంది. రామ మందిరం ప్రవేశ ద్వారాన్ని పూలతో అలంకరించారు. వీధుల్లో తోరణాలు, గోడలపై రామాయణ గాథను తెలిపే చిత్రాలతో అయోధ్య నగరం మెరిసిపోతోంది. కాగా, అయోధ్యతో పాటు దేశవిదేశాల్లోనూ సంబరాలు జరుగనున్నాయి. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకలకు దేశవ్యాప్తంగా పలు నగరాలు కూడా ముస్తాబయ్యాయి. దేశంలో ప్రసిద్ధి పొందిన కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.

పలుచోట్ల ఏర్పాటు చేసిన లైట్ షోలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్ లో వేలాది దీపాలతో ‘సియావర్ రామచంద్ర కీ జై’ అంటూ నినదించారు. చాందా క్లబ్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరిగింది. జమ్మూకశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణో దేవీ ఆలయం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతోంది. శ్రీరాముడి అత్తారిళ్లు నేపాల్ లోని జనక్ పూర్ లోనూ సంబరాలు జరుగుతున్నాయి.

మహారాష్ట్రలోని చంద్రపూర్ లో..
20240121fr65acb07e2a299.jpg
పంజాబ్ లోని చండీగఢ్ లో..
20240121fr65acb0a29f32c.jpg
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో..
20240121fr65acb0cde6d54.jpg
నేపాలో లోని జనక్ పూర్ లో..
20240121fr65acb11def409.jpg

Link to comment
Share on other sites

హెయ్ నారాజు గాకుర మా అన్నయా నజీరు అన్నయా ముద్దుల కన్నయా హొయ్ మనరోజు మనకుంది మన్నయా
నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుని గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుని గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని
తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలు ఆర్పేస్తాడమ్మో నాయకుడు తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలు ఆర్పేస్తాడమ్మో నాయకుడు మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు
మా ధర్మం భేష్ అంటాడమ్మో నాయకుడు మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు మా ప్రార్థన చేయంటాడమ్మో నాయకుడు దేవుళ్లనడ్డంగా పెట్టి నాయకుడు దేవునిలా దోచేస్తాడమ్మో నాయకుడు
అధికారం తన పదవి కొరకు నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు
Link to comment
Share on other sites

Surya Tilak: ఏటా శ్రీరామ నవమి నాడు బాల రాముడిని ముద్దాడనున్న సూర్యుడు.. రామమందిరంలో ప్రత్యేక ఏర్పాటు 

21-01-2024 Sun 10:32 | National
  • ఏడాదికి ఓరోజు గర్భగుడిలో విగ్రహానికి సూర్యతిలకం
  • ఆరు నిమిషాల పాటు నుదిటిపై ప్రసరించేలా డిజైన్
  • ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సాయంతో నిర్మాణం
 
Once a year a special Surya Tilak will adorn the forehead of Ram Lalla

అయోధ్య రామమందిరంలో కొలువుదీరనున్న రామ్ లల్లా (బాల రాముడు) విగ్రహాన్ని ఏటా శ్రీరామ నవమి నాడు సూర్యుడు ముద్దాడనున్నాడు. దాదాపుగా ఆరు నిమిషాల పాటు గర్భగుడిలోని విగ్రహం నుదుటన ప్రకాశించనున్నాడు. బాల రాముడికి సూర్యతిలకంగా మారనున్నాడు. ఇందుకోసం మందిర నిర్మాణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు రామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. సూర్యుడి సంచారం ఆధారంగా ఏటా శ్రీరామ నవమి నాడు సూర్య తిలకం ఏర్పడేలా ప్రత్యేకమైన అద్దాలను అమర్చనున్నారు. ఇందుకోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ) సాయం తీసుకున్నట్లు సమాచారం.

మందిరం పూర్తయ్యాక మూడో అంతస్తు నుంచి సూర్య కిరణాలు గర్భగుడిలోని విగ్రహంపై అదీ ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రసరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది. బాల రాముడికి సూర్య తిలకంగా వ్యవహరిస్తున్నారు. ఏటా శ్రీరామ నవమికి మధ్యాహ్నం 12 గంటలకు ఈ సూర్య తిలకం మొదలై ఆరు నిమిషాల పాటు బాల రాముడి విగ్రహం నుదుటన ప్రకాశించనుంది. దీనికోసం సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. దీనికి అవసరమైన వస్తువులను బెంగళూరుకు చెందిన ఆప్టిక్స్ సంస్థ తయారుచేసిచ్చింది.

రామ మందిరం మూడో అంతస్తు నుంచి గర్భగుడిలో విగ్రహంపైకి సూర్య కిరణాలు ప్రసరించేలా కటకాలు, అద్దాలు, గేర్‌బాక్స్‌లు, గొట్టాలను అమర్చనున్నారు. చంద్రమాన తిథికి అనుగుణంగా ఏటా శ్రీరామ నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు విగ్రహం నుదుటన సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. కాగా, రామ మందిరం నిర్మాణంతో పాటూ ఈ ప్రత్యేక వ్యవస్థలోనూ ఎలాంటి ఉక్కు, ఇనుము, బ్యాటరీలు, విద్యుత్తు వాడలేదని టెంపుల్ ట్రస్ట్ వెల్లడించింది.

20240121fr65aca5741e1c5.jpg

 

Link to comment
Share on other sites

Swamy Nithyananda: అయోధ్య నుంచి ఆహ్వానం అందింది... వచ్చేస్తున్నా: స్వామి నిత్యానంద 

21-01-2024 Sun 19:00 | Andhra
  • మరోసారి తెరపైకి వివాదాస్పద గురు
  • అయోధ్యలో చారిత్రక ఘట్టం జరుగుతోందని వెల్లడి
  • అందరూ హాజరు కావాలని పిలుపు
  • గతంలో అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానంద
 
Swamy Nithyananda says he will attend Ayodhya event

వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు స్వామి నిత్యానంద మరోసారి తెరపైకి వచ్చారు. ఆయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి తనకు కూడా ఆహ్వానం అందిందని, తాను ఈ కార్యక్రమం కోసం వస్తున్నానని నిత్యానంద వెల్లడించారు. ఈ చారిత్రక ఘట్టాన్ని ఎవరూ మిస్ చేసుకోవద్దని, అందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. 

అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన స్వామి నిత్యానంద... కరీబియన్ దీవులకు సమీపంలో ఓ దీవిలో మకాం ఏర్పరచుకుని, దాన్నే కైలాస దేశంగా ప్రకటించుకున్నారు. తన కైలాస దేశానికి ఐరాస గుర్తింపు కూడా ఉందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, తన దేశానికి సొంత కరెన్సీ, సొంత రిజర్వ్ బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు.

Link to comment
Share on other sites

Ayodhya: రామ మందిరానికి ఉగ్రవాద బెదిరింపులు.... భద్రతా వలయంలో అయోధ్య 

21-01-2024 Sun 18:05 | National
  • రేపు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం
  • జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు
  • అప్రమత్తమైన భద్రతా దళాలు
 
Full security in Ayodhya in the wake of terror threats

రామాలయానికి ఉగ్రవాదుల బెదిరింపులతో అయోధ్యలో  హైఅలర్ట్ నెలకొంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. జైషే మహ్మద్ గ్రూపు హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. 

జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. దాదాపు 7 వేల మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా ఏటీఎస్ కమాండోలు, సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు దర్శనమిస్తున్నారు. అయోధ్యలో భద్రతను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ విభాగం పర్యవేక్షిస్తోంది. డ్రోన్లతో ముప్పును అరికట్టేందుకు డ్రోన్ జామర్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

 
ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు
 
అయోధ్యలో  రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో సైబర్ మోసగాళ్లు విజృంభిస్తున్నారు. భక్తుల విశ్వాసాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వాలంటూ నకిలీ క్యూఆర్ కోడ్ లను పంపుతున్నారు. మోసగాళ్లు పంపే సందేశాలకు స్పందించవద్దని, లింకులపై క్లిక్ చేయవద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
Link to comment
Share on other sites

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరానికి బాహుబలి తాళం... వీడియో ఇదిగో! 

20-01-2024 Sat 16:37 | National
  • ఈ నెల 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ
  • జనవరి 20న ముడుపుల సమర్పణ
  • అలీగఢ్ జిల్లా నుంచి కానుకగా 400 కిలోల భారీ తాళం 
  • తాళం తయారీకి 6 నెలల సమయం 
 
Devotees offers huge lock offered to Ayodhya Ram Mandir
Listen to the audio version of this article

అయోధ్యలో ఈ నెల 22న రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో, జనవరి 20న కానుకల సమర్పణ క్రతువు నిర్వహించారు. ఇందులో భాగంగా అయోధ్య రామయ్యకు దేశం నలుమూలల నుంచి కానుకలు వెల్లువెత్తాయి. 

ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాకు చెందిన భక్తులు అయోధ్య రామ మందిరానికి సమర్పించేందుకు బాహుబలి తాళంను తీసుకువచ్చారు. ఓ భారీ ట్రక్కులో దీన్ని అయోధ్యకు తరలించారు. దీన్ని కిందికి దించడానికి ఓ క్రేన్ ఉపయోగించారు. 

ఈ తాళం బరువు 400 కిలోలు. దీని తాళం చెవి కూడా దీని సైజులోనే ఉంది. ఈ మహా తాళం తయారీకి ఆరు నెలలు పట్టిందట. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటోంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...