malavika89 Posted October 30, 2010 Report Posted October 30, 2010 చదివి ఆనందించండి,ఆస్వాదించండి... LoL.1q @3$%ఆచార సాంప్రదాయాలు మనుష్యుల్ని సక్రమమయిన మార్గంలో నడిపించడానికే కాని కుల మతాల పేరుతో విడదీయడానికి కాదని శంకరశాస్త్రి చేత చెప్పించినా, లోకేశ్వరుడికి తప్ప లోకులకి భయపడనురా మాధవా అని అనిపించినా,యేమయ్యా దాసూ కలిసే సుఖాల్ని పంచుకున్నాము,ఇప్పుడు కష్టాల్ని కూడా పంచుకుందాము అన్నా,తులసి తులసిమొక్క అంత పవిత్రమయింది,ఆకలేసి ఏడ్చే బాబు అమ్మా అని ఒకలాగ అంటాడు.దెబ్బతగిలి ఏడ్చే పిల్లవాడు ఇంకోలా అమ్మా అంటాడు.అలాగే ప్రతీ పలుకుకీ ఒక్కొక్క నిర్ధిష్టమయిన భావం ఉంది,అర్థం ఉంది.నీకు తెల్సిన మిడి మిడి జ్ఞానం తో ఆ పిలుపులోని అమృతతుల్యమయిన ఆర్ద్రతని విషతుల్యం చెయ్యకు అని మందలించినా…ధనం నాయనా మనిషిని నడిపించే ఇంధనం అని వేటగాడులో రావుగోపాల్రావుతో (సత్యానంద్ తో కల్సి) చెప్పించినా, ఏ రోజూ రాని రోజా ఈరోజొస్తోందన్న కూజా నీళ్ళల్లాంటి మజా అయిన వార్త విని మేజా బల్లెక్కి కూర్చోక వీపున బాజా మ్రోగినట్లు బాధ పడతావేరా పిచ్చి కుంకా అని ప్రాసించినా,ఎడ్విన్ మోసెస్సే వాడు,నన్ను మోసేసే వాడే అని బుచ్చి బాబు చేత అనిపించినా, ఇంగ్లీషులో మాట్లాడుకోడమంటే విస్కీ బ్రాందీ తాగుతూ కబుర్లాడుకోడం,తెలుగులో మాట్లాడుకోడం అంటే నాటు తాగుతూ మాట్లాడుకోడం,తెరమీద బొమ్మాడితే చాలు భాషాభేదం లేకుండా ఏ సినిమా అయినా చూసి ఆ కధ కనపడ్డ వాళ్ళందరికీ చెప్పే శ్రీలక్ష్మి కి ఓ నా మొబైలు టూరింగ్ టాకీసా అని ముద్దుగా పిల్చుకోడం,అలాంటి కోడలు శ్రీలక్ష్మి గోల పడలేక కనపడ్డవాటికేసి బుర్ర బాదుకునే సుత్తి వీరభద్రరావు,అలా కొట్టుకోకు నాన్నా స్థంభం పగిలిపోగలదు అనే కొడుకు,పెళ్ళిలో ఓ ముత్తయిదువ అస్తమానూ పట్టు చీర విప్పా కట్టా....అయ్యో పెళ్ళి ఆగిపోయిందా అయితే నేను పట్టుచీర విప్పెయ్యాలన్నమాట అంటే…విప్పేస్తే విప్పేసావు కానీ ఏదో ఒకటి కట్టుకు చావు లేకపోతే చూసే వాళ్ళు దడుసుకు చస్తారు అంటూ,ఈ పెళ్ళి కుదిరితే వీడికి(మిశ్రో)గుండు కొట్టిస్తానని మొక్కుకోడం, మహాప్రభో ఈ పెళ్ళి నా గుండుకొచ్చిందండయ్యా ఈసారి మళ్ళీ గుండు కొట్టించుకుంటే మా ఆవిడ నాకు విడాకులిస్తానందండయ్యా,ఇంటర్వ్యూ లో కాఫీ(COFFEE) స్పెల్లింగ్ ఇంగ్లీష్ లో తప్పుల్లేకుండా చెప్పమంటే "కే ఏ యు పి హెచ్ వై (KAUPHY)" అని ఎక్కడా ఒక్క అక్షరం కూడా కలవకుండా చెప్పిన ఘనత,అయ్యగారి ఉప్పు తిని పెరిగిన శరీరం కాబట్టి ఆ సాల్టుకీ సాంబారుకీ ద్రోహం చెయ్యలేకపోడం,కోడిని వేళాడదీసి కోడికూర తిన కోడిని వేళాడదీసి కోడికూర తిన్నట్టు ఊహించుకోడంలో పిసినారితనానికి పరాకాష్ట,సరే నడు అలా ఆటో ఎక్కి నా ఆటోబయోగ్రఫీ వినిపించాలి నీకు (ఆటో ఎక్కి చెప్పేది ఆటోబయోగ్రఫీ),కోటా పిసినారి ప్రహసనం దెబ్బకి దిమ్మతిరిగిన సుత్తి వీరభద్రరావు చెల్లెల్నీ,మేనకోడల్ని ఆశీర్వదిస్తూ దీర్ఘసుమంగళీభవ అని మే.కో ని, శీఘ్రమేవ కళ్యాణప్రాప్తిరస్తూ అని పెళ్ళయి తలికూడా అయిన చెల్లెల్నీ అని తడబడి వాళ్ళ వెర్రి మొహాల్ని చూసి అటుదిటూ ఇటుదటూ మీరే మార్చేసుకోండి నేపోతున్నా అంటూ పారిపోడం భలే గిలిగింతలు పెట్టే సన్నివేశం.గేదెని తోముతూ అదే చేత్తో ఇటుతిరిగి కోటా ని కూడా రుద్దేస్తుంటే ఏంట్రా నన్ను తోముతున్నావు కళ్ళు కనపట్లేదా అని అడిగితే,నాకు పెద్దగా తేడా తెలియట్లేదండయ్యా అని అరగుండు చేత అనిపించినా, చెక్కు మీద సంతకం చెయ్యలేదు తమరు అంటే నేను గుప్తదానం మాత్రమే చేస్తాను బాబూ అందుకే ఆ చెక్కు మీద సంతకం చెయ్యలేదు అని కోటా ఇచ్చిన జెర్కుకి కళ్ళు తిరిగి పడిపోవాల్సిందే ఎవరయినా. నిన్నూ ఈ దేశాన్ని బాగుచెయ్యడం నా వల్ల కాదంటే ఈ దేశాన్ని బాగుచెయ్యడానికి మీరేమన్నా మూలపురుషులేంటండీ,మూలశంక పురుషులు గానీ అంటూ సుత్తి జంట ప్రహసనం,భార్య పట్టుచీర కొనుక్కోవాలని చెప్పగానే ఈ చెవి సరిగ్గా పనిచెయ్యట్లేదనడం,ఇంకోసారి మొదటిసారి కన్నా రేటు ఎక్కువ చెప్పగానే వచ్చేయ్ ఈ చెవి పక్కకి వచ్చేయ్ ఈ చెవే బాగా వినపడుతోంది అనడం,ఏవిటి ఇవి పాలా? పంచమమా?నీ మొహం ఈడ్చా...పొలం పుట్రాలో పొలం నాది,పుట్ర నీది అని,విమానాల్లో కుంకలు ఆ రొట్టెముక్కలు,వెన్నముద్దలూ పెట్టిచావకావకపోతె ఇంత ఆవకాయ అన్నం పెట్టచ్చు కదా,వెధవది నాలుక చచ్చుబడిపోయింది,కొన్ని తిట్లు: నెలతక్కువ కుంకలు,పింజారి వెధవలు,అంట్ల వెధవలు,నా పిండాకూడు పాటిమట్టి, సర్వభక్షకా,ఏమండీ రామారావు గారూ కులాసాయేనా అంటే ఆ ఆ "కు"లాసే అంటే కుమారుడివల్ల అంతా లాసే అంటూ,అమెరికానా నా ఆబ్దీకమా అక్కడ ఆడా మొగా తేడా తెలియకుండా పొగ పీలుస్తారట్రా అబ్బీ,రోజుకీ 32గంటలు తాగుతారట కుంకలు,నిప్పంటే భయం అంటారు మళ్ళి గుప్పు గుప్పున పొగలు వదులుతూ వుంటారు,నిప్పులేని మంటా ఉప్పులేని వంటా,నీ నవరంధ్రాల్లోనూ మైనం కూరతాను కుంకా...శవాల మీద మరమరలు ఏరుకునే మొహం నువ్వూను,బయట వర్షం పడుతుంటే ఇంట్లో గొడుగేసుకుని తిరిగేవాడి మొహం నువ్వూను,అతిగా తిండి తినే తన కొడుకుతో తండ్రి: అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ కల్సి నిన్నొక నేషనల్ మాన్యుమెంట్ లాగ పోషించాలి తప్ప నాలాంటి సామాన్యుడికి సాధ్యం కాదు నిన్ను పోషించడం, ఫలహారం తినడం అంటే యే ఒకటో రెండో పళ్ళు తినడం అంతే కానీ అమెరికాలో ఎవరికీ లేకుండా అన్ని పళ్ళూ తెచ్చుకుని తినడం కాదు నాన్నా,నాయనా సర్వభక్షకా నిన్న తెచ్చిన 15కిలోల బియ్యం తినేసావా,అయితే ఓ పదిలీటర్ల వేడినీళ్ళు తాగేయ్ కడుపులో అన్నం ఉడుకిపోతుంది,నువ్వు తిననిది ఒక్క నరమాంసమే అయ్యుంటుంది కదా అయితే నేను ఈ నాలుగు బర్నర్లూ ఆన్ చేసుకుని ఈ గాస్ పొయ్యిమీద పడుకుంటా బాగా ఉడికాక ఉప్పేసుకుని తినేయ్ అంటే ఆ కొడుకు వెంటనే ఉప్పెక్కడుంది నాన్నా అంటాడు
girifrommangalagiri Posted October 30, 2010 Report Posted October 30, 2010 better post some videos boss. chadavalantay bore..
keko__keka Posted October 30, 2010 Report Posted October 30, 2010 ee artivles ekkada untai mama chegodilu blogspot aa sHa_high5ing
Peacemaker Posted October 30, 2010 Report Posted October 30, 2010 *=:soooper....trivikram ki eeyane guruvu anukunta
malavika89 Posted October 30, 2010 Author Report Posted October 30, 2010 alluu ika super ga ettaruuuu ... naku notiki vachindiiii rasanuuuu eediyoooluuuu unteeee ettandi guru LoL.1q
jafa Posted October 30, 2010 Report Posted October 30, 2010 edo okkato rendo lines aithey ok..intha antey kastamey... translator kavalsindey
Recommended Posts