psycopk Posted February 21, 2024 Report Posted February 21, 2024 Sajjala Ramakrishna Reddy: ఎన్నికల టార్గెట్ క్లియర్ గా ఉంది.. రాబోయే 50 రోజులు ఇదే పని మీద ఉండాలి: సజ్జల 21-02-2024 Wed 17:19 | Andhra చంద్రబాబును రాజకీయాల నుంచి తరిమేసేందుకు సమయం ఆసన్నమయిందన్న సజ్జల ఓటర్లను పోలింగ్ బూత్ ల వద్దకు తీసుకెళ్లి బటన్లు నొక్కించాలని కేడర్ కు సూచన 2019 వరకు చంద్రబాబు ఎన్నో అరాచకాలు చేశారని విమర్శ రాష్ట్రానికి ఏమీ చేయలేని చంద్రబాబుకు ఓటు వేయాలా? లేక సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ కు వేయాలా? అనే విషయాన్ని ప్రజలు తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబును రాజకీయాల నుంచి తరిమేసేందుకు సమయం ఆసన్నమయిందని చెప్పారు. మన ముందు ఎన్నికలకు సంబంధించిన టార్గెట్ క్లియర్ గా ఉందని... పరీక్షలు రాసే పిల్లల్లా వైసీపీ గెలుపు కోసం పని చేయాలని... రాబోయే 50 రోజులు ఇదే పని అని చెప్పారు. వైసీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కేడర్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఓటర్లను పోలింగ్ బూత్ ల వద్దకు తీసుకెళ్లి అసెంబ్లీకి ఒక బటన్, లోక్ సభకు రెండో బటన్ నొక్కించాలని సజ్జల చెప్పారు. ఓట్ల కోసం జగన్ పథకాలను రూపొందించలేదని... సంక్షేమం, అభివృద్ధి కలగలిపిన రాష్ట్రంగా ఏపీని తీర్చి దిద్దడమే సీఎం లక్ష్యమని అన్నారు. అన్ని వర్గాలకు జగన్ ప్రాధాన్యతను ఇస్తున్నారని... కొన్ని కులాల్లో నాయకులు దొరకని పరిస్థితి ఉందని చెప్పారు. వైసీపీ డీఎన్ఏలోనే మైనార్టీలు ఉన్నారని అన్నారు. అవకాశం ఉన్న ప్రతి చోటా మైనార్టీలకు చోటు కల్పించామని చెప్పారు. 2019 వరకు చంద్రబాబు ఎన్నో అరాచకాలు చేశారని సజ్జల విమర్శించారు. ఆ అరాచకాలను భరించలేకే ప్రజలు వైసీపీకి పట్టం కట్టారని అన్నారు. అనారోగ్య కారణాలతో జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు... తాను యువకుడినంటూ ఇప్పుడు ఊర్లలో తిరుగుతున్నారని విమర్శించారు. Quote
psycopk Posted February 21, 2024 Author Report Posted February 21, 2024 Inkokadu emo… anna nuvvu tadi **** veskoni tadepalli lo tongo anna antunadu YV Subba Reddy: ఒక్కో సభ నుంచి టీడీపీని ఖాళీ చేయిస్తున్నాం: వైవీ సుబ్బారెడ్డి 21-02-2024 Wed 14:07 | Andhra రాజ్యసభలో టీడీపీని తుడిచి పెట్టేశామన్న సుబ్బారెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని వ్యాఖ్య టీడీపీ, జనసేనలో ఉన్నవారికి మనుగడ ఉండదన్న సుబ్బారెడ్డి రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీని తుడిచి పెట్టేశామని వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందని చెప్పారు. ఒక్కో సభ నుంచి టీడీపీని ఖాళీ చేస్తున్నామని... వచ్చే ఎన్నికల్లో లోక్ సభ, శాసనసభలో కూడా టీడీపీని ఖాళీ చేయిస్తామని అన్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సుబ్బారెడ్డి... రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని చెప్పారు. బలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ యత్నించిందని... కానీ, తమ ఎమ్మెల్యేలు జగన్ పట్ల పూర్తి విధేయతతో ఉండటంతో వారి ప్రయత్నాలు నెరవేరలేదని అన్నారు. టీడీపీ, జనసేనల ప్రలోభాలతో వైసీపీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు... మళ్లీ సొంత గూటికి తిరిగొస్తున్నారని సుబ్బారెడ్డి తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ లో ఉన్న నేతలకు మనుగడ ఉండదని అన్నారు. జగన్ తో పాటు ఉంటేనే రాజకీయంగా ఎవరికైనా మంచి జరుగుతుందని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, గొల్ల బాబూరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. Quote
psycopk Posted February 21, 2024 Author Report Posted February 21, 2024 Nenu emana takuva tinnana ani ponniani selvan ponnavolu vadi vachina english lo tantalu padutunadu Nara Lokesh: లోకేశ్ అరెస్ట్ కోసం సీఐడీ పిటిషన్... ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా 21-02-2024 Wed 18:21 | Andhra రెడ్ బుక్ పేరిట అవినీతి అధికారులకు లోకేశ్ హెచ్చరికలు లోకేశ్ వ్యాఖ్యలు అధికారులను బెదిరించేలా ఉన్నాయన్న సీఐడీ లోకేశ్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ పిటిషన్ తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెడ్ బుక్ పేరిట అవినీతి అధికారులకు హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో లోకేశ్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. సీఐడీ పిటిషన్ పై విజయవాడలోని ఏసీబీ కోర్టు నేడు విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. లోకేశ్ 41ఏ నిబంధనలు అతిక్రమించారని, అతడి అరెస్ట్ పై వారెంట్ జారీ చేయాలని సీఐడీ కోరింది. రెడ్ బుక్ అంశంలో లోకేశ్ వ్యాఖ్యలు అధికారులను బెదిరించేలా ఉన్నాయని ఆరోపించింది. Quote
psycopk Posted February 21, 2024 Author Report Posted February 21, 2024 Harsha Kumar: వైఎస్ షర్మిలను జగనే కాంగ్రెస్ లోకి పంపించి ఉండొచ్చు: హర్షకుమార్ 21-02-2024 Wed 12:47 | Andhra ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై జరిగిన దాడిపై జగన్ స్పందించాలన్న హర్షకుమార్ జడ్జిలకు రాజకీయ పదవులు ఇవ్వడం మంచిది కాదని వ్యాఖ్య డీఎస్సీ నోటిఫికేషన్ ఎన్నికల గిమ్మిక్కేనని విమర్శ అనంతపురం జిల్లా రాప్తాడులో జగన్ సిద్ధం సభ సమయంలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిని మాజీ ఎంపీ హర్షకుమార్ ఖండించారు. దీనిపై సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గవర్నర్ కూడా స్పందించాలని కోరారు. దాడిపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని విన్నవించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వకూడదని హర్ష కుమార్ అన్నారు. అలాగే ఎస్సీ నియోజకవర్గాల్లో ఇప్పటికే ఉన్న నేతలను కాదని కొత్తవారికి సీట్లు ఇవ్వకూడదని చెప్పారు. జడ్జిలకు రాజకీయ పదవులు ఇవ్వడం మంచిది కాదని అన్నారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా టికెట్లు ఇవ్వకూడదని చెప్పారు. ఏపీలో వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని... వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా దళితులు ఓట్లు వేయాలని సూచించారు. బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఎలా ఉండబోతుందో వేచి చూడాలని అన్నారు. అమలాపురం నియోజకవర్గంలో సొంతంగా సర్వే చేయించుకుంటున్నామని... ప్రజల్లో ఆదరణ ఉన్నట్టు సర్వేలో తేలితే ఎన్నికల్లో పోటీ చేస్తామని హర్షకుమార్ తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ఎన్నికల గిమ్మిక్కేనని విమర్శించారు. ఆర్కే వైసీపీ నుంచి వెళ్లిపోవడం, మళ్లీ వైసీపీలోకి రావడం కూడా జగన్ ప్లానే అని చెప్పారు. షర్మిలను జగనే కాంగ్రెస్ లోకి పంపించి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. Quote
ARYA Posted February 21, 2024 Report Posted February 21, 2024 1 hour ago, psycopk said: Harsha Kumar: వైఎస్ షర్మిలను జగనే కాంగ్రెస్ లోకి పంపించి ఉండొచ్చు: హర్షకుమార్ 21-02-2024 Wed 12:47 | Andhra ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై జరిగిన దాడిపై జగన్ స్పందించాలన్న హర్షకుమార్ జడ్జిలకు రాజకీయ పదవులు ఇవ్వడం మంచిది కాదని వ్యాఖ్య డీఎస్సీ నోటిఫికేషన్ ఎన్నికల గిమ్మిక్కేనని విమర్శ అనంతపురం జిల్లా రాప్తాడులో జగన్ సిద్ధం సభ సమయంలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిని మాజీ ఎంపీ హర్షకుమార్ ఖండించారు. దీనిపై సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గవర్నర్ కూడా స్పందించాలని కోరారు. దాడిపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని విన్నవించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వకూడదని హర్ష కుమార్ అన్నారు. అలాగే ఎస్సీ నియోజకవర్గాల్లో ఇప్పటికే ఉన్న నేతలను కాదని కొత్తవారికి సీట్లు ఇవ్వకూడదని చెప్పారు. జడ్జిలకు రాజకీయ పదవులు ఇవ్వడం మంచిది కాదని అన్నారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా టికెట్లు ఇవ్వకూడదని చెప్పారు. ఏపీలో వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని... వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా దళితులు ఓట్లు వేయాలని సూచించారు. బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఎలా ఉండబోతుందో వేచి చూడాలని అన్నారు. అమలాపురం నియోజకవర్గంలో సొంతంగా సర్వే చేయించుకుంటున్నామని... ప్రజల్లో ఆదరణ ఉన్నట్టు సర్వేలో తేలితే ఎన్నికల్లో పోటీ చేస్తామని హర్షకుమార్ తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ఎన్నికల గిమ్మిక్కేనని విమర్శించారు. ఆర్కే వైసీపీ నుంచి వెళ్లిపోవడం, మళ్లీ వైసీపీలోకి రావడం కూడా జగన్ ప్లానే అని చెప్పారు. షర్మిలను జగనే కాంగ్రెస్ లోకి పంపించి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. Idi andariki telisinde ga Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.