psycopk Posted February 24, 2024 Report Posted February 24, 2024 Sajjala Ramakrishna Reddy: పవన్ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారు... 24 సీట్లకు దిగజారిపోయారా?: సజ్జల 24-02-2024 Sat 14:45 | Andhra టీడీపీ-జనసేన తొలి జాబితా ప్రకటన జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు 24 స్థానాల్లో పవన్ వైసీపీపై యుద్ధం చేయగలరా అని ప్రశ్నించిన సజ్జల జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబే నిర్ణయిస్తారా అంటూ వ్యాఖ్యలు పవన్ కు తాను పోటీ చేసే స్థానంపైనే స్పష్టత లేదని ఎద్దేవా టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శనాత్మకంగా స్పందించారు. ఈ జాబితా చూస్తుంటే పవన్ కల్యాణ్ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారన్న విషయం అర్థమవుతోందని అన్నారు. 24 స్థానాలతో పవన్ వైసీపీపై యుద్ధం చేయగలనని అనుకుంటున్నారా? అని సజ్జల ప్రశ్నించారు. కనీసం ఆ 24 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో ఉన్న పవన్ ను చూస్తే జాలేస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కు ఈసారి కనీసం తాను పోటీ చేసే స్థానంపై కూడా స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. మిగిలిన స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే ఉంటారని, పవన్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే బాగుంటుందని సెటైర్ వేశారు. "పవన్ ను అభిమానించే వాళ్లు ఇకనైనా ఆలోచించాలి. చంద్రబాబుకు ఎందుకు మద్దతు ఇస్తున్నాడో పవన్ చెప్పలేకపోతున్నాడు. ఇటీవలి వరకు ఎన్నో మాటలు చెప్పిన పవన్ ఇప్పుడెందుకు దిగజారిపోయారు? జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబే నిర్ణయిస్తారా? ఓ రాజకీయ పార్టీని నడిపే లక్షణాలు పవన్ కల్యాణ్ కు లేవని స్పష్టంగా తెలిసిపోయింది" అంటూ సజ్జల విమర్శనాస్త్రాలు సంధించారు. ఎవరు ఎన్ని సీట్లలో, ఎక్కడ పోటీ చేసినా వైసీపీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని, వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు. Quote
psycopk Posted February 24, 2024 Author Report Posted February 24, 2024 Pawan Kalyan: పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేశారు: పవన్ పై అంబటి వ్యంగ్యం 24-02-2024 Sat 15:01 | Andhra టీడీపీ-జనసేన సీట్ల పంపకంపై వైసీపీ నేతల స్పందన ఛీ... అంటూ ట్వీట్ చేసిన అంబటి జనసేనకు అభ్యర్థులే దొరకడంలేదన్న వెల్లంపల్లి పవన్ కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారంటూ అడపా శేషు ఆగ్రహం టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో, వైసీపీ నేతలు విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. జనసేనకు 24 సీట్లేనా...? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. పల్లకి మోయడానికి తప్ప పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేశారు... ఛీ అంటూ పవన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. పల్లకీ మోసి పరువు తీసుకోవడం కంటే మన అన్న గారిలా విలీనం చేసి సినిమాలు తీసుకోవడం మంచిది అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. అటు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా టీడీపీ-జనసేన సీట్ల పంపకంపై స్పందించారు. జనసేనకు అభ్యర్థులే దొరకడంలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మరోసారి వంగవీటి రాధాను మోసం చేశారని విమర్శించారు. బీజేపీతో పొత్తుపై చంద్రబాబు, పవన్ చెరొక మాట మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు స్పందిస్తూ... చంద్రబాబు చేతిలో పవన్ కీలు బొమ్మగా మారారని, కాపులకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Quote
psycopk Posted February 24, 2024 Author Report Posted February 24, 2024 YV Subba Reddy: చంద్రబాబు కళ్లలో బంగారు భవిష్యత్తు చూసేందుకే..: పవన్ పై వైవీ సుబ్బారెడ్డి సెటైర్లు 24-02-2024 Sat 15:15 | Andhra వైసీపీ తుది జాబితాలో చోటు దక్కిన వారే అభ్యర్థులన్న సుబ్బారెడ్డి టీడీపీకి 40 స్థానాల్లో అభ్యర్థులు లేరని ఎద్దేవా ఎన్ని కూటములు వచ్చినా వైసీపీదే గెలుపని ధీమా ఇప్పటివరకు ఇన్ఛార్జీలుగా నియమించిన వారంతా కేవలం సమన్వయకర్తలు మాత్రమేనని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తుది జాబితాలో చోటు దక్కిన వాళ్లు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులని ఆయన స్పష్టం చేశారు. ఆఖరి 'సిద్ధం' తర్వాత అభ్యర్థుల తుది జాబితా, మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పారు. అరాచక అభ్యర్థులకు టికెట్ ఇచ్చే సంస్కృతి వైసీపీకి లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వల్ల మేలు జరిగితేనే మళ్లీ మాకు ఓటు వేయాలని చెప్పే ధైర్యం జగన్ కు తప్ప ఇంకెవరికైనా ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ ను షర్మిల వచ్చినంత మాత్రాన ఎవరూ పట్టించుకోరని అన్నారు. టీడీపీ - జనసేన కూటమి అభ్యర్థుల జాబితాపై స్పందిస్తూ... అభ్యర్థుల ఎంపిక కోసం ఎప్పుడూ చేయనంత సుదీర్ఘ కసరత్తు చేశానని చంద్రబాబు అన్నారని... చంద్రబాబుకు ఈ పరిస్థితి వచ్చిందంటే వైసీపీ అభ్యర్థులు ఎంత బలంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. టీడీపీకి ఇప్పటికీ 40 స్థానాల్లో అభ్యర్థులు లేరని... అభ్యర్థులను వెతుక్కునే పనిలో వారు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు బంగారు భవిష్యత్తును చూసేందుకే పవన్ కల్యాణ్ 24 సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్ని కూటములు వచ్చినా గెలుపు వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. Quote
psycopk Posted February 24, 2024 Author Report Posted February 24, 2024 Roja: పవన్ కు అంత సీన్ లేదని తేలిపోయింది: రోజా 24-02-2024 Sat 15:59 | Andhra పవన్ ను టీడీపీ 24 సీట్లకే పరిమితం చేసిందన్న రోజా చంద్రబాబుకు మళ్లీ సీఎం అయ్యే యోగం లేదని వ్యాఖ్య వైసీపీ 175 సీట్లు గెలుస్తుందని ధీమా రానున్న ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లను టీడీపీ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి రోజా మాట్లాడుతూ జనసేనాని పవన్ పై సెటైర్లు వేశారు. పవన్ కు సీఎం అయ్యేంత సీన్ లేదని తేలిపోయిందని... ఆయనను టీడీపీ 24 సీట్లకే పరిమితం చేసిందని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేశ్ ను పవన్ ఏమన్నారో... పవన్ ను చంద్రబాబు ఏమన్నారో వాళ్లు మర్చిపోయారని అన్నారు. సింగిల్ గా అయితే జగన్ ను ఎదుర్కోలేమనే... అన్నీ పక్కన పెట్టి కలిసిపోయారని విమర్శించారు. వపన్ ను సీఎం చేసుకోవాలని కాపు సోదరులు చాలా ఆశపడ్డారని... కానీ ఆయన విలువ కేవలం 24 సీట్లు మాత్రమేనని ఈరోజు తేలిపోయిందని రోజా ఎద్దేవా చేశారు. టీడీపీ 94 సీట్లు తీసుకున్నా చంద్రబాబుకు మళ్లీ సీఎం అయ్యే యోగం లేదని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా... కనీసం సొంత నియోజకవర్గం కుప్పంకు మంచి నీళ్లు ఇవ్వలేకపోయారని అన్నారు. చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. Quote
psycopk Posted February 24, 2024 Author Report Posted February 24, 2024 RGV: మైండ్ బ్లోయింగ్ లాజిక్... పవన్ వ్యాఖ్యలపై వర్మ స్పందన 24-02-2024 Sat 16:28 | Andhra తొలి జాబితా ప్రకటించిన టీడీపీ-జనసేన కూటమి జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాల కేటాయింపు మొత్తమ్మీద 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క అని పవన్ వివరణ రెండు లక్షల పుస్తకాల సారం పిండి ఈ లాజిక్ వెలువరించారన్న వర్మ టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో, వివిధ రకాల స్పందనలు వినిపిస్తున్నాయి. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలు కేటాయించగా... 24 సీట్లేనా అనుకోవద్దని, 3 లోక్ సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా కలుపుకుంటే మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో మనం పోటీ చేస్తున్నట్టేనని పవన్ వివరణ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనిపై స్పందించారు. "మైండ్ బ్లోయింగ్ లాజిక్" అంటూ ట్వీట్ చేశారు. రెండు లక్షల పుస్తకాల సారం పిండి మతిపోయే లాజిక్ ను వెలువరించారంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. మరో ట్వీట్ లో... "23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు, 25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారని ట్రోల్ చేస్తారు... అందుకే మధ్యే మార్గంగా 24" అంటూ తనదైన శైలిలో విశ్లేషించారు. Quote
psycopk Posted February 24, 2024 Author Report Posted February 24, 2024 Perni Nani: పవన్ కల్యాణ్ ఎలాంటివాడో కాపులకు ఇవాళ అర్థమైంది: పేర్ని నాని 24-02-2024 Sat 18:52 | Andhra చంద్రబాబు తన కులానికి 21 సీట్లు ఇచ్చుకున్నాడన్న పేర్ని నాని కాపులకు హీనంగా 7 సీట్లే ఇచ్చారని వెల్లడి పవన్ లెక్కలు చెబుతుంటే మంగళవారం సామెత గుర్తొస్తోందని వ్యాఖ్యలు టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలను పవన్ కల్యాణ్ అంగీకరించడం పట్ల వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. సీట్ల పంపకంపై పవన్ చెబుతున్న లెక్కలు చూస్తుంటే మంగళవారం సామెతను తలపిస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు తన కులానికి 21 సీట్లు ప్రకటించుకున్నారని, కాపులకు మరీ హీనంగా 7 సీట్లు ప్రకటించారని విమర్శించారు. చంద్రబాబు శ్రేయస్సు కోసమే రాజకీయాలు చేసే పవన్ కల్యాణ్ 24 సీట్లతో కాపులకు రాజ్యాధికారం అందిస్తాడా? పవన్ కల్యాణ్ ఎలాంటివాడో కాపులకు ఇవాళ అర్థమైంది... ఇన్నాళ్లూ మమ్మల్ని విమర్శించిన వాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు? అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఇక, పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబే నిర్ణయిస్తారని అన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.