Jump to content

Anduke na nee ayya ki fever vachedi PM epudu vachina

Recommended Posts

Posted

KTR: రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో... సన్నాసి అని రేవంత్ రెడ్డి చెబుతున్నట్లే... బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం: కేటీఆర్ జోస్యం 

05-03-2024 Tue 19:23 | Telangana
  • వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని వ్యాఖ్య
  • ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ సీఎం... బీజేపీ ప్రధానిని ప్రశంసిస్తారా? అని ప్రశ్న
  • నువ్వే మళ్లీ ప్రధాని అవుతావని మోదీకి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఉందని వ్యాఖ్య
 
KTR says Revanth Reddy will join bjp soon

వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని... ఈ మాట నేను పక్కాగా చెబుతున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రధానిని ప్రశంసించడం ద్వారా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో... సన్నాసి అంటున్నట్లుగా ఉందన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి బడేబాయ్ అంటున్నారని... మరి ఆ బడేబాయ్... ఈ ఛోటే‌బాయ్‌కి ఏమిచ్చాడో... చెవిలో ఏం చెప్పాడో తనకు తెలియదు కానీ నిన్నటి ఆదిలాబాద్ సభతో తెలంగాణలో రేవంత్ రెడ్డి భవిష్యత్తు, కాంగ్రెస్ భవిష్యత్తు కనిపిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్లు... అసోంలో జరిగినట్లు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.

ఆయన ఒక ఏక్‌నాథ్ షిండే... మరో హిమంత బిశ్వ శర్మ... ఇక్కడ పుట్టి... కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బొంద పెడతారన్నారు. తాను ఈ మాటను ఆషామాషిగా చెప్పడం లేదన్నారు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... బడేబాయ్ అని ఒక్క మాట మాత్రమే అనలేదని... భవిష్యత్తులో మీ ఆశీర్వాదం మాపై ఉండాలని చెప్పడం ఏమిటన్నారు.

మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పడం ద్వారా భవిష్యత్తులోనూ మోదీయే ప్రధాని అని చెప్పకనే చెప్పారన్నారు. ఎన్నికలు రెండు నెలలు కూడా లేవని ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రధానిని ప్రశంసించడం ఏమిటన్నారు. మా రాహుల్ గాంధీ వేస్ట్ కేసు... గెలిచేది లేదు... ఏమీ లేదు.. మళ్లీ నువ్వే ప్రధాని అని మోదీకి చెప్పినట్లుగా ఉందన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరైనా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీ ప్రధానిని బడేబాయ్ అంటారా? అని ప్రశ్నించారు. మెడ మీద తలకాయ ఉన్న ఎవరూ కూడా ఇలా మాట్లాడరన్నారు. వారిది దివాళాకోరు రాజకీయమని విమర్శించారు.

'అంటే బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో... రాహుల్ గాంధీ సన్నాసి... వేస్ట్ ఫెలో... ఆయనతో కాదు... నువ్వే మళ్లీ ప్రధాని అవుతావు అని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటే ఏం చెప్పాలి? రాహుల్ గాంధీని నేను అనడంలేదు.. రాహుల్ గాంధీని నేను అన్నట్లుగా రాసేరు... ఆయనే అన్నట్లుగా చెబుతున్నాను'  అని కేటీఆర్ అన్నారు

Posted

Eedu paniki malina muchtlatlo timepass chestunte… harish rao playing opposition role

Harish Rao: ఉచిత విద్యుత్ ప‌థ‌కంపై సీఏం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ‌ 

05-03-2024 Tue 19:20 | Telangana
  • ప్ర‌భుత్వ పొర‌పాటు వ‌ల్ల లక్షలాది మంది అర్హులకు అన్యాయం
  • రాష్ట్ర‌వ్యాప్తంగా 90 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులుంటే.. కేవలం 30 లక్షల మందికి మాత్రమే ప‌థ‌కం వ‌ర్తింపు 
  • బిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని సూచ‌న‌   
 
BRS Leader Harish Rao wrote a letter to CM Revanth Reddy

నిరుపేదలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకం అమలు విషయంలో జరుగుతున్న పొరపాటుల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు లేఖ రాశారు. ఈ ప్రభుత్వ పథకంలో జరుగుతున్న పొరపాటు వల్ల లక్షలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని హ‌రీశ్ రావు ఈ సంద‌ర్భంగా సీఏం దృష్టికి తీసుకెళ్లారు. కేవలం 200 యూనిట్ల వరకు వినియోగించిన వారికి అధికారులు జీరో బిల్ ఇస్తున్నారు. కానీ, ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా సరే, మొత్తం 201 యూనిట్లకు బిల్ వసూలు చేస్తున్నారని ఆయ‌న తెలిపారు. ఈ విధానం వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌ని గుర్తు చేశారు. 
 
అలాగే వినియోగదారులు ప్రతీ రోజు పొద్దున లేచి తాము ఎంత కరెంటు కాలుస్తున్నాము? మీటర్ ఎంత తిరుగుతుంది? అనేది గమనించుకోవాల్సిన పరిస్థితి దాపురించింద‌న్నారు. కాబట్టి 200 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు వాడినప్పటికీ, పై యూనిట్లకు మాత్రమే బిల్లు వేసే విధంగా నిబంధనలు రూపొందించాలని కోరారు. ఒక‌వేళ 200 యూనిట్లు దాటితే.. 200 యూనిట్ల వరకు అయ్యే భారాన్ని ప్రభుత్వమే భరించి, మిగతా యూనిట్ల ధరను వినియోగదారుడు చెల్లించే విధంగా బిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని హ‌రీశ్ రావు సూచించారు. అంతేగాక రాష్ట్ర‌వ్యాప్తంగా 90 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులుంటే.. ప్రభుత్వం కేవలం 30 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తుంద‌ని తెలిపారు. మిగతా 60 లక్షల మందికి తీవ్ర అన్యాయం జరుగుతున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. 

ఇక హైదరాబాద్ నగరంలో కూడా 30 లక్షల మంది పేదలుంటే, కేవలం 10 లక్షల మందికే పథకం అమలు చేయాలని నిర్ణయించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని అన్నారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యం వ‌ల్ల‌ మిగతా వారికి నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. అటు ఒక రేషన్ కార్డు కింద ఒక కుటుంబాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవ‌డం వ‌ల్ల కూడా పేద కుటుంబాల‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని తెలిపారు. ఒక రేషన్ కార్డులో పేర్లున్న వారు రెండు మూడు కుటుంబాలుగా కూడా విడిపోయి ఉంటున్నారు. వారు ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలో, వేర్వేరు అంతస్తుల్లో ఉంటున్నారు. కానీ ప్రభుత్వం వారందరినీ ఒకే కుటుంబంగా లెక్క కట్టి ఒక్కరికే పథకం వర్తింప చేస్తుంది. ఇది కూడా సరైన పద్ధతి కాద‌న్నారు. ఎన్ని కుటుంబాలుంటే అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని హ‌రీశ్ రావు కోరారు. నిజమైన పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమైతే మాత్రం మొత్తం 90 లక్షల పేద కుటుంబాలకు లబ్ది కలిగేలా చేయాలని సూచించారు.

Posted
1 hour ago, psycopk said:

yup. Harish rao is better than overaction fellow KTR.

Posted

Andariki modi tatha paina black shirt esukoni fighting chese dairyam undadu kada anna pillalu ideseyi

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...