Jump to content

Revant emo kani people are comparing ktr vs harish


Recommended Posts

Posted

 

 

KTR: రేవంత్ రెడ్డి పాలన చూశాక ప్రజలకు గాడిద ఎవరో... గుర్రం ఎవరో తెలుస్తుంది: కేటీఆర్ 

07-03-2024 Thu 15:15 | Telangana
  • కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్
  • రేవంత్ రెడ్డి అబద్ధాల పాలన మీద మార్చి 12న సభ పెడుతున్నామన్న కేటీఆర్
  • ఓ ముఖ్యమంత్రి అయి ఉండి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాను.. మానవ బాంబును అవుతానని మాట్లాడటం ఏమిటని ఆగ్రహం
  • రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి ఎలాంటి ముప్పు లేదని కేటీఆర్ హామీ
  • కాంగ్రెస్‌లో నీ పక్కన ఉన్న వారితోనే ప్రమాదమని హెచ్చరిక
 
KTR fires at revanth reddy for his comments in mahaboobnagar

ఎవరు గాడిదో... ఎవరు గుర్రమో... ప్రజలకు కూడా తెలియాలి... అందుకే రేవంత్ రెడ్డి అయిదేళ్లు పాలన చేయాలి... అప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూశాక కేసీఆర్ గొప్పతనం తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నాడు ఆంధ్రా పాలన మీద 2001లో కేసీఆర్ కరీంనగర్‌లో సింహగర్జన పెట్టారని... ఇప్పుడు అబద్ధాల రేవంత్ రెడ్డి పాలన మీద మార్చి 12న మరోసారి కదనభేరి మోగించేందుకు పార్టీ సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

నిన్న మహబూబ్ నగర్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నానని... కడుపు చింపుతానని... పేగులు మెడలో వేసుకొని తిరుగుతానని... మా ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తే మానవ బాంబులా మారుతానని అంటున్నారని.. ఇవేం మాటలు? అని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎక్కడైనా జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతారా... జేబు దొంగలే అలా తిరుగుతారని ఎద్దేవా చేశారు. అంతకుముందేమో సచివాలయానికి వచ్చి లంకె బిందెలు దొరుకుతాయని భావించానని అన్నాడని గుర్తు చేశారు. ఈ లంకె బిందెలు ఏంది? జేబులో కత్తెర ఏంది? అని చురక అంటించారు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా ఇవి... ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ఆవేశంతో ఊగిపోవడం ఎందుకు? అని మండిపడ్డారు. 

తాను రేవంత్ రెడ్డికి ఓ విజ్ఞప్తి చేస్తున్నానని... కాంగ్రెస్ పార్టీలో నీ పక్కనే బాంబులు ఉన్నాయని... నల్గొండ బాంబు, ఖమ్మం బాంబులు మీ ప్రభుత్వం మీద చేసేదంతా వారే చేస్తారన్నారు. రేవంత్ రెడ్డి అయిదేళ్లు అధికారంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని... 420 హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నామన్నారు. వెలుగు... చీకటి రెండూ చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని... అలాగే కేసీఆర్, రేవంత్ రెడ్డిని చూశాక కేసీఆర్ విలువ ప్రజలకు తెలుస్తుందన్నారు. అందుకే రేవంత్ రెడ్డి బీపీ పెంచుకొని ఆగమాగం కావొద్దని.. మా నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి ప్రమాదం అంటూ ఉన్నదంటే ఆయన పక్కన కూర్చున్న కాంగ్రెస్ నేతల నుంచే అన్నారు. బీపీ గోలీలు వేసుకొని హాయిగా ఉండాలని వ్యాఖ్యానించారు.

గుజరాత్ మోడల్ గొప్పదని రేవంత్ రెడ్డి అంటున్నారని... నోటికి వచ్చినట్లు అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. మన రైతుబంధును కాపీ కొట్టి కేంద్రం పీఎం కిసాన్ పెట్టిందని తెలిపారు. అలాగే మిషన్ కాకతీయను కాపీ కొట్టి అమృత్ సరోవర్ అని పేరు పెట్టారన్నారు. రాహుల్ గాంధీయేమో గుజరాత్ మోడల్ అట్టర్ ప్లాప్ అంటే.. రేవంత్ రెడ్డేమో గుజరాత్ మోడల్ కావాలని అంటున్నారని ధ్వజమెత్తారు. మూడు నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాభిమానం కోల్పోయిందన్నారు.

Posted

Revanth Reddy: బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో గంజాయి, పబ్బులు, డ్రగ్స్ వచ్చాయి: రేవంత్ రెడ్డి 

07-03-2024 Thu 14:30 | Telangana
  • రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమిపూజ చేసిన సీఎం
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో వివాదం కారణంగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందని ఆరోపణ
  • తాము అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించామన్న రేవంత్ రెడ్డి
 
Revanth Reddy accuses brs for drugs in hyderabad

బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో గంజాయి, పబ్బులు, డ్రగ్స్ వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గురువారం ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. 11 కిలో మీటర్ల పొడవుతో 6 లైన్లతో రూ.2,232 కోట్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తాను ఎలివేటెడ్ కారిడార్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. గత ప్రభుత్వం ప్రజల అవసరాలను మరిచిపోయిందని ఆరోపించారు. గత ప్రభుత్వం కేంద్రంతో వివాదం కారణంగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.

కానీ తాము అధికారంలోకి వచ్చాక రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాధాన్యతను కేంద్రానికి వివరించానని తెలిపారు. మేడ్చల్ అభివృద్ధి చెందాలంటే ఇది పూర్తి కావాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో నగరంలో కూడా అభివృద్ధి జరగలేదని విమర్శించారు. రెండో దశలో 75 కిలో మీటర్ల మెట్రో విస్తరణ చేపట్టబోతున్నామన్నారు.

Posted

 

K Kavitha: ఏముందని ఈ కేసును టీవీ సీరియల్ మాదిరి సాగదీస్తున్నారు?: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 

07-03-2024 Thu 13:32 | Telangana
  • లిక్కర్ కేసులో తాను కూడా బాధితురాలినేనని అన్న కవిత
  • రాజకీయాల్లో విలువలకు చోటు లేకుండా పోయిందని విమర్శ
  • ఆదర్శ్ కుంభకోణంలో ఉన్న చవాన్ కు రాజ్యసభ సీటు ఇచ్చారని మండిపాటు
 
Kavitha comments on Delhi liquor case

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. ఈ కేసులో ఏముందని టీవీ సీరియల్ మాదిరి సాగదీస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఇది పెద్ద కేసు కాదని... దాని సంగతి తమ లీగల్ టీమ్ చూసుకుంటుందని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తాను కూడా బాధితురాలినేనని చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలకు, విలువలకు చోటు లేకుండా పోయిందని విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే ఎదుర్కొంటానని చెప్పారు. ఆదర్శ్ కుంభకోణంలో ప్రమేయం ఉన్న చవాన్ కు రాజ్యసభ సీటును బీజేపీ ఇచ్చిందని దుయ్యబట్టారు. ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించినా ఆశ్చర్యం లేదని అన్నారు. 

అనుభవరాహిత్యం, అవగాహన లోపంతో రేవంత్ పాలన కొనసాగుతోందని కవిత విమర్శించారు. సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, వెంటనే ఆమెను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు. మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. జీవో 3తో ఉద్యోగాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. మహిళకు జరుగుతున్న అన్యాయంపై ఉమెన్స్ డే రోజున ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో నిరసన తెలిపేందుకు అనుమతిని ఇవ్వడం లేదని మండిపడ్డారు. అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా తమ పోరాటం ఆగదని తెలిపారు. 

 

Posted

MLC Kavitha: రాష్ట్రంలో కృత్రిమ క‌రవుకు సీఏం రేవంత్‌రెడ్డి అస‌మ‌ర్థ‌తే కార‌ణం: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌ 

07-03-2024 Thu 11:40 | Telangana
  • రేవంత్ డీఎన్ఏలోనే ప్ర‌ధాని మోదీతో స్నేహం ఉందంటూ విమ‌ర్శ‌
  • మ‌హిళల ప‌ట్ల రాష్ట్ర ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి లేద‌ని మండిపాటు
  • మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌పై న్యాయ‌పోరాటం  చేస్తామ‌ని వెల్ల‌డి
 
MLC Kavitha Fire on CM Revanth Reddy

సీఏం రేవంత్‌రెడ్డి అస‌మ‌ర్థ‌త‌ కార‌ణంగానే తెలంగాణ‌లో కృత్రిమ క‌రవు వ‌చ్చింద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ధ్వ‌జ‌మెత్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే కాళేశ్వ‌రం నుంచి నీళ్లు ఎత్తిపోయ‌లేద‌ని ఆమె విమ‌ర్శించారు. సీఏం రేవంత్ డీఎన్ఏలోనే ప్ర‌ధాని మోదీతో స్నేహం ఉంద‌ని, ఆయ‌న బీజేపీలో చేరే అకాశం కూడా ఉంద‌న్నారు. గురుకులాలు, హాస్ట‌ళ్ల‌లో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్య‌మంత్రి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని క‌విత‌ దుయ్య‌బ‌ట్టారు. ఇక మ‌హిళల ప‌ట్ల రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఏమాత్రం చిత్త‌శుద్ధి లేద‌ని మండిప‌డ్డారు. ఉద్యోగాల్లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌పై న్యాయ‌పోరాటం చేస్తామ‌ని చెప్పిన ఆమె.. రేపు ధ‌ర్నా చౌక్ వ‌ద్ద దీక్ష చేప‌డ‌తామ‌ని తెలిపారు.

Posted

 

Harish Rao: రేవంత్ రెడ్డి తిట్టాలనుకుంటే చంద్రబాబును తిట్టాలి: హరీశ్ రావు 

07-03-2024 Thu 15:57 | Telangana
  • పాలమూరు వెనుకబాటుతనానికి చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీనే కారణమన్న హరీశ్ రావు
  • పాలమూరును చంద్రబాబు దత్తత తీసుకొని చేసిందేమీ లేదని విమర్శ
  • రేవంత్ రెడ్డి పాలనలో పౌరుషాన్ని చూపించాలి తప్ప తిట్టడంలో కాదని చురక
 
Harish Rao blames congress and chandrababu for palamuro backward

మహబూబ్‌నగర్ వెనుకబాటుతనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరినైనా తిట్టాలనుకుంటే తన గురువుగారైన చంద్రబాబును తిట్టాలి... నిందించాల్సి వస్తే పాలమూరుకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని నిందించాలని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డిలో పార్టీ నాయకులతో కలిసి హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాలమూరు వెనుకబాటుతనానికి నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనే కారణమని ఆరోపించారు. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ లోపాలు పాలమూరు పాలిట శాపాలుగా మారాయన్నారు. మహబూబ్‌నగర్ వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఖండిస్తున్నట్లు చెప్పారు.

పాలమూరు వలసలకు కారణం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే అన్నారు. గత పార్టీలు ప్రాజెక్టుల పేర్లు మార్చారు తప్ప పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజ్టెలుగా మార్చారన్నారు. ఆ పెండింగ్‌ ప్రాజెక్టులను బీఆర్ఎస్ హయాంలో రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామన్నారు. పాలమూరు పచ్చబడేలా చేసింది కేసీఆరేనని తెలిపారు. బీఆర్ఎస్ కారణంగా పాలమూరుకు మళ్లీ వలసలు తిరిగి వచ్చాయన్నారు. 2014కు ముందు పాలమూరు ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉందో చూడాలన్నారు. పాలమూరును ఆనాడు చంద్రబాబు దత్తత తీసుకున్నారని, పదేళ్లు అధికారంలో ఉన్నా ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. కరవుతో కాంగ్రెస్‌, టీడీపీలు నాడు రాజకీయాలు చేశాయని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టుకు తాము అనుమతులు తెచ్చామని, కాంగ్రెస్ కాల్వలు తవ్వాలని సూచించారు. నాడు పోతిరెడ్డిపాడు నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి నీళ్లు తీసుకెళుతుంటే రేవంత్ రెడ్డి మాట్లాడలేదన్నారు.

30 ఏళ్లలో కల్వకుర్తి ఆయకట్టు కింద 13 వేల ఎకరాలకు నీళ్లిచ్చారని, బీఆర్‌ఎస్ హయాంలో అదే కల్వకుర్తి కింది 3 లక్షల 7 వేల ఎకరాలకు సాగునీరు అందించామని పేర్కొన్నారు. నెట్టంపాడు కింద ఆనాడు 2700 ఎకరాలకు నీరు ఇవ్వగా... మహబూబ్‌‌నగర్‌ జిల్లాలో తారు 6 లక్షల 50 వేల ఎకరాలకు నీళ్లిచ్చామన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఒక్క మెడికల్, నర్సింగ్ కాలేజీ ఇవ్వలేదని, కానీ తాము పాలమూరు జిల్లాలో 5 మెడికల్‌ కాలేజీలు, టీచింగ్‌ ఆసుపత్రులు ఇచ్చామన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పౌరుషాన్ని పాలనలో చూపించాలి కానీ ప్రతిపక్షాన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టడంలో కాదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. కేసీఆర్ కిట్లు తీసుకు వస్తే... రేవంత్ రెడ్డి తిట్లు తిట్టడంలో పోటీ పడుతున్నారని విమర్శించారు. తన ఎత్తు గురించి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. తానూ ఆయన ఎత్తు గురించి మాట్లాడగలనని హెచ్చరించారు. 

 

Posted

Revanth Reddy: కేటీఆర్‌ ఆమర‌ణ నిరాహార దీక్ష చేయాల‌ని సీఏం రేవంత్‌రెడ్డి సూచ‌న‌ 

07-03-2024 Thu 15:55 | Telangana
  • కేటీఆర్ ఆమర‌ణ నిరాహార దీక్ష చేస్తే కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు అండ‌గా ఉంటార్న సీఏం
  • కేంద్రంతో సఖ్య‌త కోస‌మే ప్ర‌ధాని మోదీని క‌లిసిన‌ట్లు వెల్ల‌డి
  • ఆర్ఆర్ఆర్‌ కాంగ్రెస్ హ‌యాంలోనే వ‌చ్చింద‌న్న రేవంత్‌రెడ్డి
  • బీఆర్ఎస్ హ‌యాంలో ప‌బ్బులు, గంజాయి, డ్ర‌గ్స్ వ‌చ్చాయని విమ‌ర్శ‌
 
CM Revanth Reddy suggests that KTR should go on hunger strike

మాజీ మంత్రి కేటీఆర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి కీల‌క సూచ‌న చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కేటీఆర్ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేయాల‌న్నారు. అందుకు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు అండగా ఉంటార‌ని సీఏం చెప్పారు. గ‌త ప్ర‌భుత్వం కేంద్రంతో అంటీముట్ట‌న‌ట్టు ఉండ‌డం వ‌ల్లే నిధులు రాలేద‌ని రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు. కేంద్రంతో స్నేహంగా ఉండాల‌నే ఉద్దేశంతోనే ప్ర‌ధాని మోదీతో పాటు ర‌క్ష‌ణ‌శాఖ మంత్రిని క‌లిశామ‌న్నారు. 

రాష్ట్ర అభివృద్ధి కోసం మెట్టుదిగ‌డంలో త‌ప్పేముంద‌ని అన్నారు. హైద‌రాబాద్‌లో రామ‌గుండం ఎలివేట‌డ్ కారిడార్‌కు శంకుస్థాప‌న చేసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఔట‌ర్ రింగ్ రోడ్డు విష‌యమై కేంద్రం సానుకూలంగా స్పందించింద‌ని చెప్పారు. ఆర్ఆర్ఆర్‌ కాంగ్రెస్ హ‌యాంలోనే వ‌చ్చింద‌న్న సీఏం.. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో ప‌బ్బులు, గంజాయి, డ్ర‌గ్స్ వ‌చ్చాయని దుయ్య‌బ‌ట్టారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...