Jump to content

Recommended Posts

Posted

Kalalaku Rekkalu: ఆడబిడ్డల కోసం 'కలలకు రెక్కలు' కార్యక్రమం అమలు చేయబోతున్నాం: చంద్రబాబు

08-03-2024 Fri 19:51 | Andhra
  • నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
  • మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో కొత్త పథకం తెచ్చామని వెల్లడి
Chandrababu Naidu explains about Kalalaku Rekkalu scheme

నేడు (మార్చి 😎 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంటే సమాజంలో సగం జనాభా మాత్రమే కాదు, సమాజ శక్తిలో సగం అని పేర్కొన్నారు. అందుకే మహిళలను తోబుట్టువుల్లా చూసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని స్పష్టం చేశారు. వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపి, ఆర్థిక స్వావలంబనకు నిరంతరం పని చేసింది తెలుగుదేశం అని వివరించారు. విద్య, ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపింది తెలుగుదేశం అని పేర్కొన్నారు. 

"నేడు మళ్లీ మహిళలను మహాశక్తులుగా మార్చేందుకు హామీ ఇచ్చిందే మహాశక్తి పథకం. ఈ పథకం  కింద ఇంట్లో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ 15,000 చొప్పున ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు నెలకు రూ.1,500ల ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున అందిస్తాం.

అలాగే ఆర్థిక పరిస్థితులు అనుకూలించని కారణంగా మన ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకూడదు అన్న ఆశయంతో, 'కలలకు రెక్కలు' అనే పథకాన్ని మన ప్రభుత్వం వచ్చాక అమలు చేయబోతున్నాం. ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న ఆడబిడ్డలు పై చదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుంది. అంతేకాకుండా కోర్సు కాలానికి ఋణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. 'కలలకు రెక్కలు' పథకంలో మీ పేరును ఇప్పుడే నమోదు చేసుకోవచ్చు. అందుకోసం kalalakurekkalu.com వెబ్ సైట్ కు వెళ్లండి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
20240308fr65eb1f374c507.jpg

Posted

Kalalaku Rekkalu: ప్రతి మహిళ, ప్రతి యువతి కలను నిజం చేయడానికే చంద్రబాబు, పవన్ ఈ పథకం తీసుకువచ్చారు: నన్నపనేని

08-03-2024 Fri 14:41 | Andhra
  • నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
  • వైసీపీ పాలనలో మహిళా రక్షణ కొరవడిందన్న నన్నపనేని రాజకుమారి
  • స్త్రీల జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడమే టీడీపీ-జనసేన ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి 
Nannapaneni Rajakumari elaborates Kalalaku Rekkalu scheme

వైసీపీ ప్రభుత్వంలో కొరవడిన మహిళా రక్షణను చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు మాత్రమే పునరుద్ధరించగలరని టీడీపీ సీనియర్ నాయకురాలు, మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. 

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళలకు, తెలుగుదేశం మహిళలకు ప్రత్యేక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రతి మహిళ, ప్రతి యువతి కలను నిజం చేయడానికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మహిళా దినోత్సవం సందర్భంగా ‘కలలకు రెక్కలు’ పేరుతో నూతన పథకాన్ని ప్రకటించారని నన్నపనేని రాజకుమారి తెలిపారు. మహిళలు, యువతుల ‘కలలకు రెక్కలు’ అందించి, వారి జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడమే టీడీపీ-జనసేన ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. 

ఈ పథకం కింద మహిళలు, యువతులు పొందే బ్యాంకు రుణానికి టీడీపీ-జనసేన ప్రభుత్వం హామీదారుగా ఉంటుందని తెలిపారు. కలలకు రెక్కలు పథకం రిజిస్ట్రేషన్ కోసం 92612 92612 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి... లేదా www.kalalakurekkalu.com వెబ్ సైట్లోకి లాగిన్ అవ్వండి అని వివరించారు. 

చంద్రబాబు స్వతహాగా మహిళా పక్షపాతి అని, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహిళల రక్షణ, ఆర్థిక స్వావలంబనకు ఆయన తీసుకున్న నిర్ణయాలే అందుకు నిదర్శనమని నన్నపనేని రాజకుమారి తెలిపారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటుచేసి, మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా ఆర్థికంగా శక్తిమంతుల్ని చేసిన ఘనత చంద్రబాబుది అని కొనియాడారు. 

మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, స్త్రీలపై, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని శిక్షించడానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయించారని వెల్లడించారు. సర్వీస్ కమిషన్ లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి, వారు ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్స్ ఉద్యోగాలలో రాణించి ప్రజాసేవలో ఎదిగేలా చేశారని వివరించారు.

Posted

Nara Brahmani: మహిళ అంటే ఒక తల్లి, ఒక చెల్లి, ఒక కూతురు మాత్రమే కాదు: బ్రాహ్మణి

08-03-2024 Fri 14:22 | Andhra
  • నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
  • మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిన నారా బ్రాహ్మణి
  • మహిళ అంటే ఒక చాంపియన్ అంటూ ట్వీట్
Nara Brahmani wishes all women on International Womens Day

ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారా బ్రాహ్మణి సోషల్ మీడియాలో స్పందించారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళ అంటే కుటుంబంలో ఒక తల్లి, ఒక చెల్లి, ఒక కూతురు మాత్రమే కాదని... సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక రంగాలలో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకెళుతున్న ఒక చాంపియన్ అని వివరించారు. ప్రతి మహిళ తన సామర్థ్యాలను గుర్తించి ఆకాశమే హద్దుగా ఎదగాలని కోరుకుంటున్నట్టు వివరించారు.

Posted

Nara Bhuvaneswari: 'కలలకు రెక్కలు' పథకాన్ని ప్రకటించిన నారా భువనేశ్వరి

08-03-2024 Fri 14:08 | Andhra
  • కర్నూలు జిల్లా పత్తికొండలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర
  • మొదటిసారి ఓటు వేయనున్న యువతీయువకులతో ముఖాముఖి
  • పత్తికొండలో కొత్త కార్యక్రమం ప్రకటన
  • మహిళలు, విద్యార్థినుల కోసం 'కలలకు రెక్కలు' పథకం
Nara Bhuvaneswari announces new scheme Kalalaku Rekkalu

టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి కర్నూలు జిల్లాలో నిజం గెలవాలి యాత్ర చేపట్టారు. ఇవాళ ఆమె పత్తికొండలో పర్యటించారు. మొదటిసారి ఓటు వేయనున్న యువతీయువకులతో ముఖాముఖి నిర్వహించారు. 

ఓటు ఎవరికి వేయాలో ముందే ఆలోచించుకోవాలని యువతకు సూచించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సమర్థ నాయకుడిని ఎన్నుకోవడం చాలా ముఖ్యం అని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా ఆమె 'కలలకు రెక్కలు' పథకాన్ని ప్రకటించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వంలో 'కలలకు రెక్కలు' పథకం ప్రారంభమవుతుందని వెల్లడించారు. మహిళలు, ఇంటర్ పూర్తయి ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే విద్యార్థినుల కోసం ఈ పథకం తీసుకువస్తున్నట్టు భువనేశ్వరి వివరించారు. 

ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకునేవారికి ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు ఇస్తారని తెలిపారు. బ్యాంకు నుంచి పొందే రుణాలకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలా ఈ 'కలలకు రెక్కలు' పథకానికి రూపకల్పన చేశారని వెల్లడించారు.

Posted

Yanamala: కుటుంబ సభ్యుల నమ్మకమే పొందలేని జగన్ ప్రజలను ఏం ఉద్ధరిస్తారు?: యనమల

08-03-2024 Fri 15:03 | Andhra
  • జగన్ పాపం పండిందన్న యనమల
  • అధికారం కోసం చేసిన పాపాలే శాపాలయ్యాయని వెల్లడి
  • షర్మిల వ్యాఖ్యలతో జగన్ నిజస్వరూపం బట్టబయలైందని స్పష్టీకరణ 
Yanamala slams CM Jagan

మహిళా దినోత్సవం నాడు సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. జగన్ పాపం పండిందని, అధికారం కోసం చేసిన పాపాలే శాపాలయ్యాయని పేర్కొన్నారు. జగన్ 420 అన్న షర్మిల వ్యాఖ్యలతో ఆయన నిజ స్వరూపం బట్టబయలైందని యనమల వ్యాఖ్యానించారు. సొంత చెల్లెళ్లకే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకు ఏం చెబుతారని ఎద్దేవా చేశారు. కుటుంబ సభ్యుల నమ్మకమే పొందలేని జగన్ ప్రజలను ఏం ఉద్ధరిస్తారని ఎత్తిపొడిచారు. షర్మిల, సునీత, విజయమ్మలకు ఏ హాని జరిగినా జగన్ దే బాధ్యత అని యనమల స్పష్టం చేశారు. మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యమని అన్నారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...