Jump to content

TDP+JSP+BJP— the dynamic leader who can work with any party - CBN


Recommended Posts

Posted

Amit Shah: అమిత్ షా ప్రకటనపై చంద్రబాబు స్పందన 

09-03-2024 Sat 22:01 | Andhra
  • బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఖరారు
  • చంద్రబాబు, పవన్ లకు ఎన్డీయేలోకి స్వాగతం పలికిన బీజేపీ పెద్దలు
  • ఎన్డీయే అంతకంతకు ఎదుగుతోందన్న అమిత్ షా
  • అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
 
Chandrababu thanked Amit Shah

బీజేపీతో టీడీపీ, జనసేన పార్టీల పొత్తు, ఎన్డీయేలో చేరికపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, కలిసివచ్చే అన్ని పార్టీలకు తిరుగులేని వేదికగా నిలుస్తూ ఎన్డీయే అంతకంతకు ఎదుగుతోందని వివరించారు. 

ఇవాళ ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎన్డీయేలో చేరాయని అమిత్ షా వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు ఎన్డీయేలోకి స్వాగతం పలుకుతున్నామని వివరించారు. వారి భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల సాధనను వేగవంతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. 

అమిత్ షా ప్రకటనపై చంద్రబాబు స్పందించారు. "అమిత్ షా గారూ కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ కు అపారమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. మా రాష్ట్ర ఎదుగుదల దేశ అభ్యున్నతికి ఎంతగానో దోహదపడుతుంది. ప్రజల దీవెనలతో, గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాశ్రేయస్సు కోసం నవ శకానికి నాంది పలుకుతాం" అని చంద్రబాబు వివరించారు.

Posted

 

Chilakaluripet: టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి సభ కోసం చిలకలూరిపేట వద్ద స్థలం పరిశీలన 

09-03-2024 Sat 21:36 | Andhra
  • బీజేపీతో టీడీపీ, జనసేనలకు కుదిరిన పొత్తు
  • టీడీపీ, జనసేన పార్టీలకు ఎన్డీయేలోకి స్వాగతం పలికిన బీజేపీ పెద్దలు
  • ఈ నెల 17 లేదా 18న ఏపీలో మూడు పార్టీల భారీ బహిరంగ సభ
  • బొప్పూడి వద్ద 150 ఎకరాల స్థలం పరిశీలించిన టీడీపీ-జనసేన నేతలు
 
Three parties will be held meeting at Chilakaluripet

రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ చేయి కలిపిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల చర్చలు ఫలించి పొత్తు కుదిరింది. ఈ నేపథ్యంలో, మూడు పార్టీలు ఏపీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. 

ఈ నెల 17 లేదా 18న జరిగే ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ-జనసేన నేతలు పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద సభా స్థలాన్ని పరిశీలించారు. బొప్పూడి వద్ద 150 ఎకరాల స్థలం అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తించారు. 

ఈ బృందంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్డీయే కూటమిలో చేరాక నిర్వహిస్తున్న మొదటి బహిరంగ సభ ఇదేనని వెల్లడించారు. ఈ సభకు 10 లక్షల నుంచి 15 లక్షల మంది హాజరవుతారన్న అంచనాలు ఉన్నాయని తెలిపారు. 

అందుకే అన్ని విధాలా అందరికీ అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు చిలకలూరిపేటను ఎంపిక చేశారని ప్రత్తిపాటి వివరించారు. రేపటి నుంచే ఇక్కడి రైతులతో మాట్లాడి సభకు ఏర్పాట్లు మొదలుపెడతామని వెల్లడించారు. 

ఇది దేశం మొత్తానికి ఒక సందేశం ఇచ్చే సభ అని వివరించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరినప్పటి నుంచే వైసీపీకి వణుకుపుడుతోందని అన్నారు. మూడు పార్టీల ఐక్యతను చెడగొట్టే  దురుద్దేశం వారిలో కనిపిస్తోందని, వైసీపీకి అభ్యర్థులు కూడా దొరక్కుండా జారుకునే పరిస్థితి ఏర్పడబోతోందని ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. 

అంతేకాదు, వైసీపీ వాళ్లు అద్దంకిలో నిర్వహించే సిద్ధం సభను, చిలకలూరిపేటలో తాము నిర్వహించబోయే సభను రాష్ట్ర ప్రజలు పోల్చి చూసుకునే స్థాయిలో తమ సభ ఉండబోతోందని ధీమా వ్యక్తం చేశారు. 

వైసీపీ ఎన్ని దురాలోచనలు చేసినా, రాష్ట్ర శ్రేయస్సు కోసం మూడు పార్టీల కలయిక తప్పనిసరైందని స్పష్టం చేశారు. ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించబోయే ఈ సభ చరిత్రలో లిఖించబడుతుందని అన్నారు.
20240309fr65ec88d7bd4bc.jpg20240309fr65ec88f5947ee.jpg

 

Posted

Revanth Reddy: చంద్రబాబుతో బీజేపీ పొత్తుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు 

09-03-2024 Sat 21:31 | Telangana
  • ఎన్డీయే అతుకుల బొంత... ఏపీలోనూ చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్య
  • ధర్నా చౌక్ వద్దన్న వారే అక్కడ ధర్నా చేస్తున్నారంటూ కవితపై ఆగ్రహం
  • ప్రభుత్వాన్ని కూల్చే మొగోడు ఉన్నాడా? అన్న రేవంత్ రెడ్డి
  • కూల్చే సత్తా ఎవరికీ లేదు... దమ్ముంటే టచ్ చేయాలన్న ముఖ్యమంత్రి
 
Telangana CM Revanth Reddy interesting comments on bjp tdp janasena alliance

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం మేడ్చల్ కాంగ్రెస్ ప్రజాదీవెన సభలో మాట్లాడుతూ... ఎన్డీయే మొత్తం అతుకుల బొంత అని విమర్శించారు. ప్రతి రాష్ట్రంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారన్నారు. 400 సీట్లు వస్తాయనే ధైర్యం ఉంటే ఏపీలో చంద్రబాబు ఎందుకు? ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఎందుకు? అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో శివసేనను, ఎన్సీపీ పార్టీలను చీల్చారని ఆరోపించారు.

కర్ణాటకకు వెళ్లి దేవెగౌడతో... ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి చంద్రబాబుతో, బీహార్‌లో నితీశ్ కుమార్‌తో పొత్తు పెట్టుకున్నారన్నారు. అక్రమ కేసులు పెట్టి వారితోనే పొత్తులకు దిగారని ఆరోపించారు. బీజేపీకి కాలం చెల్లిందన్నారు. పదేళ్ల తర్వాత తెలంగాణలో కేడీని ఎలాగైతే బండకేసి కొట్టారో... ఢిల్లీలోని మోడీని బండకేసి కొట్టేందుకు 140 కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆ విషయం మోదీకి తెలుసు కాబట్టే అతుకుల బొంతను తయారు చేసుకుంటున్నారన్నారు.

ధర్నా చౌక్ వద్దన్న వారే ధర్నా చేస్తారా? కవితపై తీవ్ర విమర్శలు

గతంలో ధర్నా చౌక్ వద్దన్న వారు ఇప్పుడు అదే ధర్నా చౌక్ వద్ద ధర్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తాము 43 శాతం మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చామని, నీకు లెక్క కావాలంటే మీ అయ్యను అసెంబ్లీకి పంపించాలని సూచించారు. గతంలో ధర్నా చౌక్ వద్దని... ఇప్పుడు అక్కడే సిగ్గులేకుండా వెళ్లి ధర్నా చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తొలి కేబినెట్‌లో మహిళా మంత్రి ఒక్కరు కూడా లేరని గుర్తు చేశారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటే ప్రతిపక్ష నేత భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వాన్ని కూల్చే మొగోడు ఉన్నాడా?

తానేమీ అయ్య పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల దీవెనతో వచ్చానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని అంటున్నారని... అంత మొగోడు తెలంగాణలో ఉన్నాడా? అని సవాల్ చేశారు. తమ కార్యకర్తలు తలుచుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు కదా... ఇటుక పెళ్లలు కూడా మిగలవని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలు చేస్తే మా కార్యకర్తలు కళ్లలో కారం కొడతారన్నారు. దోచుకున్న డబ్బుతో వాడినో... వీడినో కొందామని చూస్తున్నారని ఆరోపించారు. కూల్చే సత్తా ఎవరికీ లేదన్నారు. ధైర్యం ఉంటే తమను టచ్ చేయాలని వ్యాఖ్యానించారు.

పిల్లర్లు కుంగిన మేడిగడ్డ నుంచి నీళ్లు ఇవ్వాలని పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ రిపేర్ చేయాలని అంటున్నారని... కానీ ఉంటుందో ఊడుతుందో తెలియదన్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు 60 ఏళ్లయినా చెక్కు చెదరలేదన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కడితే మూడేళ్లకు కూలిపోయేలా కట్టారా? అని ప్రశ్నించారు. తాను ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తానని... మిగతా సమయం అభివృద్ధి కోసం చూస్తానన్నారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయస్థాయి అడుగు పడింది కాంగ్రెస్ హయాంలోనే అన్నారు.

Posted

Chandrababu: మళ్లీ ఎన్డీయేలో చేరడం సంతోషం కలిగిస్తోంది: చంద్రబాబు 

09-03-2024 Sat 21:14 | Andhra
  • ఏపీలో చేయి కలిపిన టీడీపీ-జనసేన, బీజేపీ
  • బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు
  • కూటమితో స్వర్ణయుగం వస్తుందని స్పష్టీకరణ
 
Chandrababu said he feels happy for rejoining NDA

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఉమ్మడి ప్రకటన వెలువడిన అనంతరం చంద్రబాబు స్పందించారు. మళ్లీ ఎన్డీయేలో చేరడం సంతోషం కలిగిస్తోందని తెలిపారు. ఏపీకి, దేశానికి సేవ చేసేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తు అని స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ, జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఎదురుచూస్తున్నామని చంద్రబాబు ఉద్ఘాటించారు. 

ఈ కూటమి ప్రజాశ్రేయస్సుకు స్వర్ణయుగం తెస్తుందనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు. చారిత్రాత్మకమైన ఈ కూటమిని ఆశీర్వదిస్తారనే విశ్వాసం తనకుందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి, తెలుగు ప్రజల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు వివరించారు.

  • Haha 1
Posted

Nara Lokesh: రేపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నారా లోకేశ్ 'శంఖారావం' 

09-03-2024 Sat 20:50 | Andhra
  • రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నారా లోకేశ్ శంఖారావం
  • యువగళం పాదయాత్రలో కవర్ చేయని ప్రాంతాల్లో శంఖారావం యాత్ర
  • పార్టీ శ్రేణులతో సమావేశాలు, ముఖాముఖి కార్యక్రమాలు  
 
Nara Lokesh will conduct Shankaravam in Ananatapur district tomorrow

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ పాదయాత్రలో వెళ్లని కొన్ని ప్రాంతాల్లో లోకేశ్ శంఖారావం పేరిట పర్యటనలు చేపట్టారు. ఇందులో భాగంగా రేపు (మార్చి 10) ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉరవకొండ, రాయదుర్గం, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. పార్టీ  శ్రేణులతో సమావేశాలు, కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రేపటి శంఖారావం షెడ్యూల్ విడుదలైంది.

నారా లోకేశ్ శంఖారావం వివరాలు
ఉమ్మడి అనంతపురం జిల్లా
10-03-2024 (ఆదివారం) కార్యక్రమ వివరాలు
ఉమ్మడి అనంతపురం జిల్లా

ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం
(భారత్ పెట్రోలియం, లత్తవరం, ఉరవకొండ మండలం)
ఉదయం
10.00 – అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ప్రసంగం.
10.05 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ ప్రసంగం.
10-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
10.32 – ఉరవకొండ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త గౌతమ్ ప్రసంగం.
10.34– ఉరవకొండ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పయ్యావుల కేశవ్ ప్రసంగం.
10.36– ఉరవకొండ నియోజకవర్గ శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతుల మీదుగా సూపర్-6 కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
11.29 – పార్టీ కేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
12.50 – లోకేశ్ రాయదుర్గం చేరిక.
1.00 – రాయదుర్గం నియోజకవర్గంలో భోజన విరామం.

రాయదుర్గం నియోజకవర్గం
(రాయల్ డిగ్రీ కాలేజ్, కనేకల్ రోడ్, రాయదుర్గం)
మధ్యాహ్నం
2.30 – అనంతపూర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ప్రసంగం.
2.35 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ ప్రసంగం.
2-45 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
3.02 – రాయదుర్గం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కే.మంజనాథ్ గౌడ ప్రసంగం. 
3.04 – రాయదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కాలవ శ్రీనివాసులు ప్రసంగం.
3.06– రాయదుర్గం నియోజకవర్గ శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
3.26– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
3.54– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతులమీదుగా సూపర్-6 కిట్ల అందజేత.
3.58– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
3.59 – పార్టీకేడర్ తో లోకేశ్ సెల్ఫీ.
5.00 –  లోకేశ్ కల్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిక.

కల్యాణదుర్గం నియోజకవర్గం
(గరుడపురం రోడ్, కల్యాణదుర్గం)
సాయంత్రం
5.00 – అనంతపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ప్రసంగం.
5.05 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ ప్రసంగం.
5-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
5.32 – కల్యాణదుర్గం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బాల్యం రాజేశ్ ప్రసంగం.
5.34 – కల్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ ఏ.సురేంద్ర బాబు ప్రసంగం.
5.36 – కల్యాణదుర్గం నియోజకవర్గ శంఖారావంలో లోకేశ్ ప్రసంగం.
5.56 – పార్టీ కార్యకర్తలతో లోకేశ్ ముఖాముఖి.
6.26 – పార్టీ కేడర్ కు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
6.28 – టీడీపీ కార్యకర్తలతో లోకేశ్ ప్రతిజ్ఞ.
6.29 – పార్టీ కేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
6.30 – రోడ్డుమార్గం ద్వారా అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి ప్రయాణం 
7.45 – అనంతపురం శివార్లలోని రుద్రంపేట చేరుకుని, అక్కడ బస చేస్తారు.

Posted

Gudivada Amarnath: బీజేపీకి ఓటు వేస్తే జగన్ కు వేసినట్టేనని గతంలో చంద్రబాబు అనలేదా?: ఏపీ మంత్రి అమర్నాథ్ 

09-03-2024 Sat 20:19 | Andhra
  • బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తు ఖరారు
  • చంద్రబాబుపై మంత్రి అమర్నాథ్ విమర్శలు
  • జగన్ ను ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకుంటున్నారని వెల్లడి
 
Minister Amarnath slams Chandrababu over alliance

బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు కుదరడంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శనాత్మకంగా స్పందించారు. కేఏ పాల్ పార్టీతో తప్ప చంద్రబాబు అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. పొత్తుల పేరుతో చంద్రబాబు ఎవరితో ఎలాంటి సంబంధం అయినా పెట్టుకుంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

బీజేపీకి ఓటు వేస్తే ఆ ఓటు జగన్ కే పోతుందని గతంలో చంద్రబాబు అనలేదా? అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. బీజేపీతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని గతంలోనే చెప్పామని అన్నారు. తమకు పొత్తులతో అవసరం లేదని, ప్రజలతోనే తమ పొత్తు అని స్పష్టం చేశారు.

మేం చేసిన అభివృద్ధి చూసి ఓటేయమని జగన్ చెబుతుంటే... మా పొత్తులు చూసి ఓటేయండని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు మేం సిద్ధం అని జగన్ అంటున్నారు... అమిత్ షా ఇంటి ముందు పొత్తులకు మేం సిద్ధం అని చంద్రబాబు, పవన్ అంటున్నారు అని ఎత్తిపొడిచారు. సీఎం జగన్ ను ఎదుర్కోవడం చేతకాక పొత్తులు పెట్టుకుంటున్నారని మంత్రి అమర్నాథ్ విపక్ష నేతలను విమర్శించారు.

Posted

Ambati Rambabu: సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులారా... అంటూ మంత్రి అంబటి ఆసక్తికర ట్వీట్ 

09-03-2024 Sat 19:59 | Andhra
  • పవన్ కల్యాణ్, చంద్రబాబులపై అంబటి విమర్శలు
  • సీఎం అంటే చంద్రబాబు మనిషా అంటూ ట్వీట్
  • గతంలో చంద్రబాబు వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్న అంబటి 
 
AP Minister Ambati Rambabu slams Pawan Kalyan and Chandrababu

ఏపీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై విమర్శనాస్త్రాలు సంధించారు. 

సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులారా... అంటూ అంబటి ఆసక్తికర ట్వీట్ చేశారు. సీఎం అంటే చీఫ్ మినిస్టరా? సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా? సీఎం అంటే చంద్రబాబు మనిషా? సీఎం అంటే చీటింగ్ మనిషా? అంటూ అంబటి కాపు వర్గాన్ని ప్రశ్నించారు.

అంతేకాదు, గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఓ సభలో చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా మంత్రి అంబటి రాంబాబు పోస్టు చేశారు. మోదీ వస్తే ముస్లింల మీద, క్రైస్తవుల మీదా దాడులు జరుగుతాయని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపించారు.

Posted

Andhra Pradesh: ఉమ్మడి ప్రకటన విడుదల చేసిన నడ్డా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ 

09-03-2024 Sat 19:19 | Andhra
  • ఏపీలో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు
  • బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన
  • బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉమ్మడి ప్రకటన  
 
Joint statement from three parties

త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులు అమిత్  షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల చర్చలు ముగిశాయి. ఏపీలో మూడు పార్టీల పొత్తు, ఎన్డీయేలోకి టీడీపీ, జనసేన చేరికపై జేపీ నడ్డా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు చేయి కలిపాయని ఆ ప్రకటనలో వెల్లడించారు. దేశ సౌభాగ్యం, ఏపీ ప్రజల అభ్యున్నతే ఈ మూడు పార్టీల లక్ష్యం అని వివరించారు. 

"బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఈసారి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. గత పదేళ్లుగా భారతదేశ పురోభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీలతో భాగస్వామ్యం ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో దోహదపడుతుంది. బీజేపీ, టీడీపీ మధ్య చాలా పాత స్నేహం ఉంది. టీడీపీ 1996లో ఎన్డీయేలో చేరింది. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలోనూ, నరేంద్ర మోదీ ప్రభుత్వంలోనూ విజయవంతంగా కలిసి పనిచేసింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. 2014 సాధారణ ఎన్నికల సమయంలో జనసేన పార్టీ మద్దతు పలికింది. ఇక, మూడు పార్టీల మధ్య సీట్ల పంపకం మార్గదర్శకాలు, ఇతర వివరాలపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన వెలువడుతుంది. మా కూటమి ఏపీ ప్రజల అంచనాలను అందుకుంటుందని ఆశిస్తున్నాం. ప్రజలు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం" అని ఆ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు.

 జేపీ నడ్డా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల తరఫున బీజేపీ కేంద్ర కార్యాలయం ఈ ప్రకటన విడుదల చేసింది.
20240309fr65ec676b92bba.jpg

Posted

Chandrababu: ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడడం ఏంటి?: చంద్రబాబు 

09-03-2024 Sat 18:48 | Andhra
  • ఏపీలో మూడు పార్టీల రాజకీయ కూటమి ఏర్పాటు
  • ఈ నెలలోనే ప్రచారం ప్రారంభిస్తామన్న చంద్రబాబు
  • ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కంటే భయం ఎక్కువగా ఉందని వెల్లడి  
 
Chandrababu said people fears of state govt

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ రాజకీయ కూటమి ఏర్పడింది. గత కొంతకాలంగా ప్రతిపాదనల దశలో ఉన్న మూడు పార్టీల పొత్తు నేడు ఖరారైంది. ఈ నేపథ్యంలో, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. 

మరి కొన్నిరోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానున్నందున, మూడు పార్టీలు కలిసి ఈ నెలలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాయని వెల్లడించారు. ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేస్తుందో రెండ్రోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు. 

ఈ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కంటే భయం ఎక్కువగా ఉందని అన్నారు. ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడడం ఏంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిని కోరుకునే మైనారిటీ సోదరులు తమకే ఓటేస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

కొన్ని నెలల కిందట తనను అరెస్ట్ చేసినప్పుడు భౌతికంగా లేకుండా చేయాలని చూశారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ వంటి రాజకీయనేతను ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండరని వ్యాఖ్యానించారు.

Posted

Chandrababu: ఢిల్లీలో ముగిసిన చంద్రబాబు, పవన్ పర్యటన 

09-03-2024 Sat 18:25 | Andhra
  • చంద్రబాబు, పవన్ ల ఢిల్లీ పర్యటన సక్సెస్
  • బీజేపీతో కుదిరిన పొత్తు
  • ఢిల్లీ నుంచి హైదరాబాద్ పయనం
 
Chandrababu and Pawan Kalyan Delhi tour concluded

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల ఢిల్లీ పర్యటన విజయవంతం అయింది. బీజేపీతో పొత్తును ఖరారు చేసుకోవాలని ఢిల్లీ వెళ్లిన ఇరువురు నేతలు అనుకున్న కార్యాన్ని జయప్రదం చేశారు. టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఖరారైందని నేడు ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ఢిల్లీ పర్యటన నేటితో ముగిసింది. వారిద్దరూ ఢిల్లీ నుంచి హైదరాబాద్ పయనమయ్యారు. బీజేపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో ఏపీలో టీడీపీ, జనసేన శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. తదుపరి కార్యాచరణపై త్వరలోనే టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర నాయకత్వాలు ఉమ్మడి ప్రకటన చేయనున్నాయి.

Posted

Chandrababu: ఈ నెల 17 లేదా 18న టీడీపీ-జనసేన-బీజేపీ భారీ సభ... హాజరుకానున్న ప్రధాని మోదీ! 

09-03-2024 Sat 17:22 | Andhra
  • టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఖరారు
  • ఢిల్లీ నుంచి టీడీపీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు
  • భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచన
  • మోదీ హాజరయ్యే ఈ సభకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని నిర్దేశం
 
Chandrababu says PM Modi will attend three parties meeting

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారైంది. సీట్ల పంపకం ఒక్కటే మిగిలుంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి ఏపీ నేతలతో మాట్లాడారు. పొత్తు కుదిరిందని, సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు. జనసేన, బీజేపీలకు 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాలు ఇస్తున్నామని సూచనప్రాయంగా తెలిపారు. 

పొత్తు కుదిరిన నేపథ్యంలో, ఈ నెల 17 లేదా 18న భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని టీడీపీ నేతలకు చంద్రబాబు నిర్దేశించారు. మూడు పార్టీలు కలిసి నిర్వహించే ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వస్తారని వివరించారు. ప్రధాని మోదీ పాల్గొనే ఈ సభకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని టీడీపీ నేతలకు సూచించారు.

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...