Jump to content

Shinnayana vardhanthi opu lone candidates ni announce cheya nuna jagan


Recommended Posts

Posted

 

Jagan: కాసేపట్లో ఇడుపులపాయకు జగన్.. 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం 

16-03-2024 Sat 09:35 | Andhra
  • వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న జగన్
  • ఈ రోజు ప్రకటించబోయే అభ్యర్థులే ఫైనల్
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం
 
Jagan to announce 175 MLA and 25 MP candidates today

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో ఇడుపులపాయకు బయల్దేరుతున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఆయన బయల్దేరుతారు. ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద ఆయన ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 175 ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 ఎంపీ అభ్యర్థుల పేర్లను ఒకేసారి ప్రకటిస్తారు. ఇప్పటి వరకు ఎంతో మంది అభ్యర్థులను జగన్ ప్రకటించారు. కొన్నిచోట్ల ప్రకటించిన అభ్యర్థులను తొలగించి, కొత్త అభ్యర్థులను కూడా ప్రకటించారు. అయితే ఈ మధ్యాహ్నం ప్రకటించబోయే అభ్యర్థులే ఫైనల్. వీరే ఎన్నికల్లో పోటీ చేస్తారు. వైసీపీ జాబితాను జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు, నందిగామ సురేశ్ ప్రకటిస్తారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం. అన్ని వర్గాలకు అవకాశం ఉండేలా జాబితాను తయారు చేసినట్టు చెపుతున్నారు. మరోవైపు ఈ నెల 18 నుంచి ఎన్నికల ప్రచారాన్ని జగన్ ప్రారంభించే అవకాశం ఉంది. రోజుకు రెండు లేదా మూడు బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

 

Posted
4 hours ago, psycopk said:

 

 

Jagan: కాసేపట్లో ఇడుపులపాయకు జగన్.. 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం 

16-03-2024 Sat 09:35 | Andhra
  • వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న జగన్
  • ఈ రోజు ప్రకటించబోయే అభ్యర్థులే ఫైనల్
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం
 
Jagan to announce 175 MLA and 25 MP candidates today

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో ఇడుపులపాయకు బయల్దేరుతున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఆయన బయల్దేరుతారు. ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద ఆయన ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 175 ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 ఎంపీ అభ్యర్థుల పేర్లను ఒకేసారి ప్రకటిస్తారు. ఇప్పటి వరకు ఎంతో మంది అభ్యర్థులను జగన్ ప్రకటించారు. కొన్నిచోట్ల ప్రకటించిన అభ్యర్థులను తొలగించి, కొత్త అభ్యర్థులను కూడా ప్రకటించారు. అయితే ఈ మధ్యాహ్నం ప్రకటించబోయే అభ్యర్థులే ఫైనల్. వీరే ఎన్నికల్లో పోటీ చేస్తారు. వైసీపీ జాబితాను జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు, నందిగామ సురేశ్ ప్రకటిస్తారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం. అన్ని వర్గాలకు అవకాశం ఉండేలా జాబితాను తయారు చేసినట్టు చెపుతున్నారు. మరోవైపు ఈ నెల 18 నుంచి ఎన్నికల ప్రచారాన్ని జగన్ ప్రారంభించే అవకాశం ఉంది. రోజుకు రెండు లేదా మూడు బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

 

Psycho anna, YCP gelisthe inka TDP ni permanent gaa close cheyyatameena?

Posted
1 minute ago, bharathicement said:

Psycho anna, YCP gelisthe inka TDP ni permanent gaa close cheyyatameena?

nuvvu entha edchina ycp gelvadu anna 5rs done

Posted

*వైస్సార్సీపీ అభ్యర్థులు* 
1 ఇచ్ఛాపురం - శ్రీమతి పిరియా విజయ
2 పలాస - శ్రీ సీదిరి అప్పలరాజు
3 టెక్కలి - శ్రీ దువ్వాడ శ్రీనివాస్
4 పాతపట్నం - శ్రీమతి రెడ్డి శాంతి
5 శ్రీకాకుళం - శ్రీ ధర్మాన ప్రసాద రావు
6 ఆమదాలవలస - శ్రీ తమ్మినేని సీతారాం
7 ఎచ్చెర్ల - శ్రీ గొర్లె కిరణ్ కుమార్
8 నరసన్నపేట - శ్రీ ధర్మాన కృష్ణ దాస్
9 రాజాం - శ్రీ తలే రాజేష్
10 పాలకొండ - శ్రీమతి విశ్వాసరాయి కళావతి
11 కురుపాం - శ్రీమతి పుష్పశ్రీవాణి పాముల
12 పార్వతీపురం - శ్రీ అలజంగి జోగారావు
13 సాలూరు - శ్రీ పీడిక రాజన్న దొర
14 బొబ్బిలి - శ్రీ శంబంగి వెంకట చిన అప్పల నాయుడు
15 చీపురుపల్లి - శ్రీ బొత్స సత్యనారాయణ
16 గజపతినగరం - శ్రీ  బొత్స అప్పలనరసయ్య
17 నెల్లిమర్ల - శ్రీ బడ్డుకొండ అప్పల నాయుడు
18 విజయనగరం - శ్రీ వీరభద్ర స్వామి కోలగట్ల
19 శృంగవరపుకోట - శ్రీ కడుబండి శ్రీనివాసరావు
20 భీమిలి - శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు
21 విశాఖపట్నం తూర్పు - శ్రీ ఎంవివి సత్యనారాయణ
22 విశాఖపట్నం దక్షిణ - శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ 
23 విశాఖపట్నం ఉత్తరం - శ్రీ కేకే రాజు
24 విశాఖపట్నం పశ్చిమం -  
25 గాజువాక - శ్రీ గుడివాడ అమర్నాథ్
26 చోడవరం - శ్రీ కరణం ధర్మశ్రీ
27 మాడుగుల - శ్రీ బూడి ముత్యాలనాయుడు
28 అరకులోయ - శ్రీ రేగం మత్స్య లింగం
29 పాడేరు - శ్రీ మత్స్యరాస విశ్వేశ్వర రాజు 
30 అనకాపల్లి - శ్రీ మలసాల భారత్ కుమార్ 
31 పెందుర్తి - శ్రీ అన్నంరెడ్డి అదీప్ రాజ్
32 ఎలమంచిలి -  ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు
33 పాయకరావుపేట - శ్రీ కంబాల జోగులు
34 నర్సీపట్నం - శ్రీ పెట్ల ఉమా శంకర గణేష్
35 తుని - శ్రీ దాడిశెట్టి రాజా
36 ప్రత్తిపాడు (కాకినాడ) - శ్రీ వరుపుల సుబ్బారావు
37 పిఠాపురం - శ్రీమతి వంగా గీత
38 కాకినాడ రూరల్ - శ్రీ కురసాల కన్నబాబు
39 పెద్దాపురం - శ్రీ దవులూరి దొరబాబు
40 అనపర్తి - శ్రీ సత్తి సూర్యనారాయణ రెడ్డి
41 కాకినాడ సిటీ - శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
42 రామచంద్రపురం-  శ్రీ పిల్లి సూర్యప్రకాష్
43 ముమ్మిడివరం - శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్
44 అమలాపురం - శ్రీ పినిపె విశ్వరూప్
45 రాజోలు - శ్రీ గొల్లపల్లి సూర్యారావు
46 గన్నవరం (కోనసీమ) - శ్రీ విప్పర్తి వేణుగోపాల్
47 కొత్తపేట - శ్రీ చిర్ల జగ్గిరెడ్డి
48 మండపేట - శ్రీ  వి.జోగేశ్వరరావు
49 రాజానగరం - శ్రీ జక్కంపూడి రాజా
50 రాజమండ్రి సిటీ - శ్రీ మార్గాని భరత్
51 రాజమండ్రి రూరల్ - శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణా
52 జగ్గంపేట - శ్రీ తోట నరసింహం
53 రంపచోడవరం - శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి
54 కొవ్వూరు - శ్రీ తలారి వెంకట్రావ్
55 నిడదవోలు - శ్రీ జి. శ్రీనివాస్ నాయుడు
56 ఆచంట - శ్రీ చెరుకువాడ శ్రీరంగనాధ రాజు
57 పాలకొల్లు - శ్రీ గుడాల శ్రీహరి గోపాలరావు
58 నరసాపురం - శ్రీ ముదునూరి ప్రసాద రాజు
59 భీమవరం -  శ్రీ గ్రంధి శ్రీనివాస్
60 ఉండి - శ్రీ పివిఎల్ నరసింహ రాజు
61 తణుకు - శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు
62 తాడేపల్లిగూడెం - శ్రీ కొట్టు సత్యనారాయణ
63 ఉంగుటూరు - శ్రీ పుప్పాల శ్రీనివాసరావు
64 దెందులూరు - శ్రీ అబ్బయ్య చౌదరి కొఠారి
65 ఏలూరు - శ్రీ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్
66 గోపాలపురం - శ్రీ తలారి వెంకట్రావు
67 పోలవరం - శ్రీ తెల్లం బాలరాజు
68 చింతలపూడి - వున్నమట్ల ఎలిజా
69 తిరువూరు - కొక్కిలిగడ్డ రక్షణ నిధి
70 నూజివీడు మేకా - వెంకట ప్రతాప్ అప్పారావు
71 గన్నవరం - శ్రీ వల్లభనేని వంశీ 
72 గుడివాడ - శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు
73 కైకలూరు - శ్రీ దూలం నాగేశ్వరరావు
74 పెడన - శ్రీ ఉప్పల రాము
75 మచిలీపట్నం - శ్రీ పేర్ని కృష్ణమూర్తి
76 అవనిగడ్డ - శ్రీ రమేష్ బాబు సింహాద్రి
77 పామర్రు - శ్రీ అనిల్ కుమార్ కైలే
78 పెనమలూరు - శ్రీ జోగి రమేష్
79 విజయవాడ వెస్ట్ - శ్రీ షేక్ అసిఫ్
80 విజయవాడ సెంట్రల్ - శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ 
81 విజయవాడ తూర్పు - శ్రీ దేవినేని అవినాష్
82 మైలవరం - శ్రీ సర్నాల తిరుపతి రావు
83 నందిగామ - శ్రీ మొండితోక జగన్ మోహన రావు
84 జగ్గయ్యపేట - శ్రీ ఉదయభాను సామినేని
85 పెదకూరపాడు - శ్రీ నంబూరు శంకరరావు
86 తాడికొండ - శ్రీమతి మేకతోటి సుచరిత
87 మంగళగిరి - శ్రీమతి కాండ్రు కమల
88 పొన్నూరు - శ్రీ అంబటి మురళి కృష్ణా
89 వేమూరు - శ్రీ వరుకూటి అశోక్ బాబు
90 రేపల్లె - శ్రీ డా.ఈవూరు గణేష్
91 తెనాలి - శ్రీ అన్నాబత్తుని శివ కుమార్
92 బాపట్ల - శ్రీ కోన రఘుపతి
93 ప్రత్తిపాడు - శ్రీ బాలసాని కిరణ్ కుమార్
94 గుంటూరు వెస్ట్ - శ్రీమతి విడదల రజిని
95 గుంటూరు తూర్పు - శ్రీమతి షాక్ నూరి ఫాతిమా
96 చిలకలూరిపేట - శ్రీ కావటి మనోహర్ నాయుడు
97 నరసరావుపేట - శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి
98 సత్తెనపల్లె - శ్రీ అంబటి రాంబాబు
99 వినుకొండ - శ్రీ బొల్లా బ్రహ్మ నాయుడు
100 గురజాల - శ్రీ కాసు మహేష్ రెడ్డి
101 మాచర్ల - శ్రీ రామకృష్ణా రెడ్డి పిన్నెల్లి
102 యర్రగొండపాలెం - శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్
103 దర్శి - శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్
104 పర్చూరు - శ్రీ యడం బాలాజీ 
105 అద్దంకి - శ్రీ పాణెం హనిమిరెడ్డి
106 చీరాల - శ్రీ ఆమంచి కృష్ణా మోహన్
107 సంతనూతలపాడు - శ్రీ మేరుగు నాగార్జున
108 ఒంగోలు - శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి
109 కందుకూరు - శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్
110 కొండపి - శ్రీ ఆదిమూలపు సురేష్
111 మార్కాపురం - శ్రీ కుందూరు నాగార్జున రెడ్డి
112 గిద్దలూరు - శ్రీ అన్నా రాంబాబు
113 కనిగిరి - శ్రీ దద్దాల నారాయణ యాదవ్
114 కావలి - శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
115 ఆత్మకూర్ - శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి
116 కోవూరు - శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
117 నెల్లూరు సిటీ - శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్
118 నెల్లూరు రూరల్ - శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
119 సర్వేపల్లి - శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి 
120 గూడూరు -  శ్రీ మేరిగ మురళి
121 సూళ్లూరుపేట - శ్రీ కిలివేటి సంజీవయ్య
122 వెంకటగిరి - శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
123 ఉదయగిరి - శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి
124 బద్వేల్ - శ్రీమతి దాసరి సుధ
125 రాజంపేట - శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 
126 కడప - శ్రీ ఎస్.బి అంజద్ బాషా
127 రైల్వే కోడూరు - శ్రీ కొరముట్ల శ్రీనివాసులు
128 రాయచోటి - శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి
129 పులివెందుల - శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి
130 కమలాపురం - శ్రీ పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
131 జమ్మలమడుగు -శ్రీ మూలే సుధీర్ రెడ్డి
132 ప్రొద్దుటూరు - శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
133 మైదుకూరు - శ్రీ రఘురామిరెడ్డి సెట్టిపల్లి
134 ఆళ్లగడ్డ - శ్రీ గంగుల బ్రిజేంద్ర రెడ్డి
135 శ్రీశైలం - శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి
136 నందికొట్కూరు - శ్రీ డా. సుధీర్ దారా 
137 కర్నూలు - శ్రీ ఎం డి ఇంతియాజ్ 
138 పాణ్యం - శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి
139 నంద్యాల - శ్రీ శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి
140 బనగానపల్లె - శ్రీ కాటసాని రామి రెడ్డి
141 డోన్ - శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్
142 పత్తికొండ - శ్రీమతి కంగాటి శ్రీదేవి
143 కోడుమూరు - శ్రీ డా. సతీష్
144 ఎమ్మిగనూరు - శ్రీమతి బుట్టా రేణుక
145 మంత్రాలయం - శ్రీ వై బాలనాగి రెడ్డి
146 ఆదోని - శ్రీ వై.సాయి ప్రసాద్ రెడ్డి
147 ఆలూరు - శ్రీ బూసినే విరుపాక్షి
148 రాయదుర్గం - శ్రీ మెట్టు గోవింద రెడ్డి
149 ఉరవకొండ - శ్రీ వై విశ్వేశ్వర రెడ్డి
150 గుంతకల్లు - శ్రీ వై.వెంకటరామ రెడ్డి
151 తాడిపత్రి - శ్రీ కె. పెద్దా రెడ్డి
152 శింగనమల - శ్రీ ఎం వీరాంజనేయులు
153 అనంతపురం అర్బన్ - శ్రీ అనంత వెంకటరామి రెడ్డి
154 కళ్యాణదుర్గం - శ్రీ తలారి రంగయ్య
155 రాప్తాడు - శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
156 మడకశిర - శ్రీ ఈర లక్కప్ప
157 హిందూపురం - శ్రీమతి టి.ఎన్ దీపిక 
158 పెనుకొండ - శ్రీమతి కె. వి. ఉషశ్రీ చరణ్
159 పుట్టపర్తి - శ్రీ దుద్దుకుంటా శ్రీధర్ రెడ్డి
160 ధర్మవరం - శ్రీ కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి
161 కదిరి - శ్రీ మక్బుల్ అహ్మద్
162 తంబళ్లపల్లె - శ్రీ పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి
163 పీలేరు - శ్రీ చింతల రామచంద్రా రెడ్డి
164 మదనపల్లె - శ్రీ నిస్సార్ అహ్మద్
165 పుంగనూరు - శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
166 చంద్రగిరి - శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
167 తిరుపతి - శ్రీ భూమన అభినయ్ రెడ్డి
168 శ్రీకాళహస్తి - శ్రీ బియ్యపు మధుసూధన్ రెడ్డి
169 సత్యవేడు - శ్రీ నూకతోటి రాజేష్
170 నగరి - శ్రీమతి ఆర్.కె రోజా
171 గంగాధర నెల్లూరు - శ్రీ ఎం రెడ్డెప్ప
172 చిత్తూరు - శ్రీ ఎం విజయానంద రెడ్డి
173 పూతలపట్టు - శ్రీ డా. సునీల్ కుమార్
174 పలమనేరు - శ్రీ ఎన్. వెంకటే గౌడ
175 కుప్పం - శ్రీ కే ఆర్ జే భరత్.

Posted

 

Nara Lokesh: మునిగే పడవలోకి ఎక్కే ప్యాసింజర్ల లిస్ట్ విడుదల చేశారు: వైసీపీ అభ్యర్థుల జాబితాపై లోకేశ్ సెటైర్లు 

16-03-2024 Sat 16:26 | Andhra
  • ఈరోజు ఎంపీ, ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసిన వైసీపీ
  • ఇడుపులపాయలో జరిగిన కార్యక్రమంలో జాబితా విడుదల
  • జాబితాపై లోకేశ్ సెటైర్లు
 
Nara Lokesh comments on YSRCP candidates list

రానున్న ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించిన అనంతరం... అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. జాబితాలో పలువురు అభ్యర్థులకు స్థాన చలనం కలిగింది. మరోవైపు వైసీపీ ఎన్నికల జాబితాపై టీడీపీ యువనేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. మునిగిపోతున్న పడవలోకి ఎక్కుతున్న ప్యాసింజర్ల జాబితాను జగన్ విడుదల చేశారని ఎద్దేవా చేశారు. 

 

Posted

Code adu vachindi leka pote shinnayna case… geetanjali case epudo solve chese valla

..

Model Code Of Conduct: దేశవ్యాప్తంగా అమల్లోకి ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’.. ఎన్నికల కోడ్ అంటే ఏమిటి? ఎందుకు? 

16-03-2024 Sat 15:41 | Both States
  • ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే అమల్లోకి కోడ్
  • ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా మార్గదర్శకాల రూపకల్పన
  • నిబంధనలను పాటించని అభ్యర్థులు, పార్టీలపై చర్యలు తీసుకోనున్న ఎన్నికల సంఘం
 
Model Code Of Conduct comes into Effect for Lok Sabha Elections 2024  and why it is for

లోక్‌సభ ఎన్నికలు 2024కు నగారా మోగింది. పార్లమెంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి వచ్చింది. పోటీ చేసే అభ్యర్థులు, పొలిటికల్ పార్టీలు ఎన్నికల సమయంలో ఈసీ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. అభ్యర్థులు, పార్టీల ప్రచారాన్ని నియంత్రించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ నియమ, నిబంధనల జాబితాని ‘‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’’ అంటారు. సజావుగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలను నిర్వహించడమే ఎన్నికల కోడ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం టార్గెట్‌గా ఎన్నికల సంఘం ఈ నిబంధనలు రూపొందిస్తుంది. ఎన్నికల్ షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ను ఎన్నికల సంఘం అమలు చేస్తుంది. ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు కోడ్ అమల్లోనే ఉంటుంది.

నిష్పక్షపాతంగా, సవ్యంగా ఎన్నికలను నిర్వహించాలంటే ఎన్నికల కోడ్‌ను పాటించాల్సి ఉంటుంది. ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ను అతిక్రమించే అభ్యర్థులు, పార్టీలపై చర్యలు తీసుకునే హక్కు ఎన్నికల సంఘానికి ఉంటుంది. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు. ప్రభుత్వాలు ప్రజాకర్షక పథకాలను ప్రకటించే అవకాశం ఉండదు. 

కోడ్ అమల్లోకి వచ్చాక రూల్స్ ఏమిటి?

  • మీడియాలో రాజకీయ పార్టీలు, వ్యక్తులకు అనుకూలంగా, పక్షపాతంగా ప్రచార కథనాలపై నిషేధం ఉంటుంది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించకూడదు.
  • ఓటర్లను ప్రభావితం చేసేందుకు కుల, మతపరమైన వ్యాఖ్యలు చేయకూడదు. పుకార్లు వ్యాప్తి చేయడం నిషేధం. ఓటర్లకు డబ్బులు పంచడం, భయపెట్టడానికి వీల్లేదు.
  • ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక అభ్యర్థులు ఆర్థిక గ్రాంట్లు ప్రకటించడం నిషేధం.
  • ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించకూడదు. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయకూడదు.
  • రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ అధికారులు వాగ్దానాలు చేయకూడదు.
  • ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలలో తాత్కాలిక నియామకాలు చేపట్టకూడదు.
  • ఎన్నికల్లో పోటీ చేసే మంత్రులు లేదా అభ్యర్థులు తమ పరిధిలోని నిధులను మంజూరు చేయకూడదు.
  • ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ వనరులను ఉపయోగించకూడదు. రవాణా, యంత్రాలు, భద్రతా సిబ్బందితో సహా దేనిని ఉపయోగించకూడదు.
  • ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ నాయకుల సమావేశాలకు మునిసిపాలిటీలు బహిరంగ ప్రదేశాల్లో మీటింగ్‌లకు ఉచిత ప్రవేశం కల్పించాలి.
  • ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లు, భవనాలు, ఇతర ప్రభుత్వ వసతులను ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థులు ఎన్నికల్లో తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవడానికి వీలుండదు.
Posted

YSRCP MLA Candidates: వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల.. గుడివాడ నుంచి కొడాలి నాని, నగరి నుంచి రోజా ఖరారు 

16-03-2024 Sat 14:14 | Andhra
  • ఇడుపులపాయ నుంచి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైసీపీ
  • అభ్యర్థుల పేర్లను చదివిన ధర్మాన ప్రసాదరావు
  • 32 మంది అభ్యర్థులను పక్కన పెట్టిన జగన్
 
YSRCP MLA Candidates list

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 175 మంది అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఇడుపులపాయలో జాబితాను విడుదల చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తుది జాబితాలో 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. 

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా:
20240316fr65f559b0b9c92.jpg20240316fr65f559bfd42b7.jpg20240316fr65f559d0a75ec.jpg20240316fr65f559e3a54e0.jpg20240316fr65f559f4d678b.jpg20240316fr65f55a07e6fc5.jpg20240316fr65f55a18bf0ba.jpg20240316fr65f55a329b426.jpg20240316fr65f55a4423fcc.jpg20240316fr65f55a55d91ae.jpg20240316fr65f55a6ade193.jpg20240316fr65f55a7a26593.jpg20240316fr65f55a912b0dc.jpg20240316fr65f55aac9643d.jpg20240316fr65f55abc988ce.jpg20240316fr65f55ad1bfbbc.jpg20240316fr65f55ae159d44.jpg20240316fr65f55af276931.jpg20240316fr65f55b065dc83.jpg20240316fr65f55b1447f05.jpg20240316fr65f55b22b68c5.jpg20240316fr65f55b465c3d5.jpg

Posted

Deni kosAm anna oka committee vesi stream line cheyali ani ycp party  candidates request

 

Andhra Pradesh: క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు మూడు సార్లు తమ వివరాలు బహిర్గతం చేయాలి: ముఖేశ్ కుమార్ మీనా 

16-03-2024 Sat 17:29 | Andhra
  • సార్వత్రిక ఎన్నికలకు నేడు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
  • ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు
  • ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ప్రెస్ మీట్
 
Mukesh Kumar Meena press meet after election schedule announcement

సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రంలో ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. 

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఏపీలో 27,612 ప్రాంతాల్లో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఏపీలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళా సిబ్బందినే నియమిస్తున్నామని ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. 

ఓటరు గుర్తింపు లేని వారు 12 ఐడీ కార్డులను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చని  వివరించారు. ఆధార్ కార్డు, ఉపాధి హామీ పథకం కార్డు, పాస్ బుక్, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్ పోర్టు, పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడీ కార్డు, ఇతర అఫిషియల్ ఐడెంటిడీ కార్డులు చూపించి ఓటేయవచ్చని తెలిపారు. 

ఇక, ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసిన అర్హులందరికీ ఓటరు కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకమైన సదుపాయం తీసుకువచ్చామని, ఎన్నికలకు ఆన్ లైన్ ద్వారా కూడా నామినేషన్ అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. 

అయితే, ఆన్ లైన్ లో నామినేషన్ సమర్పించే అవకాశం ఉండదని, ఓ అభ్యర్థి ఆన్ లైన్ లో నామినేషన్ పత్రాలు నింపిన తర్వాత, వాటిని ప్రింట్ తీసుకుని రిటర్నింగ్ అధికారికి స్వయంగా సమర్పించాల్సి ఉంటుందని ముఖేశ్ కుమార్ మీనా వివరించారు. రూ.25 వేలు సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో ఆన్ లైన్ లో చెల్లించవచ్చని తెలిపారు. 

ఫారం-26 కింద అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందని, అందులో ఎలాంటి మార్పు లేదని అన్నారు. ఆయా అంశాలపై అన్ని రాజకీయ పార్టీలతో సదస్సు నిర్వహించామని వెల్లడించారు. అఫిడవిట్ లో ప్రతి కాలమ్ నింపాల్సిందేనని వివరించామని చెప్పారు. 

ముఖ్యంగా, క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు తమ వివరాలను పోలింగ్ కు ముందు మూడు సార్లు వెల్లడించాల్సి ఉంటుందని మీనా స్పష్టం చేశారు. దినపత్రికలోనూ, టీవీ చానళ్లలోనూ, తమ రాజకీయ పార్టీల వెబ్ సైట్లలోనూ తమ వివరాలను బహిర్గతం చేయాలని వివరించారు. ఇక, 85 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దే ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తున్నామని వెల్లడించారు. 

 

Posted

YSRCP MP List: వైసీపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన... అభ్యర్థుల జాబితా ఇదే 

16-03-2024 Sat 13:28 | Andhra
  • ఇడుపులపాయలో అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వైసీపీ
  • జగన్ సమక్షంలో పేర్లను చదివిన ధర్మాన ప్రసాదరావు
  • విజయవాడ నుంచి కేశినేని నాని
 
YSRCP MP candidates list

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. ఇడుపులపాయలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు. 50 శాతం స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించామని చెప్పారు. 

వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే:
20240316fr65f55061dc56e.jpg20240316fr65f550722d575.jpg

  • శ్రీకాకుళం –  పేరాడ తిలక్‌ – బీసీ కళింగ
  • విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్‌ – బీసీ తూర్పు కాపు
  • విశాఖపట్నం – బొత్స ఝాన్సీ లక్ష్మీ – బీసీ తూర్పు కాపు
  • అరకు –  చెట్టి తనూజ రాణి – ఎస్టీ వాల్మీకి
  • కాకినాడ – చెలమలశెట్టి సునీల్‌ – ఓసీ కాపు
  • అమలాపురం – రాపాక వరప్రసాద్‌ – ఎస్‌సీ మాల
  • రాజమండ్రి – డా. గూడురి శ్రీనివాసులు – బీసీ శెట్టి బలిజ
  • నర్సాపురం – గూడూరి ఉమా బాల – బీసీ  శెట్టి బలిజ
  • ఏలూరు – కారుమూరి సునీల్‌ కుమార్‌ – బీసీ యాదవ
  • మచిలీపట్నం – డా. సింహాద్రి చంద్రశేఖర్‌రావు – ఓసీ కాపు
  • విజయవాడ – కేశినేని శ్రీనివాస (నాని) – ఓసీ కమ్మ
  • గుంటూరు – కిలారి వెంకట రోశయ్య – ఓసీ కాపు
  • నర్సరావుపేట – డా. పి. అనిల్‌ కుమార్‌ యాదవ్‌ – బీసీ  యాదవ
  • బాపట్ల – నందిగాం సురేష్‌ బాబు – ఎస్‌సి మాదిగ
  • ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి – ఓసీ రెడ్డి
  • నెల్లూరు – వేణుంబాక విజయసాయిరెడ్డి – ఓసీ రెడ్డి
  • తిరుపతి – మద్దిల గురుమూర్తి – ఎస్సీ మాల
  • చిత్తూరు – ఎన్‌ రెడ్డప్ప ఎస్సీ – మాల
  • రాజంపేట – పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ రెడ్డి – ఓసీ రెడ్డి
  • కడప – వైఎస్‌ అవినాష్‌రెడ్డి – ఓసీ రెడ్డి
  • కర్నూలు – బివై రామయ్య – బీసీ  బోయ
  • నంద్యాల – పోచ బ్రహ్మానందరెడ్డి – ఓసీ రెడ్డి
  • హిందూపుర్‌ – జోలదరసి శాంత – బీసీ  బోయ
  • అనంతపురం – మాలగుండ్ల శంకర నారాయణ – బీసీ  కురుబ.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...