Jump to content

update on kavita case


Recommended Posts

Posted

G. Kishan Reddy: కూతురును అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడని కేసీఆర్... కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఖండిస్తున్నారు.. మర్మమేమిటో?: కిషన్ రెడ్డి ప్రశ్న 

23-03-2024 Sat 17:10 | Telangana
  • కవిత అరెస్ట్‌కు... తెలంగాణకు, తెలంగాణ సెంటిమెంట్‌కు, తెలంగాణ ప్రజలకు, బీజేపీకి సంబంధం లేదన్న కిషన్ రెడ్డి
  • కవితను దృష్టిలో పెట్టుకొని మద్యం కేసు దర్యాఫ్తు జరగలేదని వెల్లడి
  • మద్యం కేసులో తాను ఆధారాలతో సహా నిరూపిస్తానని కేసీఆర్‌కు సవాల్
  • కేజ్రీవాల్ అరెస్ట్‌ను అందరూ సమర్థిస్తున్నారని వ్యాఖ్య
  • కేసీఆర్ ఆచరిస్తే... కేజ్రీవాల్ అనుసరించారని ఎద్దేవా
 
Kishan Reddy question to KCR over his black day comments

తన కూతురు కవితను అరెస్ట్ చేసినప్పుడు కేసీఆర్ మాట్లాడలేదని... కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసినప్పుడు బ్లాక్ డే అంటున్నారని... దీని వెనుక మర్మం ఏమిటో చెప్పాలని తాను మాజీ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నానని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దీని వెనుక మతలబు ఏమిటో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చెప్పాలన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కవిత అరెస్ట్‌కు... తెలంగాణ రాజకీయాలకు, బీజేపీకి, తెలంగాణకు, తెలంగాణ సెంటిమెంట్‌కు ఏమాత్రం సంబంధం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంతో కలిసి చేసిన అవినీతికి సంబంధించి కవితను అరెస్ట్ చేశారన్నారు.

ఢిల్లీ మద్యం కేసులో కవిత పాత్ర ఉంది కాబట్టే ఈడీ అరెస్ట్ చేసిందన్నారు. కవితను దృష్టిలో పెట్టుకొని మద్యం కేసు దర్యాఫ్తు జరగలేదని వివరణ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలోని అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దర్యాఫ్తు జరిగిందని వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన రోజును చీకటి రోజు అని కేసీఆర్ చెబుతుంటే గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. మద్యం వ్యాపారం ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించాలని ప్రయత్నించారన్నారు.

కేసీఆర్‌కు సవాల్
ముఖ్యమంత్రులు లిక్కర్ స్కాంకు పాల్పడితే బ్లాక్ డే అవుతుందా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణానికి... మా కుటుంబానికి సంబంధం లేదని... కేజ్రీవాల్‌కు, ఆ ప్రభుత్వానికి కూడా ఈ కుంభకోణంతో సంబంధం లేదని మాజీ సీఎం కేసీఆర్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. తాను కేసీఆర్‌కు సవాల్ చేస్తున్నానని... మద్యం వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి పాల్పడింది... వందల కోట్లు చేతులు మారాయి... దీనిని నేను ఆధారాలతో నిరూపిస్తాను... కేసీఆర్ కాదని నిరూపించగలరా? అని వ్యాఖ్యానించారు. అమరవీరుల స్థూపం వద్దకు వస్తావా? ప్రెస్ క్లబ్ వద్దకు వస్తావా? చెప్పాలని సవాల్ చేశారు. అయినా మద్యం అంశంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చించడం తమకు ఇష్టం లేదన్నారు.
మరి కేసీఆర్ వచ్చి కేజ్రీవాల్ తప్పు లేదు... ఆమ్ ఆద్మీ పార్టీ పొరపాటు లేదని చెప్పగలరా? అని నిలదీశారు.

కేజ్రీవాల్ అరెస్ట్‌ను అందరూ సమర్థిస్తున్నారు
బీరు, బ్రాండీ వ్యాపారం చేస్తే... ఆ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడితే... ప్రజాధనం దోపిడీ చేస్తే... అందుకు అరెస్ట్ చేస్తే... అక్రమం ఎలా అవుతుందో చెప్పాలన్నారు. తెలంగాణలో దోచుకున్నట్లు ఢిల్లీలో దోచుకోవాలని భావించారని ఆరోపించారు. బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సానుభూతికోసం ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కానీ సామాన్య ప్రజలు, విజ్ఞులు, మేధావులు అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్టును అందరూ సమర్థిస్తున్నట్లు చెప్పారు.

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందని పలికారని... మద్యం అక్రమాలు చూస్తే అది నిజమే అనిపిస్తోందన్నారు. ఇక్కడ కేసీఆర్ ఆచరిస్తే కేజ్రీవాల్ అనుసరించారని ఎద్దేవా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కవిత చేసిన కుట్రలకు బీజేపీని విమర్శించడం సరికాదన్నారు. ఢిల్లీ మద్యం కేసులో తన కుటుంబ సభ్యులకు భాగస్వామ్యం లేదని కేసీఆర్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఈ కేసులో పలువురు నిందితులు అప్రూవర్‌గా మారినట్లు చెప్పారు. ఢిల్లీలో తీగలాగితే హైదరాబాద్‌లో డొంక కదిలిందన్నారు.

Posted

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో తెరపైకి మరో పేరు... కేసులో కీలకంగా వ్యవహరించిన మేక శరణ్? 

23-03-2024 Sat 15:21 | Telangana
  • కవిత సమీప బంధువు మేక శరణ్ నివాసంలోనూ ఈడీ సోదాలు
  • కవితను అరెస్ట్ చేసిన రోజు ఆమె ఇంట్లోనే ఉన్న మేక శరణ్
  • అతని ఫోన్ సీజ్ చేసిన ఈడీ అధికారులు
 
Meka Sharan name in Delhi liquor case

ఢిల్లీ మద్యం కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమీప బంధువు మేక శరణ్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లుగా ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం కవితను ఆమె ఇంట్లో అరెస్ట్ చేసిన సమయంలో మేక శరణ్ అక్కడే ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఫోన్‌ను కూడా సీజ్ చేశారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్‌లోని కవితకు చెందిన పలువురు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొండాపూర్‌లోని మేక శరణ్, మాదాపూర్‌లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో సోదాలు చేస్తున్నారు.

మేక శరణ్‌ను ఇదివరకే రెండుసార్లు ఈడీ విచారణకు పిలిచింది. కానీ అతను హాజరుకాలేదు. సౌత్ లాబీ లావాదేవీల్లో అతను కీలకపాత్ర పోషించినట్లుగా ఈడీ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ముడుపుల చెల్లింపుల వ్యవహారంలో బంధువుల పాత్రపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. షెల్ కంపెనీల ద్వారా లావాదేవీలు జరిపినట్లుగా ఈడీ గుర్తించింది. ఈరోజు మొత్తం ఏడుగురు ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

Posted

Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్టుపై జ‌ర్మ‌నీ ప్ర‌క‌ట‌న‌.. తీవ్రంగా స్పందించిన భార‌త్‌ 

23-03-2024 Sat 15:15 | National
  • ఇది పూర్తిగా భార‌త అంత‌ర్గ‌త వ్యవ‌హరాల‌లో జోక్యం చేసుకోవ‌డ‌మేన‌న్న కేంద్రం
  • అరెస్టు చేయ‌కుండా కూడా కేజ్రీవాల్‌ను విచారించ‌వ‌చ్చ‌న్న జ‌ర్మ‌నీ
  • దోషిగా తేల‌నంత వ‌ర‌కు నేరం చేయ‌న‌ట్లే భావించాల‌నే సూత్రం కేజ్రీవాల్‌కు కూడా వ‌ర్తిస్తుందని వెల్ల‌డి
  • జ‌ర్మ‌నీ వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌నపై కేంద్ర ప్ర‌భుత్వం ఆగ్ర‌హం
 
India blasts Germanys blatant interference over Arvind Kejriwal arrest

ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ అధినేత అర‌వింద్‌ కేజ్రీవాల్ అరెస్టుపై జ‌ర్మ‌నీ స్పందించిన తీరు ప‌ట్ల‌ భార‌త ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందించింది. ఇది పూర్తిగా భార‌త అంత‌ర్గ‌త వ్యవ‌హరాల‌లో జోక్యం చేసుకోవ‌డ‌మేన‌ని దుయ్య‌బ‌ట్టింది. ఈ మేర‌కు ఢిల్లీలోని జ‌ర్మ‌నీ రాయ‌బారిని పిలిచి ఆ దేశం చేసిన ప్ర‌క‌ట‌న‌పై విదేశీ వ్య‌వ‌హారాల శాఖ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. 

"భార‌త్ ఒక ప్ర‌జాస్వామ్య దేశం. న్యాయ‌వ్య‌వ‌స్థ స్వ‌యంప్ర‌తిప‌త్తి, క‌నీస ప్ర‌జాస్వామ్య సూత్రాలు భార‌త్‌కూ వ‌ర్తిస్తాయి. అంద‌రిలానే నిష్ప‌క్ష‌పాత, న్యాయ‌బ‌ద్ద విచార‌ణ‌కు కేజ్రీవాల్ అర్హుడు. అరెస్టు చేయ‌కుండా కూడా అత‌డిని విచారించ‌వ‌చ్చు. దోషిగా తేల‌నంత వ‌ర‌కు నేరం చేయ‌న‌ట్లే భావించాల‌నే సూత్రం కేజ్రీవాల్‌కు కూడా వ‌ర్తిస్తుంది" అని జ‌ర్మ‌నీ ఢిల్లీ సీఎం అరెస్టుపై వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న ఒక‌టి విడుద‌ల చేసింది. ఇదే ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వ ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది.

ఇదిలాఉంటే.. ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ కేసులో అర‌వింద్ కేజ్రీవాల్‌ను ఈడీ గురువారం రాత్రి (మార్చి 21న‌) అరెస్టు చేసింది. ఆ త‌ర్వాత శుక్ర‌వారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా.. న్యాయ‌స్థానం కేజ్రీవాల్‌కు ఆరు రోజుల క‌స్ట‌డీ విధించింది. ఇక కేజ్రీవాల్ అరెస్టుపై ఆప్ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు దేశంతో పాటు విదేశాల్లోనూ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నెల 26న ప్ర‌ధాని మోదీ ఇంటిని కూడా ముట్ట‌డిస్తామ‌ని ఆప్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష ఇండియా కూట‌మి కూడా కేజ్రీవాల్ అరెస్టును తీవ్రంగా ఖండించింది. ఆయ‌న అరెస్టుపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు కూడా వెల్ల‌డించింది.

Posted

K Kavitha: ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ సోదాలు.. భర్త, బంధువుల ఇళ్లలోనూ కొనసాగుతున్న రైడ్స్ 

23-03-2024 Sat 10:26 | Telangana
  • ఉదయం 6.40 గంటలకు మాదాపూర్‌లో కవిత ఆడపడుచు అఖిల ఇంటికి చేరుకున్న అధికారులు
  •  ఏ-బ్లాక్‌లోని మూడో అంతస్తులో కొనసాగుతున్న తనిఖీలు
  • కవిత ఇచ్చిన సమాచారంతోనే అయి ఉంటుందని సమాచారం
  • నేటితో తీరనున్న కవిత కస్టడీ గడువు
 
ED Raids Homes Linked to MLC Kavithas Relatives

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత భర్త బంధువుల ఇళ్లలో ఈడీ ఈ ఉదయం సోదాలకు దిగింది. కవిత అరెస్ట్ తర్వాత జరుగుతున్న తొలి సోదాలు ఇవే కావడంతో మరోమారు కలకలం రేగింది. ఈ ఉదయం 6.40 గంటలకు మాదాపూర్‌లోని డీఎస్ఆర్ హోమ్స్‌కు చేరుకున్న ఈడీ అధికారులు ఏ-బ్లాక్‌లోని మూడో అంతస్తులో ఉంటున్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు ప్రారంభించారు. 

కవిత అరెస్ట్ తర్వాత జరుగుతున్న రైడ్స్ కావడంతో వీటికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈడీ కస్టడీలో ఉన్న కవిత ఇచ్చిన సమాచారం ఆధారంగానే అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనున్న నేపథ్యంలో మరో వారం రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంది

Posted

K Kavitha: కొడుకు ఆర్యను చూడగానే భావోద్వేగానికి గురైన కవిత 

23-03-2024 Sat 11:49 | Telangana
  • లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న కవిత
  • ప్రతి రోజు గంట సేపు కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతి
  • ఈరోజుతో ముగియనున్న ఈడీ కస్టడీ
 
Kavitha emotional after seeing her son

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె కుమారుడు, ఆర్య, ఇతర కుటుంబ సభ్యులు కలిశారు. కస్టడీలో ఉన్న కవితను ప్రతి రోజు గంట సేపు కుటుంబ సభ్యులు కలిసేందుకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సమయంలో కవితను కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. తన కొడుకు ఆర్యను చూడగానే కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తల్లిని చూడగానే ఆర్య కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడని సమాచారం. కవితను న్యాయవాది మోహిత్ రావు కూడా కలిశారు. కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని, కోర్టులపై విశ్వాసం ఉంచుదామని కవితకు మోహిత్ రావు చెప్పినట్టు తెలుస్తోంది. 

మరోవైపు ఈరోజుతో కవిత ఈడీ కస్టడీ ముగుస్తోంది. ఈ మధ్యాహ్నం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో కవితను ఈడీ అధికారులు ప్రవేశ పెట్టనున్నారు. మరో వారం రోజుల పాటు ఆమెను కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరే అవకాశం ఉంది. కవితను మరోసారి ఈడీ కస్టడీకి ఇస్తారా? లేదా? అనేది సాయంత్రం లోగా తేలిపోనుంది.

Posted

Kavitha High BP: ఎమ్మెల్సీ కవితకు హైబీపీ.. కోర్టులో మరో పిటిషన్ 

23-03-2024 Sat 12:28 | Telangana
  • నేటితో ముగిసిన ఈడీ కస్టడీ
  • మరో మూడు రోజుల కస్టడీ కోరనున్న ఈడీ
  • కొనసాగింపునకు కవిత లాయర్ల అభ్యంతరం
 
MLC Kavitha Suffering From High Blood Pressure says Her Lawyers

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైబీపీతో బాధపడుతున్నారని ఆమెన్ న్యాయవాదులు పేర్కొన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో కవిత ఆరోగ్యంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు ద్వారా ఈడీని కోరారు. దీనిపై కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వివరించారు. ఎమ్మెల్సీ కవిత కస్టడీ గడువు ముగియడంతో ఈడీ ఆమెను మరికాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనుంది.

కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాలంటూ ఈడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉందని సమాచారం. అయితే, కస్టడీ కొనసాగింపును కవిత తరఫు లాయర్లు అడ్డుకోనున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆమె హైబీపీతో బాధపడుతున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. కస్టడీ కొనసాగింపునకు ఈడీ దాఖలు చేయనున్న పిటిషన్ ను కవిత లాయర్లు ఛాలెంజ్ చేయనున్నారని సమాచారం.

Posted

ED Custody: ఢిల్లీ లిక్క‌ర్ కేసులో ఎమ్మెల్సీ క‌వితకు షాక్‌.. ఈడీ క‌స్ట‌డీ 3 రోజులు పొడిగింపు 

23-03-2024 Sat 13:28 | National
  • క‌విత విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేదంటూ ఈడీ ఆరోప‌ణ‌
  • స‌మీర్ మ‌హీంద్ర‌తో క‌లిపి క‌విత‌ను ప్ర‌శ్నించాల‌న్న ఈడీ
  • సౌత్‌గ్రూప్‌కు రూ.100కోట్లు చేరాయ‌న్న ఈడీ త‌ర‌ఫు లాయ‌ర్‌
  • క‌విత కుటుంబ స‌భ్యుల వివ‌రాల‌ను ఇవ్వ‌డం లేద‌న్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌
  • సోదాల్లో క‌విత‌ మేన‌ల్లుడి ఫోన్ స్వాధీనం చేసుకున్న‌ట్లు వెల్ల‌డి
 
MLC Kavitha ED Custody Extended to Three Days

ఢిల్లీ లిక్క‌ర్ కేసులో ఏడు రోజుల ఈడీ క‌స్ట‌డీ ముగియడంతో ఎమ్మెల్సీ క‌విత‌ను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా క‌విత‌ను మ‌రో 5 రోజుల క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని ఈడీ కోరింది. ఇరువైపుల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం క‌విత క‌స్ట‌డీని మూడు రోజులు పొడిగించింది. అంత‌కుముందు త‌మ విచార‌ణ‌కు క‌విత స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఈడీ ఆరోపించింది. స‌మీర్ మ‌హీంద్ర‌తో క‌లిపి క‌విత‌ను ప్ర‌శ్నించాల‌ని తెలిపింది. లిక్క‌ర్ స్కామ్ లో రూ. కోట్ల‌లో కిక్ బ్యాక్‌లు అందాయ‌ని ఈడీ పేర్కొంది. 

సౌత్‌గ్రూప్‌కు రూ.100కోట్లు చేరాయ‌ని ఆరోపించింది. క‌విత ఫోన్ డేటాను తొలిగించిన‌ట్లు త‌మ ద‌ర్యాప్తులో తేలింద‌ని ఈడీ కోర్టుకు తెలియ‌జేసింది. అలాగే ఆమె కుటుంబ స‌భ్యుల వివ‌రాల‌ను ఇవ్వ‌డం లేద‌ని ఈడీ త‌రఫు లాయ‌ర్ అన్నారు. క‌విత మేన‌ల్లుడి వ్యాపారానికి సంబంధించిన వివ‌రాలు అడిగిన‌ట్లు ఈడీ తెలిపింది. ప్ర‌స్తుతం క‌విత మేన‌ల్లుడి ఇంట్లో సోదాలు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొంది. 

క‌విత‌ను ఆమె మొబైల్ ఫోన్‌కు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ నివేదిక‌తో విచారిస్తున్నామ‌ని ఈడీ త‌ర‌ఫు లాయ‌ర్ తెలియ‌జేశారు. సోదాల్లో మేన‌ల్లుడి ఫోన్ స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపింది. మ‌రోవైపు క‌విత త‌న అరెస్టు అక్ర‌మం అని పేర్కొన్నారు. కావాల‌నే త‌న‌ను ఈ కేసులో ఇరికించార‌ని చెప్పారు. కోర్టులో హాజ‌ర‌యిన త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చే క్ర‌మంలో మీడియాతో క‌విత ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Posted

K Kavitha: ఈడీ అధికారులు అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారు: మీడియాతో కవిత 

23-03-2024 Sat 14:10 | Telangana
  • కోర్టులోనికి వెళ్లడానికి ముందు మీడియాతో మాట్లాడిన కవిత
  • తన అరెస్ట్ అక్రమమని వ్యాఖ్య
  • ఈ అరెస్ట్‌పై పోరాడుతానన్న కవిత
  • ఇలాంటి అరెస్ట్‌లపై ఈసీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
 
Kavitha says media asking questions repeatedly

ఈడీ అధికారులు తనను అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఆమెను గత శుక్రవారం అరెస్ట్ చేసింది. శనివారం కోర్టులో హాజరుపరచడంతో వారం రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈరోజుతో ఆమె కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆమెను మరో మూడు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. ఆమె కోర్టులోకి వెళ్లడానికి ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తన అరెస్ట్ అక్రమమని వ్యాఖ్యానించారు. అక్రమ అరెస్ట్‌పై కోర్టులో పోరాడుతానని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి అరెస్ట్‌లు సరికాదన్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ అరెస్ట్‌లపై ఈసీ దృష్టి సారించారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రజలు అన్ని పరిణామాలను గమనిస్తున్నారన్నారు.

Posted

 

K Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడీకి నోటీసులు జారీ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు 

23-03-2024 Sat 15:03 | Telangana
  • రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత
  • విచారణకు స్వీకరించిన న్యాయస్థానం
  • కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు
 
Court accepted kavitha bail petition

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. తనకు బెయిల్ ఇవ్వాలని, ఈడీకి నోటీసులు జారీ చేయాలని ఆమె తరఫున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈపిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం... కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణ జరపనుంది. కవిత తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని కవిత తరఫు న్యాయవాది తెలిపారు. కవితను ఐటీ వివరాలు అడుగుతున్నారని, ఆమె ఈడీ కస్టడీలో ఉంటే ఎలా ఇస్తారని న్యాయవాది ప్రశ్నించారు. 

 

Posted

Looks like bjp is helping gumpu mestri to sustain in power...

For long term 

Posted

@psycopk  How much paid for this campaign 

please can you let me know  i am also looking for second income 

Posted
4 minutes ago, jaathiratnalu2 said:

@psycopk  How much paid for this campaign 

please can you let me know  i am also looking for second income 

Naku kanipinchina latest news veyatam oka campaign and they are paying me.. and i am doing it for my second income antav… nice tappu ledu inta mandi paytm gallani chusaka alanti thought ravatam lo asalu tapu ledu… if you really looking for second income contact our db jaffas like netflix aunty.. anadam.. they are top paytm folks in our db… 

Posted
4 minutes ago, psycopk said:

Naku kanipinchina latest news veyatam oka campaign and they are paying me.. and i am doing it for my second income antav… nice tappu ledu inta mandi paytm gallani chusaka alanti thought ravatam lo asalu tapu ledu… if you really looking for second income contact our db jaffas like netflix aunty.. anadam.. they are top paytm folks in our db… 

They said pay is less bro 

I heard I TDP pays well so reaching out to you , Since you are mod and active TDP follower

Posted
9 minutes ago, jaathiratnalu2 said:

They said pay is less bro 

I heard I TDP pays well so reaching out to you , Since you are mod and active TDP follower

I dont deal with these chillar affairs…

Posted

Arvind Kejriwal: తన అరెస్ట్, కస్టడీ అక్రమం అంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్ 

23-03-2024 Sat 18:20 | Andhra
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్
  • కోర్టులో హాజరుపరిచిన ఈడీ... 7 రోజుల కస్టడీ
  • ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ తరఫు న్యాయవాదుల పిటిషన్
  • పిటిషన్ ను వెంటనే విచారించాలని విజ్ఞప్తి
  • కేజ్రీవాల్ విడుదలకు అర్హమైన వ్యక్తి అని పిటిషన్ లో స్పష్టీకరణ
 
Kejriwal seeks release as his advocates approaches Delhi High Court

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తనను అరెస్ట్ చేయడం, తనకు ఈడీ కస్టడీ విధింపు అక్రమం అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్ పై అత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాలని, తనను విడుదల చేయాలని కేజ్రీవాల్ కోరారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ అభియోగాలపై కేజ్రీవాల్ ను గురువారం నాడు ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ఆయను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం ఏడు రోజుల ఈడీ కస్టడీ విధించింది. 

అయితే, ఇవాళ కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు  ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్ పై ఆదివారం నాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రిమాండ్ ఆర్డర్ ను రద్దు చేయాలని విన్నవించారు. కేజ్రీవాల్ విడుదలకు అర్హమైన వ్యక్తి అని పిటిషన్ లో స్పష్టం చేశారు. 

ఈడీ అరెస్ట్ చేయకముందు కూడా కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ ను అడ్డుకోవాలని కోరారు. కానీ, కేజ్రీవాల్ అరెస్ట్ కు తాము మినహాయింపునివ్వలేమని ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఇప్పుడు, కేజ్రీవాల్ మరోసారి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో, ఈసారి చీఫ్ జస్టిస్ బెంచ్ ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...