jaathiratnalu2 Posted March 23, 2024 Report Posted March 23, 2024 16 minutes ago, psycopk said: I dont deal with these chillar affairs… Oh Are you taking in BIG , Like contracts and other things .. Good for you samara Quote
psycopk Posted March 24, 2024 Author Report Posted March 24, 2024 Arvind Kejriwal: అత్యవసర విచారణ చేపట్టలేం.. ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు నిరాశ 24-03-2024 Sun 07:14 | National హోలీ సందర్భంగా కోర్టుకు 2 రోజుల సెలవులు తిరిగి బుధవారం పున:ప్రారంభం కానున్న ఢిల్లీ హైకోర్టు బుధవారం లిస్టింగ్‌కు రానున్న కేజ్రీవాల్ పిటిషన్ తన అరెస్ట్, ఈడీ కస్టడీకి అప్పగించడాన్ని సవాలు చేసిన కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్ట్‌తో పాటు 7 రోజుల పాటు ఈడీ కస్టడీ విధిస్తూ దిగువ స్థాయి కోర్టు తీసుకున్న నిర్ణయంపై సత్వరమే విచారణ జరిపి ఉపశమనం కల్పించాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. సత్వర విచారణ చేపట్టలేమని తేల్చి చెప్పింది. హోలీ సందర్భంగా కోర్టుకి 2 రోజులు సెలవులు ఉంటాయి. కోర్టు తిరిగి బుధవారం పున:ప్రారంభమవుతుందని, సెలవుల తర్వాత మొదటి పని దినమైన బుధవారం ఈ పిటిషన్ లిస్టింగ్‌కు వస్తుందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఈ విషయాన్ని హైకోర్టు రిజిస్ట్రీ కూడా ధృవీకరించింది. కాగా తన అరెస్ట్, ఈడీ కస్టడీ విధింపు చట్టవిరుద్ధమని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిమాండ్ ఆర్డర్ చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. మరుసటి రోజు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించడానికి కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. దీంతో మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో తన అరెస్ట్, కస్టడీని వ్యతిరేకిస్తూ శనివారం కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఆప్ నిరసనలు తమ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఖండిస్తూ ఢిల్లీ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆప్ నిర్ణయించింది. సీఎం కేజ్రీవాల్‌ను ఆయన భార్య సునీత శనివారం ఈడీ ప్రధాన కార్యాలయంలో కలిశారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె కేజ్రీవాల్ అరెస్ట్ బీజేపీ కుట్ర అని ఆరోపించారు. ఇక ఆప్ పార్టీకి చెందిన నేత ఒకరు మాట్లాడుతూ.. ఆదివారం ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆప్ నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగ పరుస్తోందని, ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురిచేయడానికి నిరసనగా కొవ్వొత్తులతో నిరసన చేపట్టనున్నామని తెలిపారు. దిష్టిబొమ్మల దహనం కూడా ఉంటుందని ఆప్ నేత ఒకరు ప్రకటించారు. Quote
psycopk Posted March 25, 2024 Author Report Posted March 25, 2024 Aurobindo Pharma: ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్రూవర్ నుంచి బీజేపీకి అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్స్ నిధులు 25-03-2024 Mon 06:48 | National ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌గా అరబిందో ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి రూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన సంస్థ ఈ నిధుల్లో బీజేపీ వాటా 66 శాతం, బీఆర్ఎస్కు 29, మిగిలినది టీడీపీకి ఈసీ విడుదల చేసిన తాజా డాటాలో వెల్లడి ఢిల్కీ లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్ అరబిందో ఫార్మా కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్స్‌లో అత్యధిక వాటా బీజేపీకి అందినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌కు సంబంధించి 2022 నవంబర్‌లో అరబిందో ఫార్మా అధిపతి శరత్ చంద్రా రెడ్డి అరెస్టైన విషయం తెలిసిందే. ఆ మరుసటి ఏడాది ఆయన అప్రూవర్‌గా మారారు. ఇక ఈసీ విడుదల చేసిన ఎన్నికల బాండ్స్ వివరాల ప్రకారం, 2021 ఏప్రిల్ నుంచి 2023 నవంబర్ మధ్య అరబిందో ఫార్మా రూ.52 కోట్ల విలువైన ఎన్నికల బాండ్స్ కొనుగోలు చేసింది. ఇందులో 66 శాతం నిధులు బీజేపీకి అందగా 29 శాతం బీఆర్ఎస్కు, మిగితా మొత్తం టీడీపీకి చేరాయి. అంతేకాకుండా,2022లో శరత్ చంద్రారెడ్డి అరెస్టైన ఐదు రోజుల తరువాత కంపెనీ రూ.5 కోట్ల విలువైడన బాండ్స్ కొనుగులు చేసింది. ఈ బాండ్స్‌ను బీజేపీనే రిడీమ్ చేసుకున్నట్టు ఈసీ డాటాలో తేలింది. కాగా, శనివారం నాటి మీడియా సమావేశంలో ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి శరత్ చంద్రా రెడ్డి పేరును ప్రస్తావించారు. ఈడీ చర్యల వెనక బీజేపీ హస్తం ఉందని పరోక్ష ఆరోపణలు చేశారు. ‘కేజ్రీవాల్ కేసులో ఈడీ పేర్కొన్న నిధులు వాస్తవానికి ఎన్నికల బాండ్స్ రూపంలో బీజేపీకి చేరాయని పేర్కొంది. దేశంలో అతిపెద్ద ఫార్మా కంపెనీల్లో అరబిందో ఒకటి. గతేడాది సంస్థ రూ.23 వేల కోట్ల పైచిలుకు ఆదాయం ఆర్జించింది. మొత్తం 150 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ ఆదాయంలో అధికశాతం అంతర్జాతీయ వెంచర్స్ ద్వారానే సమకూరుతోంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ పేర్కొన్న సౌత్ గ్రూప్‌లో అరబిందో ఫార్మా పేరు కూడా ఉంది. Quote
psycopk Posted March 25, 2024 Author Report Posted March 25, 2024 Arvind Kejriwal: ఆ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు.. ఈడీ విచారణలో సీఎం కేజ్రీవాల్! 25-03-2024 Mon 07:43 | National లిక్కర్ పాలసీ రూపొందించిన సమయంలో వాడిన ఫోన్ ఎక్కడని ప్రశ్నించిన ఈడీ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదని కేజ్రీవాల్ సమాధానం ఇచ్చినట్టుగా పేర్కొంటున్న కథనాలు ఆదివారం దాదాపు 4 గంటలపాటు కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తమ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మద్యం పాలసీ రూపొందించిన సమయంలో ఉపయోగించిన ఫోన్ గురించి ప్రశ్నించగా తెలియదని సీఎం కేజ్రీవాల్ సమాధానమిచ్చినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఆదివారం విచారణలో భాగంగా ప్రశ్నించగా.. ప్రస్తుతం ఆ ఫోన్ ఎక్కడ ఉందో తనకు తెలియదని కేజ్రీవాల్ చెప్పినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. కాగా ఈ ఫోన్‌ను ‘మిస్సింగ్ మొబైల్’గా ఈడీ అధికారులు పేర్కొన్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ఆదివారం విచారించారు. దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న సమీర్ మహేంద్రు వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. ఇక మంగళవారం మనీశ్ సిసోడియా కార్యదర్శిగా ఉన్న సీ అరవింద్ ఎదుట కేజ్రీవాల్‌ను ప్రశ్నించే అవకాశం ఉందని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. కాగా ఈడీ కస్టడీ నుంచి సీఎం కేజ్రీవాల్ ఆదివారం తొలి ఆదేశాలను జారీ చేశారు. ఢిల్లీ నగరంలోని కొన్ని ప్రాంతాలలో తాగునీరు, మురుగునీటి సమస్యలను పరిష్కరించాలని మంత్రి అతిషి, అధికారులను ఆయన ఆదేశించారు. వేసవికాలం రావడంతో నీటి సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేయాలని, కొరత ఉన్న ప్రాంతాల్లో అవసరమైన మేరకు నీటి ట్యాంకర్లను సిద్ధం చేయాలని ఆదేశించారని తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి అతిషి మీడియాకు వెల్లడించారు. కేజ్రీవాల్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రజల పట్ల ఆయన స్పందిస్తున్న తీరు తనకు కన్నీళ్లను తెప్పించిందని ఆమె అన్నారు. Quote
allbakara Posted March 25, 2024 Report Posted March 25, 2024 Crazywaal ki 17A varthinchali ga thavika ni enni days vestharu lopala, ka cha ra em doing Quote
psycopk Posted March 26, 2024 Author Report Posted March 26, 2024 K Kavitha: కవితకు మళ్లీ కస్టడీనా? .. బెయిలా? .. తీవ్ర ఉత్కంఠ! 26-03-2024 Tue 09:32 | Telangana నిన్నటితో ముగిసిన కవిత ఈడీ కస్టడీ ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ అధికారులు కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నెల 15న కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ మరుసటి రోజు ఆమెను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గత శనివారం ఆమెను మళ్లీ కోర్టులో ప్రవేశ పెట్టిన ఈడీ అధికారులు కస్టడీని పొడిగించాలని కోరారు. దీంతో, ఆమె కస్టడీని కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. ఈ క్రమంలో మొత్తం 10 రోజుల పాటు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. కవిత కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో, ఈ ఉదయం 11 గంటల సమయంలో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. కవితను మరికొన్ని రోజుల పాటు కస్టడీకి ఈడీ కోరే అవకాశం ఉంది. మరోవైపు, కవిత బెయిల్ పిటిషన్ పై కూడా కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు ఆమెను మళ్లీ ఈడీ కస్టడీకి ఇస్తుందా? లేక జ్యుడీషియల్ కస్టడీ విధిస్తుందా? లేక బెయిల్ మంజూరు చేస్తుందా? అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, ఈడీ కస్టడీలో ఉన్న కవితను నిన్న రాత్రి విచారణ ముగిసిన అనంతరం.. ఆమె భర్త అనిల్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పీఏ శరత్, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. దాదాపు గంట సేపు ఆమెతో వీరు మాట్లాడారు. కవిత యోగక్షేమాలను తెలుసుకున్న భర్త అనిల్... ఆమెకు ధైర్యం చెప్పినట్టు సమాచారం. Quote
psycopk Posted March 26, 2024 Author Report Posted March 26, 2024 Arvind Kejriwal: ఢిల్లీ సీఎం పగ్గాలు కేజ్రీవాల్ భార్యకేనా?.. బీహార్ ఫార్ములా వర్కవుట్ అవుతుందా? 26-03-2024 Tue 09:49 | National జైలు నుంచి కేజ్రీవాల్ పాలన సాధ్యం కాకపోవచ్చంటున్న నిపుణులు దోషిగా తేలి అనర్హత వేటు పడేవరకు పాలించవచ్చంటున్న మరికొందరు సుదీర్ఘకాలం జైలులో ఉండాల్సి వస్తే పగ్గాలు మరొకరు చేపట్టక తప్పని పరిస్థితి కొత్త ముఖ్యమంత్రి వేటలో ఆప్ నేతలు మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన ఆదేశాలు జారీ చేస్తుండడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయబోరని, ఆయన ఎక్కడుంటే అక్కడి నుంచే పాలన సాగిస్తారని పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. అయినప్పటికీ కొత్త ముఖ్యమంత్రి కోసం పార్టీ అంతర్గతంగా వెతుకుతులాడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ పేరు తెరపైకి వచ్చింది. అలాగే, కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి అతిషి సహా పలువురు సీనియర్లు కూడా సీఎం రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నిపుణుల తలోమాట మరోవైపు, జైలు నుంచే పాలన సాగించాలన్న కేజ్రీవాల్ ఆశలు నెరవేరకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం జైలులో ఉన్న వ్యక్తి వారానికి రెండుసార్లు మాత్రమే ఇతరులతో సమావేశమయ్యే వీలుంది. దీనినిబట్టి చూస్తే రోజువారీ పాలన సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. అయితే, కేజ్రీవాల్ కస్టడీని ఈడీ గృహ నిర్బంధం కింద మార్చితే మాత్రం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఇంకొందరు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. కేజ్రీవాల్ జైలు నుంచి పాలించేందుకు అడ్డంకులు ఉండబోవని తేల్చి చెబుతున్నారు. కేసులో దోషిగా తేలితేనే ఆయనపై అనర్హత వేటు పడుతుందని, కాబట్టి అంతవరకు ఆయన ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అంటున్నారు. ఈ సందర్భంగా 1951 ప్రజాప్రతినిధ్య చట్టంలో అనర్హత నిబంధనలను గుర్తు చేస్తున్నారు. సునీత కూడా మాజీ ఐఆర్ఎస్ అధికారే తాను జైలులో ఉన్నా, బయట ఉన్నా తన జీవితం ప్రజలకే అంకితమంటూ కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఆయన భార్య సునీత చదివి వినిపించడం, అది కూడా కేజ్రీవాల్ సీఎంగా నిత్యం కూర్చునే కుర్చీలోనే కూర్చుని ఆ సందేశాన్ని చదవడంతో తదుపరి సీఎం ఆమేనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సునీత కూడా మాజీ ఐఆర్ఎస్ అధికారే. కేజ్రీవాల్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినా సునీత మాత్రం ఉద్యోగంలోనే కొనసాగారు. 2016లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. అప్పట్లో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలు ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయితే, ఆయన భార్య రబ్రీదేవి ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్నారు. ఇప్పుడిదే ఫార్మాలాను ఆప్ అనుసరించబోతున్నదన్న చర్చ జరుగుతోంది. రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్, ఆతిషి పేర్లు కూడా ఇంకోవైపు, కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పేరు కూడా వినిపిస్తోంది. వీరితోపాటు మంత్రులు ఆతిషి, సౌరభ్ భరద్వాజ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ఈ నెల 28 వరకు ఉంది. ఆ తర్వాత ఆయనకు విముక్తి లభిస్తే సరే, లేదంటే మనీశ్ సిసోడియాలా సుదీర్ఘకాలం జైలులో ఉండాల్సి వస్తే మాత్రం సీఎం పగ్గాల మార్పు తప్పకపోవచ్చు. Quote
Android_Halwa Posted March 26, 2024 Report Posted March 26, 2024 On 3/24/2024 at 6:21 PM, psycopk said: ఈ నిధుల్లో బీజేపీ వాటా 66 శాతం, బీఆర్ఎస్కు 29, మిగిలినది టీడీపీకి BJP, TRS ki ichinaru ante makes sense but why TDP ? Liquor scam la Maa Babu gariki kuda emana scheme vunda ? Delhi l chakram tipputa antadu, idena endi a chakram ? Pakkaki jarugu ehe ante kuda legs pattukuni mari pothu petukunadu BJP tho, Kompateesi liquor scam la name bayataki rakunda vundadanike na endi ? Quote
jalsa01 Posted March 26, 2024 Report Posted March 26, 2024 22 hours ago, allbakara said: Crazywaal ki 17A varthinchali ga thavika ni enni days vestharu lopala, ka cha ra em doing 9 tyms icharu come let's discuss ani.. no am busy ani reject chesadu ika labham ledanukoni musesaru Quote
Android_Halwa Posted March 26, 2024 Report Posted March 26, 2024 Iyala Maa akka ki bail ostada leka Tihar oh sudali.. Papam maa akka, koduku ki exams vunayi anduke interim bail kavali ani court ki poindi… Enni kastalo maa akka ki… Quote
Spartan Posted March 26, 2024 Report Posted March 26, 2024 7 minutes ago, Android_Halwa said: Tihar… Apr 9th varaku ED custody Quote
psycopk Posted March 26, 2024 Author Report Posted March 26, 2024 K Kavitha: కవితకు రిమాండ్ విధించిన కోర్టు.. తీహార్ జైలుకు తరలించాలని ఆదేశం 26-03-2024 Tue 13:11 | Telangana బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన రౌస్ అవెన్యూ కోర్టు కవితకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ షాక్ తగిలింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఈ నాటి విచారణ సందర్భంగా ఆమె పిటిషన్ పై తీర్పును కాసేపు రిజర్వ్ లో ఉంచిన కోర్టు... కాసేపటి క్రితం తీర్పును వెలువరించింది. ఆమెకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది. ఆమెను తీహార్ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది. కాసేపట్లో కవితను తీహార్ జైలుకు పోలీసులు తరలించనున్నారు. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు షాక్ కు గురయ్యారు. మరోవైపు, కవిత మధ్యనతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న పూర్తి విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, తనకు మధ్యంత బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు. అయితే, ఆమె విన్నపాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇంకోవైపు, కవితను మరో 15 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరినప్పటికీ... ఆమెకు కోర్టు రిమాండ్ విధించడం గమనార్హం. రిమాండ్ లో ఉన్న కవితను ఈడీ తమ కస్టడీకి కోరే అవకాశం ఉంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.