psycopk Posted March 26, 2024 Author Report Posted March 26, 2024 KCR Family: పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి ఎన్నికలకు దూరంగా ఉన్న కేసీఆర్ కుటుంబం! 26-03-2024 Tue 11:14 | Telangana 23 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో బరిలోకి దిగిన కేసీఆర్ ఫ్యామిలీ ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగని కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం పూర్తిగా దూరంగా ఉంది. 23 ఏళ్ల క్రితం కొందరు నేతలతో కలిసి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికలో కేసీఆర్ కుటుంబం పోటీ చేస్తూనే ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితల్లో ఎవరో ఒకరు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, ఈ సారి మాత్రం వారి కుటుంబం నుంచి ఒక్కరు కూడా పోటీ చేయడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో కేటీఆర్ లేదా హరీశ్ రావు పోటీ చేయవచ్చనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. కానీ, వీరిద్దరిలో ఎవరూ బరిలోకి దిగలేదు. లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. Quote
psycopk Posted March 26, 2024 Author Report Posted March 26, 2024 Arvind Kejriwal: ఈడీ కస్టడీ నుంచి సీఎంగా రెండోసారి ఆదేశాలు జారీ చేసిన కేజ్రీవాల్ 26-03-2024 Tue 10:51 | National ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఇటీవలే నీటి సమస్య గురించి తొలి ఉత్తర్వులు ఇచ్చిన కేజ్రీ తాజాగా ఉచిత ఔషధాల గురించి మరోసారి ఆదేశాలు జారీ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్... ఈడీ కార్యాలయం నుంచే ముఖ్యమంత్రిగా మరోసారి ఆదేశాలు జారీ చేశారు. మొహల్లా క్లినిక్ లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం కేజ్రీవాల్ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. మరోవైపు ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన సాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. నీటి సమస్య గురించి సహచర మంత్రి ఆతిశీకి ఆయన నోట్ ద్వారా ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని ఈడీ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈడీ ప్రధాన కార్యాలయంలో కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ కు తాము కంప్యూటర్ లేదా పేపర్ ను సమకూర్చలేదని ఈడీ తెలిపింది. అయినా, ఆయన ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయనే దానిపై దృష్టి సారించింది. ఇదే అంశంపై ఆయనను ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఈ వివాదం సద్దుమణగక ముందే కేజ్రీవాల్ నుంచి రెండో సారి ఆదేశాలు రావడం ఆసక్తికరంగా మారింది. Quote
psycopk Posted March 26, 2024 Author Report Posted March 26, 2024 K Kavitha: ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు: రౌస్ అవెన్యూ కోర్టులో కవిత సంచలన వ్యాఖ్యలు 26-03-2024 Tue 12:16 | Telangana కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానన్న కవిత ఇది మనీ లాండరింగ్ కేసు కాదని వ్యాఖ్య తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని వెల్లడి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ కేసులో నిందితురాలిగా ఉండటంతో ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మరోవైపు కవిత ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో, ఆమెను ఈడీ అధికారులు కాసేపటి క్రితం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. కవితను మరో 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు. కేసు విచారణ పురోగతిలో ఉందని... పలువురు నిందితులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. మరోవైపు, కోర్టు హాల్లోకి వెళ్తున్న సందర్భంగా అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడుతూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చని... కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానని చెప్పారు. తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. ఈ కేసు మనీ లాండరింగ్ కేసు కాదని... పొలిటికల్ లాండరింగ్ కేసు అని విమర్శించారు. ఈ కేసులో ఒక నిందితుడు బీజేపీలో చేరారని, మరో నిందితుడు బీజేపీ టికెట్ ఆశిస్తున్నారని చెప్పారు. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రూ. 50 కోట్లు ఇచ్చారని తెలిపారు. ఇదొక తప్పుడు కేసు అని... తాను క్లీన్ గా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. Quote
psycopk Posted March 26, 2024 Author Report Posted March 26, 2024 K Kavitha: నా కుమారుడికి పరీక్షలు ఉన్నాయి.. బెయిల్ ఇవ్వండి: కవిత పిటిషన్ 26-03-2024 Tue 12:38 | Telangana రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టిన ఈడీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత తీర్పు రిజర్వ్ లో ఉంచిన కోర్టు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ప్రవేశపెట్టింది. ఆమె కస్టడీని పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. మరోవైపు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న కవిత పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని... తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో కవిత కోరారు. ఈ పిటిషన్ పై తీర్పును కోర్టు రిజర్వ్ లో ఉంచింది. Quote
psycopk Posted March 26, 2024 Author Report Posted March 26, 2024 5 hours ago, Android_Halwa said: BJP, TRS ki ichinaru ante makes sense but why TDP ? Liquor scam la Maa Babu gariki kuda emana scheme vunda ? Delhi l chakram tipputa antadu, idena endi a chakram ? Pakkaki jarugu ehe ante kuda legs pattukuni mari pothu petukunadu BJP tho, Kompateesi liquor scam la name bayataki rakunda vundadanike na endi ? Jagan anna rajakeyam ardam kala inka..: Telugu states lo main parties and center ki money iste manam safe anukoni untadu Quote
psycopk Posted March 26, 2024 Author Report Posted March 26, 2024 KTR: కవితను అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ ప్రచారం చేసింది... ఇప్పుడు ఇంటికే వచ్చి ఈడీ తీసుకెళ్లింది: కేటీఆర్ 26-03-2024 Tue 14:44 | Telangana బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే కాబట్టి ఈడీ కవితను అరెస్ట్ చేయలేదని అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నారన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రచారాన్ని హైదరాబాద్ ప్రజలు మాత్రం నమ్మలేదని వ్యాఖ్య మోదీని రాహుల్ గాంధీ చౌకీదార్ అంటే... రేవంత్ రెడ్డి బడే భాయ్ అంటున్నారని విమర్శ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే కాబట్టి ఈడీ కవితను అరెస్ట్ చేయలేదని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేసిందని, కానీ ఇప్పుడు ఈడీ నేరుగా ఇంటికి వచ్చి కవితను తీసుకువెళ్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మన పార్టీ బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్ బాగా ప్రచారం చేసిందని గుర్తు చేశారు. అందుకే కవితను అరెస్ట్ చేయలేదని కూడా విమర్శలు చేసిందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారాన్ని హైదరాబాద్ ప్రజలు మాత్రం నమ్మలేదన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలన్నింటినీ అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు. ప్రధాని మోదీని రాహుల్ గాంధీ ఏమో చౌకీదార్ అంటుంటే... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేమో బడే భాయ్ అంటున్నారని విమర్శించారు. Quote
psycopk Posted March 26, 2024 Author Report Posted March 26, 2024 Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్ ద్వారానే నాడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు: రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు 26-03-2024 Tue 16:39 | Telangana 2014 నుంచే ఫోన్ ట్యాపింగ్‌లు జరిగినట్లుగా అర్థమవుతోందని వ్యాఖ్య టెలిఫోన్ల ట్యాపింగ్ మీద చిత్తశుద్ధితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి ఈ వ్యవహారంలో కేటీఆర్, హరీశ్ రావు, అధికారులను ముద్దాయిలుగా చేర్చాలని డిమాండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అరెస్ట్ చేశారని బీజేపీ మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. దీనిని బట్టి 2014 నుంచే ఫోన్ ట్యాపింగ్‌లు జరిగినట్లుగా అర్థమవుతోందన్నారు. ఆయన మంగళవారం మీడియాతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడుతూ... టెలిఫోన్ల ట్యాపింగ్ మీద చిత్తశుద్ధితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు డీజీపీ, ఎస్ఐబీ చీఫ్ ఎవరున్నారో కూడా చూడాలన్నారు. ఈ వ్యవహారంలో అధికారులను కూడా క్షమించకూడదని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి ముద్దాయిగా కేటీఆర్, రెండో ముద్దాయిగా హరీశ్ రావు, మూడో ముద్దాయిగా సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని చేర్చాలని డిమాండ్ చేశారు. అసలు నిందితులను ముద్దాయిలుగా చేర్చకపోతే కేసు పూర్తి కాదన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికీ లేదన్నారు. గత డీజీపీ పీఏ శ్రీనాథ్ రెడ్డి అధికారిక ఖర్చుతో అమెరికా వెళ్లారని వెల్లడించారు. ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదని... ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినట్లు చెప్పారు. Quote
Android_Halwa Posted March 26, 2024 Report Posted March 26, 2024 3 hours ago, psycopk said: Jagan anna rajakeyam ardam kala inka..: Telugu states lo main parties and center ki money iste manam safe anukoni untadu As far as I know, Sendranna’s chanakyam supersedes everything…. Quote
psycopk Posted March 26, 2024 Author Report Posted March 26, 2024 https://www.instagram.com/reel/C4-i690LY4C/?igsh=N2RtanEyZTU3bDc0 Quote
psycopk Posted March 26, 2024 Author Report Posted March 26, 2024 K Kavitha: తీహార్ జైల్లో కవితకు వెసులుబాటు కల్పిస్తూ కోర్టు ఆదేశాలు 26-03-2024 Tue 19:24 | Telangana ఈ మేరకు తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు న్యాయస్థానం ఆదేశాలు కవితకు ఇంటి భోజనం తెచ్చుకోవడానికి కోర్టు అనుమతి మంచం, పరుపు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలను స్వయంగా ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. కవిత విజ్ఞప్తి మేరకు ఈ వెసులుబాట్లు ఇచ్చింది. ఈ మేరకు తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కవితకు ఇంటి భోజనం తెచ్చుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే జైల్లో పడుకోవడానికి మంచం, పరుపు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలను స్వయంగా ఏర్పాటు చేసుకోవడానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. కవితకు న్యాయస్థానం ఈరోజు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. Quote
psycopk Posted March 26, 2024 Author Report Posted March 26, 2024 K Kavitha: వ్యానులో కవితను తీహార్ జైలుకు తరలించిన పోలీసులు 26-03-2024 Tue 17:58 | Telangana కవితకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు ఏప్రిల్ 9వ తేదీ వరకు జైల్లోనే పది రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న కవిత ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు. ఈడీ అధికారులు మంగళవారం ఆమెను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది. దీంతో ఆమెను మధ్యాహ్నం జైలు వ్యాన్‌లో తీహార్ జైలుకు తరలించారు. ఆమె ఏప్రిల్ 9వ తేదీ వరకు జైల్లో ఉండనున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచవలసి ఉంటుంది. కవితను ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో పన్నెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన మరుసటి రోజు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి... పది రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరింది. న్యాయస్థానం ఆమెను తొలుత 7 రోజులు... ఆ తర్వాత 3 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ రోజు తిరిగి న్యాయస్థానంలో ప్రవేశపెట్టడంతో ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. Quote
psycopk Posted March 26, 2024 Author Report Posted March 26, 2024 KTR: రేవంత్ రెడ్డీ, ఇక్కడ భయపడేవాళ్లు లేరు... వెంట్రుక కూడా పీకలేవ్: కేటీఆర్ తీవ్ర ఆగ్రహం 26-03-2024 Tue 17:35 | Telangana కిషన్ రెడ్డి కిస్మత్ బాగుండి కేంద్రమంత్రి అయ్యారని ఎద్దేవా కుర్కురేలు పంచడం, లిఫ్ట్‌లు ప్రారంభించడం తప్ప కిషన్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శ లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమని వ్యాఖ్య "రేవంత్ రెడ్డీ, ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరు... వెంట్రుక కూడా పీకలేవ్" అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సికింద్రాబాద్ లోక్ సభ పరిధి ముఖ్య నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... ఈ అయిదేళ్ల కాలంలో కిషన్ రెడ్డి ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదని... కిస్మత్ బాగుండి కేంద్రమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి కాలేరు వెంకటేశ్‌ను ప్రజలు గెలిపించారన్నారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచి.. కిస్మత్ బాగుండి కేంద్రమంత్రి అయ్యారన్నారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి చేసిన గొప్ప పనులు మూడంటే మూడు చేశారని విమర్శించారు. కరోనా వస్తే చాలామంది అన్నదానాలు చేశారని, అంబులెన్స్ లు ఇచ్చారనీ, కిషన్ రెడ్డి మాత్రం కుర్కురేలు పంచారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే, కిషన్ రెడ్డి సీతాఫల్మండి రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్‌లు ప్రారంభించారని, నాంపల్లిలో సింటెక్స్ ట్యాంకులు ప్రారంభించారని ఎద్దేవా చేశారు. మూసీకి వరద వస్తే కిషన్ రెడ్డి రూపాయి తేలేదని విమర్శించారు. కనీసం అంబర్‌పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తి కాలేదన్నారు. రేవంత్ రెడ్డి ఇటీవల బైరామల్‌గూడలో ప్రారంభించిన ఫ్లైఓవర్ మనం కట్టించిందే అని చెప్పారు. కిషన్ రెడ్డికి ఓటేయాలని ఎవరైనా చెబితే అంబర్‌పేట ఫ్లైఓవర్ చూసి రమ్మనాలని సూచించారు. కిషన్ రెడ్డి ఇష్టంవచ్చినట్లు నోరు పారేసుకోవద్దని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఏవైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ పదేళ్లు దేశానికి మోదీ ఏం చేశారని చెప్పడానికి కిషన్ రెడ్డి వద్ద ఏమీ లేదన్నారు. బీజేపీలోకి జంప్ అవడం ఖాయం.. రేవంత్ రెడ్డీ, ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరు.. వెంట్రుక కూడా పీకలేవని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన ముఠాతో బీజేపీలోకి జంప్ అవడం ఖాయమని... ఇది రాసిపెట్టుకోవచ్చునని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 40 లోక్ సభ స్థానాలు దాటే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. తాను మాట్లాడే ప్రతి మాటకు రేవంత్ రెడ్డి స్పందిస్తుంటాడని... కానీ బీజేపీలోకి వెళతావనే తన ఆరోపణకు మాత్రం స్పందించడం లేదన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని విమర్శించారు. రైతుబంధు ఇవ్వడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ లీక్‌లు ఇస్తున్నాడు... ఏదైనా జరిగితే విచారణ చెయ్... తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకో... ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికలకు డబ్బుల కోసం రైస్ మిల్లర్లను, బిల్డర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అందరినీ బెదిరిస్తూ ఢిల్లీకి రూ.2,500 కోట్లు జమ చేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. Quote
psycopk Posted March 28, 2024 Author Report Posted March 28, 2024 K Kavitha: తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత మొదటి రోజు ఏం తిన్నారంటే..! 28-03-2024 Thu 13:42 | National మంగళవారం రాత్రి అన్నం, పప్పుతో భోజనం బుధవారం ఉదయం టీ, స్నాక్స్ తీసుకున్న కవిత జైలులో కవిత తొలిరోజు పుస్తక పఠనంతో పాటు టీవీ చూశారన్న అధికారులు నిబంధనల ప్రకారమే ఆమెకు వస్తువులను అందజేస్తామని జైలు అధికారుల వివరణ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను అధికారులు తీహార్ జైలుకు తరలించారు. వచ్చే నెల 9వ తేదీ వరకు ఆమె తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఇక కవిత జైలుకు వెళ్లి ఒకరోజు గడిచింది. తీహార్ జైలు అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. జైలులోని 6వ నంబర్ సెల్లో మరో ఇద్దరు మహిళా ఖైదీలతో కలిసి కవిత ఉంటున్నారు. మంగళవారం రాత్రి అన్నం, పప్పుతో ఆమె భోజనం చేశారు. తనతో పాటు జైలులో ఉన్న మరో ఇద్దరు మహిళా ఖైదీలకు కూడా ఆమె ఆహారం వడ్డించారు. అలాగే బుధవారం ఉదయం టీ, స్నాక్స్ తీసుకున్నారు. జైలులో తొలిరోజు పుస్తక పఠనంతో పాటు టీవీ చూశారని సమాచారం. కాగా, టీ, ఆహారం, టీవీ చూసే సమయాలు ఇతర ఖైదీల మాదిరిగానే కవితకూ ఉంటాయని జైలు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కవిత ప్రత్యేకంగా నిర్దిష్ట వసతులు ఏవీ డిమాండ్ చేయలేదని కూడా జైలు వర్గాలు పేర్కొన్నాయి. నిబంధనల ప్రకారమే ఆమెకు వస్తువులను అందజేస్తామని అధికారులు వివరించారు. అయితే, జైలులో ఇంటి భోజనంతో పాటు నిద్రపోవడానికి మంచం, పరుపులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వీటితోపాటు పెన్ను, పేపర్లు, మందులు తీసుకెళ్లేందుకు కూడా న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఇక కస్టడీ సమయంలో కవితకు చేసిన అన్ని వైద్యపరీక్షల తాలూకు రికార్డులను ఆమె తరపు న్యాయవాదులకు అందజేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ని జడ్జి ఆదేశించారు. అలాగే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1వ తేదీ లోగా సమాధానం ఇవ్వాలని కూడా ఆదేశించడం జరిగింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.