Jump to content

update on kavita case


Recommended Posts

Posted

K Kavitha: ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సీబీఐ 

11-04-2024 Thu 14:28 | Telangana
  • మద్యం కేసులో విచారించేందుకు కోర్టు అనుమతి తీసుకున్న సీబీఐ
  • జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న కవిత
  • జైల్లో కవితను విచారించనున్న సీబీఐ
 
Kavitha in CBI custody

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ నేడు అరెస్ట్ చేసింది. ఆమె ప్రస్తుతం ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పటికే ఆమెను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఇప్పుడు సీబీఐ ఆమెను తీహార్ జైల్లోనే ప్రశ్నించనుంది.

సీబీఐ గత ఏడాది హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో విచారించింది. ఆమెను మరోసారి విచారించేందుకు రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ అనుమతి తీసుకుంది. ఈ క్రమంలో ఆమెను ఈరోజు కస్టడీలోకి తీసుకుంది. కవితను పది రోజుల పాటు తమ కస్టడీకి కోరే యోచనలో సీబీఐ ఉంది. కాగా, కవిత రెగ్యులర్ బెయిల్‌పై ఈ నెల 16న కోర్టులో విచారణ జరగనుంది.

Posted

K Kavitha: కవితను నేడు కోర్టులో హాజరుపరచనున్న సీబీఐ.. సర్వత్ర ఉత్కంఠ! 

12-04-2024 Fri 09:46 | Telangana
  • తీహార్ జైల్లో ఉన్న కవితను నిన్న అరెస్ట్ చేసిన సీబీఐ
  • కవితను ప్రశ్నిస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయంటున్న సీబీఐ
  • లిక్కర్ స్కామ్ లో కవిత కీలకపాత్ర పాత్ర పోషించారంటూ సీబీఐ అభియోగాలు
 
CBI to produce BRS MLC Kavtitha in Court today

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తీహార్ జైల్లో ఉన్న కవితను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని... సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. ఈ నెల 6న తీహార్ జైల్లో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. తనను సీబీఐ ప్రశ్నించడాన్ని కవిత కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరగక ముందే ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్ కు, ఆప్ కు కవిత మధ్యవర్తిగా వ్యవహరించారని... రూ. 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగాలు మోపింది. 

మరోవైపు, కవితను సీబీఐ అరెస్ట్ చేసిన వెంటనే ఆమె తరపు లాయర్లు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. సీబీఐ స్పెషల్ కోర్టు ముందు అత్యవసరంగా అప్లికేషన్ ఫైల్ చేశారు. నోటీసులు ఇవ్వకుండానే కవితను అరెస్ట్ చేశారని కవిత తరపు లాయర్లు వాదనలు వినిపించారు. అయితే, రెగ్యులర్ కోర్టు ముందు అప్లికేషన్ ఫైల్ చేయాలని జడ్జి ఆదేశించారు. దీంతో, వారు రెగ్యులర్ కోర్టులో అప్లికేషన్ ఫైల్ చేశారు. 

ఇంకోవైపు, కవితను తన కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసింది. ఆమెను లోతుగా ప్రశ్నిస్తేనే వివరాలు బయటకు వస్తాయని సీబీఐ తన పిటిషన్ లో పేర్కొంది. ఈ క్రమంలో ఈరోజు కోర్టులో కవితను సీబీఐ హాజరుపరచనుంది. ఈ క్రమంలో, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. లోక్ సభ ఎన్నికలకు ముందు చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

Posted

K Kavitha: కోర్టులో కవిత.. 5 రోజుల కస్టడీ కోరిన సీబీఐ! 

12-04-2024 Fri 10:42 | Telangana
  • రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశ పెట్టిన సీబీఐ
  • లిక్కర్ పాలసీ కేసులో కవితదే కీలక పాత్ర అన్న సీబీఐ అధికారులు
  • కవిత వాట్సాప్ చాట్ ను కోర్టుకు అందించిన అధికారులు
 
Kavitha produced in Court

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు హాజరు పరిచారు. కవితను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీబీఐ అధికారులు కోరారు. ఈ కేసులో కవిత కీలక పాత్రను పోషించారని వారు కోర్టుకు తెలిపారు. సౌత్ గ్రూప్, ఆప్ పార్టీ మధ్య జరిగిన రూ. 100 కోట్ల లావాదేవీల్లో కవితది ప్రధాన పాత్ర అని వారు చెప్పారు. కవితను లోతుగా విచారిస్తేనే వివరాలు బయటకు వస్తాయని తెలిపారు. కవిత వాట్సాప్ చాట్ వివరాలను కోర్టుకు సీబీఐ అధికారులు అందించారు. కోర్టులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. న్యాయమూర్తి కావేరి బవేజా వాదనలను వింటున్నారు. కవితను సీబీఐ కస్టడీకి కోర్టు ఇస్తుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. 

Posted

 

K Kavitha: కవితకు మూడ్రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి 

12-04-2024 Fri 16:24 | Telangana
  • ఢిల్లీ మద్యం కేసులో కవిత కీలకమని కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్న సీబీఐ
  • ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరిన సీబీఐ
  • రేపటి నుంచి మూడురోజుల కస్టడీ 
 
Court granted three day custody for kavitha

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీకి రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ ఐదు రోజుల కస్టడీని కోరగా... మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీలోకి తీసుకొని కవితను విచారించనుంది.

కవిత కస్టడీ పిటిషన్‌లో కీలక అంశాలు

మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ... అందులో కీలక అంశాలు పేర్కొంది. కవితను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరింది. మద్యం కేసులో కవిత చాలా కీలకమని, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు చెల్లించారని సీబీఐ కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది. జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షల ముడుపులు ఇచ్చారని తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు అందులో పేర్కొంది. సీబీఐ 11 పేజీలతో ఈ కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేసింది.

Posted

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం: శరత్ చంద్రారెడ్డిని బెదిరించిన కవిత.. కస్టడీ రిపోర్టులో సీబీఐ 

13-04-2024 Sat 11:31 | Telangana
  • శరత్ చంద్రారెడ్డికి ఐదు మద్యం రిటైల్ జోన్లను కవిత ఇప్పించారన్న సీబీఐ
  • ప్రతిగా రూ. 14 కోట్లు కవితకు ముట్టాయంటూ కస్టడీ రిపోర్టు
  • అడిగిన మొత్తం ఇవ్వకుంటే తెలంగాణలో వ్యాపారం చేయలేవని శరత్‌ను కవిత బెదిరించారన్న సీబీఐ
 
BRS MLC Kavitha warns Sarath Chandra Reddy says CBI report

ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు సీబీఐ ఆమెను ప్రశ్నించనుంది. కస్టడీ రిపోర్టులో సీబీఐ సంచలన విషయాలు పేర్కొంది. అరబిందో గ్రూప్‌కు చెందిన శరత్ చంద్రారెడ్డికి ఐదు మద్యం రిటైల్ జోన్లు ఇప్పించడంలో ఆమె కీలకంగా వ్యవహరించినట్టు పేర్కొంది. ప్రతిఫలంగా ఆర్థిక లబ్ధి పొందారని తెలిపింది. అంతేకాదు, తాను డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వకుంటే తెలంగాణలో వ్యాపారం చేయలేవంటూ ఆయనను కవిత బెదిరించారని పేర్కొంది. 

ఐదు జోన్లు తనకు దక్కినందుకు బదులుగా కవిత నుంచి రూ. 14 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్టు ఒప్పందం జరిగిందని, ఇది ఆయనకు ఇష్టం లేకున్నా తప్పని పరిస్థితులలో ఆయన చేశారని వివరించింది. భూమిని కొనుగోలు చేసినప్పటికీ భూ బదలాయింపు మాత్రం ఇప్పటికీ జరగలేదని తెలిపింది. అందులో భాగంగా జులై 2021లో రూ. 7 కోట్లు, నవంబరులో మిగిలిన రూ. 7 కోట్లు కవితకు శరత్ చంద్రారెడ్డి చెల్లించినట్టు ఆధారాలు లభించాయని కస్టడీ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. కవితకు చెందిన జాగృతి సంస్థకు కూడా సీఎస్ఆర్ కింద శరత్ చంద్రారెడ్డి రూ. 80 లక్షలు బదిలీ చేసినట్టు పేర్కొంది.

Posted

KTR: రేపు ఢిల్లీకి వెళ్తున్న కేటీఆర్ 

13-04-2024 Sat 15:37 | Telangana
  • సీబీఐ కస్టడీలో ఉన్న కవిత
  • ప్రతిరోజు సాయంత్రం కుటుంబ సభ్యులను కలిసే వెసులుబాటు
  • చెల్లెలిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్తున్న కేటీఆర్
 
KTR going to Delhi tomorrow

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. కేటీఆర్ సోదరి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఆమెను విచారించనుంది. అయితే ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను, తన న్యాయవాదని కలుసుకునే వెసులుబాటును కవితకు కోర్టు కల్పించింది. ఈ నేపథ్యంలో, తన చెల్లెలిని కలిసేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఆమెకు ధైర్యం చెప్పనున్నారు. న్యాయవాదులతో కూడా ఆయన మాట్లాడనున్నారు. కవిత భర్త ఢిల్లీలోనే ఉన్నారు.

Posted

K Kavitha: కవితను కలిసేందుకు సీబీఐ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్, భర్త అనిల్ కుమార్ 

14-04-2024 Sun 18:51 | Telangana
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు సీబీఐ కస్టడీ
  • ఈ నెల 15 వరకు కవితను విచారించనున్న సీబీఐ
  • న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతి
 
KTR and Anil Kumar arrives CBI office to meet K Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. కాగా, కస్టడీ సమయంలో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కవిత తన న్యాయవాదితో 30 నిమిషాలు, కుటుంబ సభ్యులతో 15 నిమిషాలు మాట్లాడేందుకు కోర్టు అనుమతించింది. 

ఈ నేపథ్యంలో, కవితను కలిసేందుకు కేటీఆర్, కవిత న్యాయవాది మోహిత్ రావు, కవిత భర్త అనిల్ కుమార్ ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. నిబంధనల మేరకు వారు కవితను కలిసి మాట్లాడనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్లుగా మారిన మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, దినేశ్ ఆరోరా తదితరుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కవితను సీబీఐ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో సాక్షులను, సాక్ష్యాధారాలను కవిత ముందు ఉంచి ఈ మేరకు ఆమె నుంచి సమాచారం రాబట్టాలని సీబీఐ భావిస్తోంది.

Posted

K Kavitha: కుమార్తె అరెస్ట్ అయి నేటికి నెల రోజులు.. ఇప్పటి వరకు పరామర్శించని కేసీఆర్.. నేడు మళ్లీ తీహార్ జైలుకు కవిత 

15-04-2024 Mon 08:28 | Telangana
  • గతనెల 15న కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు
  • తల్లి శోభ, సోదరుడు కేటీఆర్, భర్త అనిల్ కుమార్ పరామర్శ
  • ఒక్కసారి కూడా ప్రస్తావన తీసుకురాని కేసీఆర్
  • రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
  • నేటితో ముగియనున్న సీబీఐ కస్టడీ
  • 10 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు
 
KCR did not visit daughter Kavitha for a month after her arrest

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి నేటికి సరిగ్గా నెల రోజులు. జైలులో ఉన్న ఆమెను సోదరుడు కేటీఆర్, ఆమె భర్త, తల్లి శోభ కలిసినా, తండ్రి కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఆమెను పరామర్శించకపోవడమే కాకుండా ఆ విషయాన్ని కూడా ప్రస్తావించకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను గత నెల 15న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అప్పటి నుంచి ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. గత 20 రోజులుగా తీహార్ జైలులోనే ఉన్న కవితను ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసి మూడు రోజులు విచారించింది. నేటితో ఆమె కస్టడీ ముగియనుండడంతో తిరిగి ఆమెను తీహార్ జైలుకు పంపనున్నారు. 

ఉదయం 10 గంటలకు ఆమెను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరుస్తారు. ఈ సందర్భంగా కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరే అవకాశం ఉంది. ఒకవేళ సీబీఐ కనుక కస్టడీ పిటిషన్ వేయకుంటే కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 

Posted

@psycopk KCR kida follow aitaledemo e case ne laga

:giggle: entaina ne ex... a matram concern undali

  • Haha 2
Posted

 

CBI: కవిత విచారణకు సహకరించలేదు... తప్పుదోవ పట్టించేలా సమాధానాలు చెప్పారు: సీబీఐ 

15-04-2024 Mon 14:16 | Telangana
  • కస్టడీకి సంబంధించి 11 పేజీలతో రిమాండ్ అప్లికేషన్ దాఖలు చేసిన సీబీఐ
  • శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్ల వ్యవహారంపై కవితను ప్రశ్నించినట్లు వెల్లడి
  • దర్యాఫ్తును, సాక్షులను ప్రభావితం చేయగలిన, పలుకుబడి గల వ్యక్తి కవిత అని పేర్కొన్న సీబీఐ
  • కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందన్న సీబీఐ
 
CBI says kavitha did not cooperate for enquity

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తమకు కస్టడీలో సహకరించలేదని, ఉద్దేశ్యపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా సమాధానాలు చెప్పారని సీబీఐ పేర్కొంది. మూడు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకొని విచారించిన సీబీఐ అధికారులు సోమవారం ఆమెను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ప్రవేశ పెట్టారు. 11 పేజీలతో రిమాండ్ అప్లికేషన్‌ను దాఖలు చేశారు. ఇందులో కీలక అంశాలను వెల్లడించారు. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్ల వ్యవహారంపై కవితను ప్రశ్నించినట్లు అందులో పేర్కొన్నారు.

శరత్ చంద్రారెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, విజయ్ నాయర్‌తో జరిగిన సమావేశాలపై కస్టడీ సందర్భంగా ప్రశ్నించామని, వాటికి కవిత సూటిగా సమాధానాలు చెప్పలేదన్నారు. ఆమె దర్యాఫ్తును, సాక్షులను ప్రభావితం చేయగలిన, పలుకుబడి గల వ్యక్తి అని అందులో పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందన్నారు. డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందని, ఈ పరిస్థితుల్లో ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని కోరింది. కోర్టు ఆమెకు 9 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది. 

 

Posted

MLC Kavitha: కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడమేంటి?.. కవితకు కోర్టు వార్నింగ్ 

15-04-2024 Mon 13:04 | Telangana
  • మరోసారి ఇలా చేయొద్దని వార్నింగ్ ఇచ్చినా వినిపించుకోని ఎమ్మెల్సీ
  • కోర్టు హాల్ నుంచి బయటికొస్తూ మరోసారి మీడియాతో మాట్లాడిన కవిత
  • ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీని విధించిన రౌస్ ఎవెన్యూ కోర్టు
 
Rouse Avenue Court Warned MLC Kavitha

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో జైలుపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు సోమవారం వార్నింగ్ ఇచ్చింది. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే బదులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. మరోసారి ఇలా చేయొద్దంటూ రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా హెచ్చరించారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కోర్టు నుంచి కవితను అధికారులు తీహార్ జైలుకు తరలించారు.

ఈ సందర్భంగా కవిత మళ్లీ మీడియాతో మాట్లాడారు. న్యాయమూర్తి హెచ్చరికలను పెడచెవిన పెట్టి మీడియాతో మాట్లాడారు. ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని వ్యాఖ్యానించారు. ‘ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ. రెండు నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారు. బయట బీజేపీ అడిగిందే.. లోపల సీబీఐ అడుగుతోంది. ఇందులో కొత్తది ఏమీ లేదు’ అని కవిత ఆరోపించారు. మధ్యంతర బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది. రెగ్యులర్ బెయిల్ పై దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు ఈ నెల 16న విచారించనుంది.

Posted

 

K Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా 

16-04-2024 Tue 14:58 | Telangana
  • తన అరెస్ట్ అక్రమమంటూ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత
  • సెలవులో ఉన్న ప్రత్యేక కోర్టు జడ్జి
  • దీంతో 22 లేదా 23వ తేదీకి వాయిదాపడిన విచారణ
 
Kavitha bail petition plea postponed

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి సెలవులో ఉన్నారు. దీంతో ఆమె విచారణ వాయిదా పడింది. ఈ నెల 22న లేదా 23వ తేదీన న్యాయస్థానం వాదనలు విననుంది. మద్యం కేసులో తాను నిర్దోషినని, తనపై అక్రమంగా కేసు పెట్టారని, కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈరోజు విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ జడ్జి సెలవులో ఉండటంతో వాయిదాపడింది. సీబీఐ తనను అరెస్ట్ చేసిన కేసులోనూ కవిత నిన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా 22వ తేదీన విచారణ జరగనుంది. 

 

Posted

Mamalni antunadu.., eediki vata undi antara

 

 

Harish Rao: కోర్టు నిర్ధారణ చేయకముందే కవిత తప్పు చేశారని ఎలా అంటారు? తమనూ జైల్లో పెట్టేందుకు ప్రయత్నాలు: హరీశ్ రావు 

17-04-2024 Wed 23:00 | Telangana
  • మద్యం కేసులో కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ఒక మాట, తెలంగాణలో మరో మాట మాట్లాడుతున్నారన్న హరీశ్ రావు
  • కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి బీజేపీ నేత నరేంద్ర మోదీ ఆశీర్వాదం తీసుకున్నారని వ్యాఖ్య
  • ఏక్ నాథ్ షిండే అయ్యేది తాను కాదు... రేవంత్ రెడ్డే అవుతాడన్న హరీశ్ రావు
 
Harish Rao responds on Kavitha arrest

కోర్టు నిర్ధారణ చేయకముందే మద్యం కేసులో కవిత తప్పు చేశారని ఎలా అంటారు? తమనూ జైల్లో పెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బుధవారం ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్‌కు కోర్టులపై నమ్మకం ఉందన్నారు. మద్యం కేసులో రాహుల్ గాంధీ ఢిల్లీలో ఓ మాట, తెలంగాణలో మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కవితను అరెస్ట్ చేయనందుకు బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం చేసిందని ఆరోపించారు.

బీజేపీ నేత నరేంద్ర మోదీని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆశీర్వాదం కోరారని గుర్తు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు... బీజేపీయే గెలుస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ ఎవరి వైపు ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సుపారీలు తీసుకొని బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు బెదిరించి ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్పించుకుంటున్నారన్నారు. బీజేపీలో చేరిన తర్వాత వారిపై ఐటీ దాడులు, సీబీఐ దాడులు ఉండవని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చే అంశం పరిశీలనలో ఉందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలే బండకేసి కొడతారన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. ఏక్ నాథ్ షిండే అయ్యేది తాను కాదని... రేవంత్ రెడ్డే అవుతారని జోస్యం చెప్పారు. పదవిలో ఉన్నా లేకున్నా తాను వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటానని తెలిపారు. పదవి కోసం గడ్డి తినే అలవాటు తనకు లేదని వెయ్యిసార్లు చెప్పానని గుర్తు చేశారు. 

 

  • Haha 1
Posted
On 4/16/2024 at 8:52 AM, psycopk said:

 

CITI_c$y  thumbnail .....  intiki pilipinchukundaa....  @psycopk

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...