Gorantlamdhav Posted May 6, 2024 Report Posted May 6, 2024 1 hour ago, Android_Halwa said: Koduku exam ayipoyi, exam result kuda vachi vuntayi… First class lo pass ayevuntadu…hopefully. Akka lekka last bench ankunna poradu first class aa Quote
Anta Assamey Posted May 6, 2024 Report Posted May 6, 2024 2 hours ago, Android_Halwa said: Koduku exam ayipoyi, exam result kuda vachi vuntayi… First class lo pass ayevuntadu…hopefully. Support cheyamani adigina support cheyavu ga... Quote
psycopk Posted May 7, 2024 Author Report Posted May 7, 2024 KCR: నన్ను అరెస్ట్ చేయాలని మోదీ చూస్తున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు 07-05-2024 Tue 11:33 | Telangana తాను అవినీతి చేయలేదు కాబట్టే మోదీకి దొరకలేదన్న కేసీఆర్ మద్యం పాలసీలో కుంభకోణం సృష్టించి కవితను ఇరికించారని ఆరోపణ కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టీకరణ దక్షిణాదిలో బీజేపీకి 12 సీట్లు వస్తే ఎక్కువన్న బీఆర్ఎస్ అధినేత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను కూడా జైలుకు పంపేందుకు ప్రయత్నించారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. మోదీకి లొంగని వ్యక్తుల్లో తాను, కేజ్రీవాల్ హేమంత్ సోరెన్ ఉన్నామని, వారిద్దరినీ అనుకున్నట్టే జైలుకు పంపినా తనెక్కడా అవినీతికి పాల్పడకపోబట్టే మోదీకి తాను దొరకలేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో నిన్న ప్రచారం నిర్వహించిన కేసీఆర్ ‘ఈనాడు-ఈటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కేసు అనేది మోదీ వికృత రూపానికి నిదర్శమని దుయ్యబట్టారు. మద్యం పాలసీలో కుంభకోణాన్ని సృష్టించి అందులో కవితను ఇరికించారని ఆరోపించారు. పదేళ్ల తమ పాలనలో అద్భుతాలు చేశామన్న కేసీఆర్ ఐదు నెలల పాలనలోనే ప్రజల్ని రాచి రంపాన పెడుతోందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం కనిపిస్తుందని, బీఆర్ఎస్ గణనీయమైన సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమన్న సీఎం రేవంత్‌రెడ్డి తోకముడిచారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. కేంద్రంలో ఎన్డీయేకు మెజార్టీ వచ్చే పరిస్థితి ఎంతమాత్రమూ లేదన్న కేసీఆర్.. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తుడిపెట్టుకు పోతుందన్నారు. దక్షిణాదిలో బీజేపీకి 12 సీట్లు వస్తేనే ఎక్కువని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. looks like lafangi is also involved Quote
Spartan Posted May 7, 2024 Report Posted May 7, 2024 2 minutes ago, psycopk said: KCR: నన్ను అరెస్ట్ చేయాలని మోదీ చూస్తున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు looks like lafangi is also involved yes most likely he will be called in Quote
Joker_007 Posted May 7, 2024 Report Posted May 7, 2024 2 hours ago, psycopk said: KCR: నన్ను అరెస్ట్ చేయాలని మోదీ చూస్తున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు 07-05-2024 Tue 11:33 | Telangana తాను అవినీతి చేయలేదు కాబట్టే మోదీకి దొరకలేదన్న కేసీఆర్ మద్యం పాలసీలో కుంభకోణం సృష్టించి కవితను ఇరికించారని ఆరోపణ కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టీకరణ దక్షిణాదిలో బీజేపీకి 12 సీట్లు వస్తే ఎక్కువన్న బీఆర్ఎస్ అధినేత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను కూడా జైలుకు పంపేందుకు ప్రయత్నించారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. మోదీకి లొంగని వ్యక్తుల్లో తాను, కేజ్రీవాల్ హేమంత్ సోరెన్ ఉన్నామని, వారిద్దరినీ అనుకున్నట్టే జైలుకు పంపినా తనెక్కడా అవినీతికి పాల్పడకపోబట్టే మోదీకి తాను దొరకలేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో నిన్న ప్రచారం నిర్వహించిన కేసీఆర్ ‘ఈనాడు-ఈటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కేసు అనేది మోదీ వికృత రూపానికి నిదర్శమని దుయ్యబట్టారు. మద్యం పాలసీలో కుంభకోణాన్ని సృష్టించి అందులో కవితను ఇరికించారని ఆరోపించారు. పదేళ్ల తమ పాలనలో అద్భుతాలు చేశామన్న కేసీఆర్ ఐదు నెలల పాలనలోనే ప్రజల్ని రాచి రంపాన పెడుతోందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం కనిపిస్తుందని, బీఆర్ఎస్ గణనీయమైన సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమన్న సీఎం రేవంత్‌రెడ్డి తోకముడిచారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. కేంద్రంలో ఎన్డీయేకు మెజార్టీ వచ్చే పరిస్థితి ఎంతమాత్రమూ లేదన్న కేసీఆర్.. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తుడిపెట్టుకు పోతుందన్నారు. దక్షిణాదిలో బీజేపీకి 12 సీట్లు వస్తేనే ఎక్కువని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. looks like lafangi is also involved roju chukkesi farmhouse la bajjunte inka corruption ki chances ekkada.. ayithey giythey ninnu PEEPING TOM BOY Case la (Ade Phone Tapping ) lopelestaru gani.. Quote
psycopk Posted May 7, 2024 Author Report Posted May 7, 2024 Emi sambandam ledu annadi…ipudu ee prajwal evadu?? K Kavitha: ప్రజ్వల్ ను దేశం దాటించారు.. మమ్మల్ని అరెస్ట్ చేయడం దారుణం: కవిత 07-05-2024 Tue 16:28 | Telangana రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన కవిత జ్యుడీషియల్ కష్టడీని పొడిగించిన కోర్టు కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కోర్టు ప్రాంగణంలో పోలీసు సిబ్బంది మధ్య నడుచుకుంటూ వెళ్తున్న కవితను మీడియా ప్రతినిధులు పలకరించారు. మేడమ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అని ఆమెను ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానమిస్తూ... 'ప్రజ్వల్ రేవణ్ణ వంటి వారిని దేశం దాటించారు. మాలాంటి వాళ్లను అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుతున్నా' అని చెప్పారు. జై తెలంగాణ అని నినదిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు, వారం రోజుల్లోగా కవితపై ఈడీ ఛార్జ్ షీట్ వేయబోతోంది. Quote
psycopk Posted May 10, 2024 Author Report Posted May 10, 2024 Delhi Liquor Scam: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు 10-05-2024 Fri 12:49 | Telangana మే 24వ తేదీకి వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌పై వాదనలకు సమయం కోరిన ఈడీ తదుపరి గడువులోగా స్పందన తెలియజేయాలన్న హైకోర్టు జడ్జి మద్యం పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను మే 24వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ కోరుతూ కవిత మొదట రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, విచారణ అనంతరం నిర్ణయం వెలువరిస్తామని కోర్టు తెలిపింది. అయితే ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలకు ఈడీ సమయం కోరింది. దీంతో విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. గడువు లోగా ఈడీ తన స్పందనను తెలియజేయాలని జస్టిస్ స్వరణ కాంత శర్మ ఆదేశించారు. Quote
psycopk Posted May 10, 2024 Author Report Posted May 10, 2024 Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట... మధ్యంతర బెయిల్ మంజూరు 10-05-2024 Fri 14:34 | National ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ ను మార్చి 21న అరెస్ట్ చేసిన ఈడీ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న కేజ్రీవాల్ నేడు కేజ్రీవాల్ కు ఊరట కలిగిస్తూ మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు నేడు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు ఈ మధ్యంతర బెయిల్ వర్తిస్తుందని, తిరిగి జూన్ 2న లొంగిపోవాల్సి ఉంటుందని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. కోర్టు కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఆ తర్వాత కస్టడీ పొడిగించారు. ఈ నేపథ్యంలో, నేడు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం ఆయనకు పెద్ద ఊరట అని చెప్పాలి. Quote
psycopk Posted May 14, 2024 Author Report Posted May 14, 2024 K Kavitha: మద్యం పాలసీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు 14-05-2024 Tue 14:38 | Telangana కవితను వర్చువల్‌గా కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు మే 20వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు 8వేల పేజీల సప్లిమెంటరీ ఛార్జీషీటును దాఖలు చేసిన ఈడీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం పొడిగించింది. మే 20వ తేదీ వరకు ఆమె రిమాండ్‌ను పొడిగించింది. ఈడీ అధికారులు కవితను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి 8వేల పేజీల సప్లిమెంటరీ ఛార్జీషీటును దాఖలు చేశారు. దీంతో ఆమె రిమాండును పొడిగించింది. ఛార్జీషీట్‌ను పరిగణలోకి తీసుకోవడంపై మే 20న విచారణ జరగనుంది. ఈడీ కేసులో నేటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగిసింది. మద్యం పాలసీ కేసులో దర్యాఫ్తు కొనసాగుతోందని... కాబట్టి ఆమె రిమాండ్‌ను పొడిగించాలని ఈడీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. Quote
psycopk Posted May 16, 2024 Author Report Posted May 16, 2024 BRS: ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత మరో బెయిల్ పిటిషన్ 16-05-2024 Thu 12:00 | Telangana సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని వినతి మధ్యాహ్నం 12:30 గంటలకు విచారణ చేపట్టనున్న న్యాయస్థానం ఇప్పటికే ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ప్రమేయమున్నట్లు ఆరోపిస్తూ ఈడీ, సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె వేసిన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీలోని ట్రయల్ కోర్టు తోసిపుచ్చడం తెలిసిందే. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన కవిత సీబీఐ నమోదు చేసిన కేసులోనూ బెయిల్ ఇవ్వాలని కోరుతూ గురువారం మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై మధ్యాహ్నం 12:30 గంటలకు విచారణ జరగనుంది. ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. Quote
psycopk Posted May 16, 2024 Author Report Posted May 16, 2024 Congress: లిక్కర్ రాణి కవితను జైలు నుంచి విడిపించేందుకు కేసీఆర్ బీజేపీకి ఓట్లేయించారు.. ఆధారాలు ఉన్నాయి: కేకే మహేందర్ రెడ్డి 16-05-2024 Thu 16:10 | Telangana పద్మశాలీలు నిరోద్‌లు అమ్ముకోవాలని తాను అన్నట్లుగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపాటు ఒక వ్యక్తితో వేరే సందర్భంలో మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి వైరల్ చేశారన్న కేకే బీజేపీకి ఓటు వేయమని బీఆర్ఎస్ నేతలే చెప్పారన్న మహేందర్ రెడ్డి లిక్కర్ రాణి, కూతురు కవితను జైలు నుంచి విడిపించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీకి ఓట్లు వేయించారని కాంగ్రెస్ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. తన దగ్గర ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వెయ్యండని బీఆర్ఎస్ నేతలే చెప్పారని పేర్కొన్నారు. పద్మశాలీలు నిరోద్‌లు అమ్ముకోవాలని తాను అన్నట్లుగా అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పద్మశాలీలను అనలేదని... ఒక వ్యక్తితో వేరే సందర్భంలో మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి వైరల్ చేశారని ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసలు ప్రభుత్వం అనుమతించిన వాటిని అమ్ముకుంటే తప్పేమిటని వ్యాఖ్యానించారు. కూతురు కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం ప్రధాని మోదీ వద్ద మోకరిల్లిన పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. కేసీఆర్ ప్రధాని మోదీ కనుసన్నుల్లోనే ఉన్నారన్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని స్వయంగా కేసీఆర్ తనను అడిగినట్లు ప్రధానే చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఏమిటో తెలియాలన్నారు. కేసీఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్ ఎవరు కోన్ కిస్కా అని మండిపడ్డారు. కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జల దోపిడీ చేశారని, సిరిసిల్ల జిల్లా పొలాలను ఎండబెట్టి ఆయన పొలాలకు నీళ్లు తీసుకెళ్లాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల పేరుతో కేటీఆర్ దోపిడీకి పాల్పడ్డారన్నారు. Quote
psycopk Posted May 17, 2024 Author Report Posted May 17, 2024 Tihar Jail: తీహార్ జైల్లో కల్వకుంట్ల కవితను కలిసిన బాల్క సుమన్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ 17-05-2024 Fri 13:02 | Telangana ములాఖత్ లో పరామర్శించిన బాల్క సుమన్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ నేతలు ఆమెను కలవడం ఇదే తొలిసారి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమెను మార్చి 15న అరెస్ట్ చేసిన ఈడీ ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నాగర్ కర్నూలు బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆమెను పరామర్శించారు. కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ నేతలు ఆమెతో ములాఖత్ కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ పరామర్శ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ నూతన లిక్కర్ పాలసీ తయారీ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఈడీ మార్చి 15న కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో అరెస్టు చేయడం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె జ్యుడీషియల్ రిమాండ్ లోనే ఉన్నారు. ఇదే కేసులో సీబీఐ సైతం ఆమెను సాంకేతికంగా అరెస్టు చేసినట్లు చూపింది. మరోవైపు బెయిల్ కోసం కవిత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ ట్రయల్ కోర్టు కొట్టేసింది. బెయిల్ పై విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఈడీ, సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ జరుగుతోంది. Quote
psycopk Posted May 17, 2024 Author Report Posted May 17, 2024 RS Praveen Kumar: కేజ్రీవాల్‌కు బెయిల్ దొరికినప్పుడు కవితకు ఎందుకు రావడం లేదు?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 17-05-2024 Fri 15:28 | Telangana ఇతరుల పేర్లు చెప్పాలంటూ కవితపై ఈడీ, సీబీఐలు ఒత్తిడి చేస్తున్నాయన్న ప్రవీణ్ కుమార్ తీహార్ జైల్లో ఆమె ధైర్యంగా ఉన్నారని వెల్లడి ఢిల్లీ ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి మద్యం పాలసీని తీసుకువచ్చిందన్న ఆర్ఎస్పీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు బెయిల్ దొరికినప్పుడు కవితకు ఎందుకు రావడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఇది చాలా దారుణమన్నారు. తీహార్ జైల్లో కవితను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మద్యం పాలసీ కేసులో ఇతర రాజకీయ నాయకుల పేర్లు వెల్లడించాలని కవితపై ఈడీ, సీబీఐల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని, ఈ విషయాన్ని ఆమె తమతో పంచుకున్నారన్నారు. ఇతర నాయకుల పేర్లు చెప్పాలని ఒత్తిడి తేవడం అనైతికం, చట్టవిరుద్ధం, రాజ్యాంగవిరుద్ధమని మండిపడ్డారు. తీహార్ జైల్లో ఆమె ధైర్యంగా ఉన్నారన్నారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, తాను నిర్దోషినని, అలాగే పిల్లల తల్లిని అని, తనపై అధికార పార్టీ రాజకీయ కుట్రతో ఇరికించిందని చెబుతూ కవిత బెయిల్ పిటిషన్ వేసిందని గుర్తు చేశారు. ఆమెపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7ను సీబీఐ ఎలా ప్రయోగించింది? అని ప్రశ్నించారు. హేమంత్ సోరెన్, మనీశ్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్‌లను కూడా అన్యాయంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. అదే కేసులో ఒకరికి బెయిల్ దొరికిన తర్వాత... కవిత బెయిల్‌ను విచారణ సంస్థలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయన్నారు. కవితపై రాజకీయ కక్షతోనే మద్యం పాలసీ కేసులో ఇరికించారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీబీఐ, ఈడీ వంటి విచారణ సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను అణచివేసే ప్రయత్నాలు చేస్తోందని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ఈ కేసులో కవిత వద్ద ఒక్క రూపాయిని కూడా గుర్తించలేదన్నారు. మద్యం పాలసీ కేసు క్రైమే కాదన్నారు. తమ రెవెన్యూ పెంచుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకు వచ్చిందని, ఇందులో తప్పేముందన్నారు. అలాంటప్పుడు ఇందులో నేరం ఎక్కడ జరిగింది? అని ప్రశ్నించారు. Quote
psycopk Posted May 20, 2024 Author Report Posted May 20, 2024 K Kavitha: మద్యం పాలసీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు 20-05-2024 Mon 14:39 | Telangana రిమాండ్‌ను జూన్ 3 వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు రెండు నెలలుగా తీహార్ జైల్లో కవిత ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం పొడిగించింది. కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం పాలసీ కేసులో కవితను రెండు నెలల క్రితం ఈడీ అరెస్ట్ చేసింది. రెండు నెలలుగా ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు పలుమార్లు పొడిగించింది. జూన్ 3వ తేదీ వరకు కవిత రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. అధికారులు కవితను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. Quote
psycopk Posted May 27, 2024 Author Report Posted May 27, 2024 K Kavitha: కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా 27-05-2024 Mon 16:04 | Telangana సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖలైన బెయిల్ పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ తన పిటిషన్లలో బెయిల్‌తో పాటు అరెస్టు, రిమాండ్‌ను సవాల్ చేసిన కవిత కవిత తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది విక్రమ్ చౌదరి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత బెయిల్ పిటిషన్ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖలైన బెయిల్ పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ రేపు విచారణ చేపట్టనున్నారు. కాగా, తన పిటిషన్లలో కవిత బెయిల్‌తో పాటు అరెస్టు, రిమాండ్‌ను ఆమె సవాల్ చేశారు. కవిత తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది విక్రమ్ చౌదరి ఆమె అరెస్టులో దర్యాప్తు సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఈడీ, సీబీఐలు కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేశాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విచారణ జరగనుంది. కాగా, ఫలితం ఎలా ఉన్నా వాదనలు చాలా బాగా ఉన్నాయని విక్రమ్ చౌదరిని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రశంసించారు. ఈ సందర్భంగా కవిత తరఫు న్యాయవాది పలు కీలక విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోబోమంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండర్ టేకింగ్ ఇచ్చిందని.. కవిత వేసిన రిట్ పిటిషన్ సుప్రీంలో పెండింగులో ఉండడంతో విచారణ ముందుకు సాగడం లేదంటూ ఈడీ సుప్రీంకోర్టుకు లేఖ రాసిందని తెలిపారు. తాము ఇచ్చిన అండర్ టేకింగ్ తదుపరి వాయిదా వరకే అని చెప్పారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండగానే 41 (ఏ) ప్రకారం సమన్లు జారీ చేశారని విక్రమ్ చౌదరి గుర్తు చేశారు. సీఆర్‌పీసీ 161 ప్రకారం మొదట నోటీసులు ఇచ్చినవారు, ఆ తర్వాత 41 (ఏ)కు ఎందుకు మారారో తెలియదన్నారు. సుప్రీంలో విచారణ జరుగుతుండగానే ఈడీ బృందం కవిత ఇంట్లో ఉందని చెప్పారు. అదే రోజు ఆమెను అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిందని తెలిపారు. అలాగే జ్యూడీషియల్ కస్టడీలో ఉండగానే కవితను ప్రశ్నించాలంటూ సీబీఐ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం అంగీకరించింది. కానీ, దీని గురించి ఆమెకు మాత్రం ఎలాంటి సమాచారం లేదని చెప్పుకొచ్చారు. సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారం సీబీఐ ప్రశ్నించాలంటే కవిత వాదన కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత కనీసం అరెస్ట్ వారెంట్ కూడా లేకుండానే సీబీఐ అరెస్టు చేసిందన్నారు. రేపు మధ్యాహ్నం కౌంటర్ వాదనలు వినిపిస్తామని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.