Jump to content

update on kavita case


Recommended Posts

Posted
17 minutes ago, Anta Assamey said:

PMLA act ni baga vadi dobutunaru ga...Inka enni rojulu unchutaru ra maa akka ni...33mtnj.gif

What is this act?

Posted
3 minutes ago, psycopk said:

What is this act?

Regular law lo You are innocent until proven guilty but

Prevention of Money Laundering Act (PMLA) - Under this you are guilty until proven innocent which makes it harder to come out...33mtnj.gif

  • Thanks 1
Posted
Just now, Anta Assamey said:

Regular law lo You are innocent until proven guilty but

Prevention of Money Laundering Act (PMLA) - Under this you are guilty until proven innocent which makes it harder to come out...

Jaggadu ki apply avada… 

Posted
Just now, psycopk said:

Jaggadu ki apply avada… 

Kavali ante pettachu but ED vaallu pettaledu...MODI recommendation meda only Kavitta akka ki icharu aa provision...33mtnj.gif

  • Haha 1
Posted

CBI: సీబీఐ కేసులోనూ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు 

03-06-2024 Mon 15:27 | Telangana
Kavitha Judicial custoday extended till June 7
 
  • సీబీఐ కేసులో జూన్ 7వ తేదీ వరకు కవిత రిమాండ్ పొడిగింపు
  • మద్యం పాలసీ కేసులో అదేరోజున ఛార్జిషీట్ దాఖలు చేయనున్న సీబీఐ
  • మద్యం పాలసీలో కవిత పాత్రపై ఇటీవలే సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 7వ తేదీ వరకు పొడిగించింది. అంతకుముందు, ఈడీ కేసులో కవిత కస్టడీని వచ్చే నెల 3 వరకు పొడిగించిన న్యాయస్థానం... ఆ తర్వాత సీబీఐ కేసులోనూ ఈ శుక్రవారం వరకు పొడిగించింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ జూన్ 7న కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. మద్యం కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిని కోర్టు పరిగణనలోకి తీసుకున్నది.

Posted

 

K Kavitha: కవితకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు 

07-06-2024 Fri 16:02 | Telangana
Kavitha Judicial remand extended
 
  • ఈ నెల 21 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
  • జైల్లో చదువుకోవడానికి పుస్తకాలు అడిగిన కవిత
  • కవిత విజ్ఞప్తికి కోర్టు ఆమోదం

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో రిమాండ్‌ను ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి తనకు పుస్తకాలు కావాలని కవిత కోర్టును కోరింది. ఆమె విజ్ఞప్తికి కోర్టు ఆమోదం తెలిపింది. కవితకు జైల్లో ఎనిమిది పుస్తకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అంతకుముందు, మద్యం పాలసీ కేసులో కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. 

 

Posted

Ma akka ni inka vadileyandi ra...

KCR should try from CBN and PK side to see if they can help in any way..47osjd.gif

Posted
2 minutes ago, Anta Assamey said:

Ma akka ni inka vadileyandi ra...

KCR should try from CBN and PK side to see if they can help in any way..47osjd.gif

Ade chestadu… mundaa ki sigga sermaa… andite juttu… leka pote kallu… alavatu eega

Posted

 

K Kavitha: ఎమ్మెల్సీ కవితపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ 

07-06-2024 Fri 14:20 | Telangana
ED files supplementary chargesheet in court
 
  • కవిత పాత్రపై ఛార్జిషీట్‌లో పేర్కొన్న సీబీఐ
  • నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ రిమాండ్
  • నేడు కస్టడీ కొనసాగింపుపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత పాత్రపై సీబీఐ శుక్రవారం సప్లిమెంటరీ ఛార్జీషీట్‌ను దాఖలు చేసింది. కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై ఈరోజు విచారణ జరగనుంది. సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగుస్తోంది. జ్యుడీషియల్ కస్టడీ కొనసాగింపుపై రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది.

అంతకుముందు ఈడీ ఆరు సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లను దాఖలు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లకు కిక్ బ్యాక్స్ రూపంలో వంద కోట్ల రూపాయలను కవిత ఇచ్చినట్లుగా ఈడీ పేర్కొంది. అదే సమయంలో బెనిఫిట్ రూపంలో తాను స్థాపించిన ఇండో స్పిరిట్ అనే సంస్థ నుంచి రూ.192 కోట్లను ప్రాఫిట్‌గా పొందినట్లు పేర్కొంది. మొత్తంగా రూ.292 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో కవిత పేరును ఈడీ తొలిసారి ఛార్జిషీట్‌లో పేర్కొంది. 

 

Posted

KTR: తీహార్‌ జైలులో కవితతో కేటీఆర్ ములాఖత్

14-06-2024 Fri 13:33 | Telangana
KTR meets Kavitha at Tihar jail
  • కవితను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేటీఆర్‌
  • ఇటీవ‌లే కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ రెండు వారాల పాటు పొడిగింపు
  • ఈ నెల 21 వరకు ఆమెకు రిమాండ్‌ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు  

ఢిల్లీలోని తీహార్‌ జైలులో కవితతో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. మర్యాదపూర్వకంగా కవితను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభ‌కోణం కేసులో కవితకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి రెండు వారాల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు ఆమెకు రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు చదువుకోవడానికి తొమ్మిది పుస్తకాలు కావాలని కోర్టుని కోరగా.. అందుకు న్యాయస్థానం అనుమ‌తించింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరగనుంది. ఆమెను కలిసిన తర్వాత కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు.

  • 2 weeks later...
Posted

Harish Rao: తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితను క‌లిసిన‌ మాజీ మంత్రి హరీశ్‌ రావు 

28-06-2024 Fri 13:49 | Telangana
Former Minister Harish Rao Meet MLC Kavitha in Tihar Jail
 
  • ములాఖాత్ సందర్భంగా కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న హ‌రీశ్ రావు
  • ఇటీవ‌లే క‌విత‌ను క‌లిసిన మాజీ మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, స‌బితా ఇంద్రారెడ్డి
  • ఇటీవలే కవిత జ్యుడీషియల్‌ కస్టడీని మరోసారి పొడిగించిన రౌస్‌ ఎవెన్యూ కోర్టు
  • దీంతో జులై 5వ తేదీ వరకు తీహార్ జైల్లోనే ఉండ‌నున్న క‌విత‌  

తీహార్ జైలులో ఉన్న‌ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రి హరీశ్‌ రావు శుక్ర‌వారం ఉదయం క‌లిశారు. ఈ ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, ఇటీవ‌లే మాజీ మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, స‌బితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ క‌విత‌ను క‌లిసిన‌ విష‌యం తెలిసిందే.

ఇక ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌ కేసులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించిన సంగ‌తి తెలిసిందే. జులై 5వ తేదీ వరకు ఆమె కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

Posted

K Kavitha: కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు! 

01-07-2024 Mon 16:07 | Telangana
Delhi HC is likely to pronounce its order on BRS leader K Kavitha bail pleas on Monday
 
  • ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మూడు నెలల క్రితం అరెస్టైన కవిత
  • సాయంత్రం ఐదు గంటలకు రానున్న తీర్పు
  • బెయిల్ ఇవ్వాలని వాదనలు వినిపించిన కవిత తరఫు న్యాయవాది

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో కవిత మూడు నెలలుగా జైల్లో ఉంటున్నారు. ఆమె తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు జస్టిస్ స్వర్ణకాంతశర్మ బెయిల్ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనున్నారు. 

సీబీఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీలాండరింగ్‌ కేసులో కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె సవాల్ చేశారు. ఈ కేసులోని 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, దీనిని పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ వాదనను సీబీఐ, ఈడీ వ్యతిరేకించాయి. ఈ క్రమంలో నేడు సాయంత్రం తీర్పు రానుంది.

Posted

K Kavitha: ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

01-07-2024 Mon 17:30 | Telangana
Delhi HC dismissed K Kavitha  bail plea
  • కవితకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
  • సీబీఐ, ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం
  • మూడు నెలలకు పైగా తీహార్ జైల్లో కవిత

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు ఆమెకు బెయిల్‌ను నిరాకరించింది. ఈడీ, సీబీఐ... రెండు కేసుల్లోనూ ఆమె బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. మద్యం పాలసీ కేసులో మొదట ఈడీ, ఆ తర్వాత సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. కానీ ఆమెకు నిరాశ ఎదురైంది.

దర్యాఫ్తు సంస్థలు ఈడీ, సీబీఐ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. మూడు నెలలకు పైగా ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అక్కడ బెయిల్ రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఇప్పుడు బెయిల్ కోసం కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. 

Posted

KTR: కవితక్క కూడా వస్తారు... అండగా ఉంటారు: కేటీఆర్

01-07-2024 Mon 18:25 | Telangana
KTR promises Jagityal BRS leaders
  • జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారన్న కేటీఆర్
  • పార్టీ మారిన సంజయ్‌ని వెంటబడి మరీ ఓడిద్దామని పిలుపు
  • రేవంత్ రెడ్డి మొగోడైతే పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్
  • రేవంత్ రెడ్డి ఆరోజు ప్రభుత్నాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారని ఆగ్రహం
  • పార్టీ ఫిరాయింపులను ప్రారంభించిందే కాంగ్రెస్ అన్న కేటీఆర్

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని... కానీ ఇక్కడి కార్యకర్తలకు తాము అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో తాను గల్లీ గల్లీ తిరుగుతానని హామీ ఇచ్చారు. కవితక్క కూడా వస్తారని అండగా ఉంటారన్నారు. జ‌గిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ స‌మావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్‌ని వెంటబడి మరీ ఓడిద్దామని పిలుపునిచ్చారు. ఆయన బండ కట్టుకొని బావిలో దూకాడని... కానీ మనం ధైర్యంగా ముందుకు సాగుదామని కార్యకర్తలకు సూచించారు.

నీవు మొగోడివి అయితే.. ఆ ఆరుగురు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు రా… ఓట్లతో కొట్టి ఆ ఆరుగురిని శాశ్వతంగా రాజ‌కీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. రోషం, ద‌మ్ముంటే ప‌ద‌వికి రాజీనామా చేసి ప్ర‌జ‌ల్లోకి రావాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను చేర్చుకున్నాం క‌దా అని కొంద‌రు అంటున్నారని... మ‌న‌కు, వాళ్ల‌కు తేడా ఏమిటో తెలియాలన్నారు. పార్టీ ఫిరాయింపులకు తొలుత పాల్పడింది కాంగ్రెస్సే అన్నారు. ఆయారాం.. గ‌యారాం.. విష‌బీజానికి మొగ్గ తొడిగింది ఇందిరాగాంధీ హయాంలోనే అని విమర్శించారు. నాడు హ‌ర్యానాలో ఇత‌ర పార్టీల‌ ఎమ్మెల్యేల‌ను లాక్కొని... పార్టీ ఫిరాయింపుల సంస్కృతి తీసుకువచ్చారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి ఆరోజు ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు

2004లో బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని గెలిచిందని, తమ పార్టీ నుంచి 26 మంది గెలిస్తే నాటి వైఎస్ ప్రభుత్వం 10 మందిని తమలో కలుపుకునే ప్రయత్నం చేసిందన్నారు. కాంగ్రెస్ మెడలు వంచి 2014లో కేసీఆర్ తెలంగాణ సాధించారని... అయితే  నాడు రేవంత్ రెడ్డి రూ.50 లక్షలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ అడ్డంగా దొరికిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేయడంతో... ఆ తర్వాత టీడీపీ, బీఎస్పీ నుంచి మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలు వచ్చి బీఆర్ఎస్‌లో విలీనమయ్యారని తెలిపారు. అప్పుడు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కలేదన్నారు.

ఇప్పుడు ఆ పిచ్చి కుక్క ఎవరు?

పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డే ఎమ్మెల్యేల‌ను కుక్క‌ల మాదిరి రాళ్ల‌తో కొట్టి చంపాల‌ని రేవంత్ రెడ్డి గ‌తంలో అన్నారని... ఇప్పుడు ఆ పిచ్చికుక్క ఎవరు? అని ప్రశ్నించారు. అలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలన్నారు. రేవంత్ రెడ్డికి ద‌మ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు రావాలని సవాల్ చేశారు. ఓట్ల‌తో కొట్టి ఆ ఆరుగురిని రాజ‌కీయంగా శ్వాశ‌తంగా స‌మాధి చేసే బాధ్య‌త తెలంగాణ స‌మాజం తీసుకుంటుందన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఆటోమేటిక్‌గా డిస్‌క్వాలిఫై చేస్తామని రాహుల్ గాంధీ అన్నారని... కానీ ఆ మాటను విస్మరించారన్నారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...