psycopk Posted August 20, 2024 Author Report Posted August 20, 2024 K.Kavitha: ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ వాయిదా 20-08-2024 Tue 11:53 | Telangana -- ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జైలుపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వచ్చే మంగళవారం విచారణ జరుపుతామని ప్రకటించింది. లిక్కర్ కేసులో బెయిల్ కోసం కవిత తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కోర్టు ఆమె పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐ, ఈడీలను ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ అధికారులు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కి ఈ నెల 23 (శుక్రవారం) వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. Quote
psycopk Posted August 22, 2024 Author Report Posted August 22, 2024 K Kavitha: ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత... ఎయిమ్స్‌కు తరలింపు 22-08-2024 Thu 13:24 | Telangana జైలు డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రికి తరలింపు ఆసుపత్రిలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడి ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు డాక్టర్ల సూచనల మేరకు అధికారులు ఆమెను దేశ రాజధానిలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కవిత వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. అంతకుముందు, జులై 16న కవిత జైల్లోనే అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు ఆమెకు జ్వరం రావడంతో పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్‌లో గల దీనదయాళ్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను తిరిగి జైలుకు తీసుకువెళ్లారు. ఇప్పుడు ఆమెకు ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. కవిత గత ఐదు నెలలకు పైగా తీహార్ జైల్లో ఉంటున్నారు. ఇటీవల ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఆలోగా ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో 23వ తేదీలోగా రిజాయిండర్ దాఖలు చేయాలని కవిత తరఫు న్యాయవాదులను ఆదేశించింది. Quote
psycopk Posted August 26, 2024 Author Report Posted August 26, 2024 K Kavitha: రేపు కవిత బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ 26-08-2024 Mon 18:00 | Telangana రేపు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ కవిత తరఫున వాదనలు వినిపించనున్న ముకుల్ రోహత్గీ ఢిల్లీకి బయలుదేరిన కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. రేపు కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావు ఢిల్లీ వెళుతున్నారు. జైల్లో ఉన్న కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఈ నెల 22న ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. భర్త అనిల్ సమక్షంలో పరీక్షలు నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు జైలుకు తరలించారు. అంతకుముందు, జూలై 16న తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చికిత్స అందించారు. Quote
adavilo_baatasaari Posted August 26, 2024 Report Posted August 26, 2024 పాపం, అక్క AIIMS నుంచి checkout అయ్యిందో లేదో పటించుకునే నాధుడే లేడు. హోటేలు లెక్క ఉండుంటది అక్కకి. AIIMS లో మొత్తం మెక్కుతుందేమో...అయ్యకీ బిడ్డకూ దవాఖానల దొబ్బి తినడం ఆనవాయితీలా ఉంది. Quote
psycopk Posted August 27, 2024 Author Report Posted August 27, 2024 kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ 27-08-2024 Tue 13:17 | Telangana తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని గుర్తుచేసిన కోర్టు ఆమె జైలులో ఉండాల్సిన అవసరంలేదని వ్యాఖ్య బెయిల్ పై గంటన్నర పాటు సాగిన వాదనలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ లతో కూడిన బెంచ్ కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈడీ, సీబీఐ.. రెండు కేసుల్లోనూ ఆమెకు బెయిల్ ఇచ్చింది. నిందితురాలు మహిళ అనే విషయం కూడా దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత నేడు బయటకు రానున్నారు. కాగా, ఈ కేసులో కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు. Quote
psycopk Posted August 27, 2024 Author Report Posted August 27, 2024 MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత బెయిల్ ఆర్డర్‌లోని కీలక అంశాలు ఏంటంటే...! 27-08-2024 Tue 14:31 | Telangana ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ బెయిల్ పిటిషన్‌పై గంటన్నర పాటు సాగిన వాదనలు ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ పాస్‌పోర్టును మెజిస్ట్రేట్‌కు సరెండర్ చేయాలన్న కోర్టు కేసు ట్రయల్‌కు సహకరించాలని స్పష్టీకరణ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై దాదాపు గంటన్నర పాటు వాదనల అనంతరం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ కవితకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసినందున నిందితురాలు కారాగారంలో ఉండాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది. బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. అలాగే సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు ఆదేశించింది. సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. దీంతో దాదాపు ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న కవిత బయటకు రానున్నారు. ఇక కవితకు బెయిల్ లభించడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కవిత బెయిల్ ఆర్డర్‌లోని కీలక అంశాలివే..! * పాస్‌పోర్టును మేజిస్ట్రేట్‌కు సరెండర్ చేయాలి * కేసు ట్రయల్‌కు సహకరించాలి * విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలి * విచారణ వాయిదాల సమయంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలి Quote
psycopk Posted August 27, 2024 Author Report Posted August 27, 2024 Bandi Sanjay: కవితకు బెయిల్ ఇప్పించిన కాంగ్రెస్‌కు అభినందనలు!: బండి సంజయ్ 27-08-2024 Tue 14:54 | Telangana కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ న్యాయవాదులకు బండి సంజయ్ అభినందనలు మీ అలుపెరగని ప్రయత్నాలు ఫలించాయంటూ చురక ఈ బెయిల్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విజయమన్న బండి సంజయ్ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. కవితకు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలు తెలిపారు. మీ అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయని చురక అంటించారు. ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్... రెండు పార్టీల విజయమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకురాలు బెయిల్‌పై బయటకు వచ్చారని, ఇక కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళతారని వ్యాఖ్యానించారు. కవితకు బెయిల్ కోసం కోర్టులో వాదనలు వినిపించిన కాంగ్రెస్ అభ్యర్థిని ఏకగ్రీవంగా రాజ్యసభకు నామినేట్ చేయడానికి కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురత ప్రదర్శించారన్నారు. Quote
psycopk Posted August 27, 2024 Author Report Posted August 27, 2024 K Kavitha: కవితకు బెయిల్ వచ్చింది... బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలింది: మహేశ్ గౌడ్ 27-08-2024 Tue 15:04 | Telangana లిక్కర్ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ కాంగ్రెస్ పార్టీ కృషి వల్లే కవితకు బెయిల్ వచ్చిందన్న బండి సంజయ్ బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ వచ్చిందన్న మహేశ్ గౌడ్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ నేత కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీ కృషి వల్లే కవితకు బెయిల్ వచ్చిందంటూ బీజేపీ నేత, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అటు, కాంగ్రెస్ కూడా కవితకు బెయిల్ అంశంపై రాజకీయపరమైన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ ఈ అంశంపై స్పందిస్తూ... కవితకు బెయిల్ వస్తుందన్న విషయం ఊహించిందేనని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ వచ్చిందని పేర్కొన్నారు. మొన్నటివరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశారని... కానీ పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని మహేశ్ గౌడ్ ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ దాసోహం అయిందని... కేటీఆర్, హరీశ్ లు ఢిల్లీలో బీజేపీ నేతలకు ఆపద మొక్కులు మొక్కారని వ్యంగ్యం ప్రదర్శించారు. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి, కాళ్ల మీద పడి... కవితకు బెయిల్ తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందని అన్నారు. Quote
psycopk Posted August 27, 2024 Author Report Posted August 27, 2024 KTR: కవితకు బెయిల్ రావడంపై బండి సంజయ్ ట్వీట్... తీవ్రంగా స్పందించిన కేటీఆర్ 27-08-2024 Tue 15:09 | Telangana బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారని గుర్తు చేసిన కేటీఆర్ ఆయన స్థాయికి ఇలాంటి విమర్శ సరికాదన్న కేటీఆర్ కోర్టు ధిక్కార చర్యగా భావించి చర్యలు ప్రారంభించాలని సుప్రీంకోర్టును కోరిన కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ చేసిన ట్వీట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ట్వీట్‌ను తప్పుబట్టారు. కవితకు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలు అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్నారని, మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఎక్స్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. మీ స్థాయికి ఇది తగిన వైఖరి కాదని బండి సంజయ్‌ని ఉద్దేశించి పేర్కొన్నారు. గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి, గౌరవ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను (బండి సంజయ్ వ్యాఖ్యలను) కోర్టు ధిక్కార చర్యగా భావించి అందుకు అనుగుణంగా చర్యలను ప్రారంభించాలని కోరుతున్నానని పేర్కొన్నారు. అంతకుముందు, కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. కవితకు బెయిల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. "థ్యాంక్యూ, సుప్రీంకోర్ట్... ఉపశమనం లభించింది, న్యాయం గెలిచింది" అని ట్వీట్ చేశారు. Quote
psycopk Posted August 27, 2024 Author Report Posted August 27, 2024 K Kavitha: కవితకు బెయిల్... హుషారుగా కేటీఆర్... వీడియో ఇదిగో 27-08-2024 Tue 15:33 | Telangana కవితకు బెయిల్ రావడంతో టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఆనందంతో పార్టీ నాయకులను ఆలింగనం చేసుకున్న కేటీఆర్ నెట్టింట వైరల్‌గా మారిన కేటీఆర్ సంతోషానికి సంబంధించిన వీడియో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరిపాయి. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద, జిల్లాల్లోనూ బీఆర్ఎస్ శ్రేణులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నాయి. కేటీఆర్ సంబరాలు తన సోదరికి బెయిల్ రావడంతో ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులను ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఆనందానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కవితకు ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరైంది. బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతు విధించింది. 165 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత బెయిల్ రావడంతో బయటకు రానున్నారు. Quote
psycopk Posted August 27, 2024 Author Report Posted August 27, 2024 Kavitha: తన కోడలు కవితకు బెయిల్ రావడం పట్ల మామ రామకృష్ణారావు ఏమన్నారంటే...! 27-08-2024 Tue 15:41 | Telangana ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు బెయిల్ ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు కవిత ఏ తప్పు చేయలేదన్న మామ రామకృష్ణారావు కడిగిన ముత్యంలా బయటికి వస్తుందని వెల్లడి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ రావడం పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆమె కుటుంబ సభ్యుల్లోనూ సంతోషం వెల్లివిరుస్తోంది. తాజాగా, కవిత భర్త అనిల్ తండ్రి రామకృష్ణారావు కూడా ఆనందం వ్యక్తం చేశారు. తన కోడలు కవితకు బెయిల్ రావడం పట్ల ఆయన మీడియాతో మాట్లాడారు. "కవిత సుమారు 6 నెలలు జైలు జీవితం అనుభవించింది. ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా ఆమె ఎంతో ధైర్యంగా ఉంది. మాకే ధైర్యం చెప్పింది. ఆలస్యమైనా న్యాయమే గెలిచింది. కవిత కడిగిన ముత్యంలా బయటికి వస్తుందన్న నమ్మకం మాకుంది. కవిత ఇటీవల జ్వరంతో బాధపడింది. 10 కిలోల బరువు తగ్గినప్పటికీ, ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోలేదు. కవిత ఏ తప్పు చేయలేదని మేం నమ్ముతున్నాం. ఆమె పది మందికి సాయం చేయాలన్న మనస్తత్వం ఉన్న వ్యక్తి. తెలంగాణ ఆడపడుచులు, అన్నదమ్ముల ఆశీస్సులు ఆమెకు ఉన్నాయి. ఈ సాయంత్రానికి కవిత జైలు నుంచి బయటికి వస్తుందని భావిస్తున్నాం. కేటీఆర్, హరీశ్, న్యాయవాదులు అవసరమైన పత్రాలు తీసుకుని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు వెళ్లారు. అక్కడ్నించి బెయిల్ పత్రాలు తీసుకుని తీహార్ జైలుకు వెళ్లాల్సి ఉంది. ఇదంతా పూర్తయ్యేసరికి మరో మూడు గంటల సమయం పడుతుందని అనుకుంటున్నాం. ప్రజలు కవిత కోసం స్వచ్ఛందంగా ఢిల్లీకి వచ్చారు" అని ఆమె మామ రామకృష్ణారావు వివరించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.