Jump to content

Lokesh and CBN thank JP for his support


Recommended Posts

Posted

Jayaprakash Narayan: లోక్ సత్తా జేపీకి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేశ్ 

20-03-2024 Wed 19:42 | Andhra
  • ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు పలికిన జేపీ
  • ప్రజాస్వామ్యవాదులు ముందుకు రావాలని పిలుపు
  • జేపీ ప్రకటన హర్షణీయం అంటూ లోకేశ్ ట్వీట్
 
Nara Lokesh thanked Loksatta founder Jayaprakash Narayan

లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఏపీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించడం తెలిసిందే. ఏపీలో రాజకీయ పరిస్థితులు దిగజారాయని, ప్రజాస్వామ్యవాదులు ముందుకు రావాలని జేపీ పిలుపునిచ్చారు. 

దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అన్ని అంశాలపై సమగ్ర అవగాహన కలిగిన జయప్రకాశ్ నారాయణ వంటి మేధావి ఏపీ ఎన్నికల్లో కూటమికి మద్దతు పలకడం హర్షణీయం అని పేర్కొన్నారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణకు మీ వంతు పాత్రను పోషించేందుకు ముందుకు రావడం పట్ల మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను సర్ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

Posted

Jayaprakash Narayan: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించిన జయప్రకాశ్ నారాయణ 

20-03-2024 Wed 19:25 | Andhra
  • కీలక నిర్ణయం తీసుకున్న లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జేపీ
  • ఏపీ ఎన్నికల్లో తాము ఎన్డీయే కూటమి వైపేనని వెల్లడి
  • అరాచక పాలనను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టీకరణ
 
Loksatta JP extends support NDA alliance in AP elections

లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఏపీ ఎన్నికల్లో తాము ఎన్డీయే కూటమివైపేనని అన్నారు. ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్యవాదులు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. 

రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతోందని... రెడ్డి సామాజిక వర్గం వైసీపీ వైపు ఉంటే... కమ్మ, కాపులు ప్రతిపక్ష పార్టీల వైపు ఉన్నారని జేపీ విశ్లేషించారు. సంక్షేమమే పాలన అనుకుని, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తే రాష్ట్రం దివాళా తీస్తుందని హెచ్చరించారు. అభివృద్ధి చేస్తేనే పాలన అని స్పష్టం చేశారు. 

ఏపీ కంటే ఒడిశాలో నయమని, ఒడిశాలో రూ.26 వేల కోట్ల ఆదాయం ఉందని, ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా అవసరం అనుకుంటేనే అప్పులు చేస్తారని జయప్రకాశ్ నారాయణ వెల్లడించారు. కానీ, ఏపీలో అలాంటి పరిస్థితి లేదని విచారం వ్యక్తం చేశారు.

ఏపీలో రాజకీయ పరిస్థితులు ఇంతలా దిగజారడం బాధాకరమని అన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తులు నియంతలను  తలపిస్తున్నారని, మద్దతుదారులకు పూలబాట వేస్తున్నారని, ప్రత్యర్థులకు ముళ్లబాటలు  పరుస్తున్నారని జేపీ వ్యాఖ్యానించారు. ఓవైపు దోపిడీ చేస్తూ, మరో వైపు సంక్షేమ పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్నారని, ఇదేనా ప్రజాపాలన అంటే? అని ప్రశ్నించారు.  

కొందరు క్లాస్ వార్ అంటున్నారని, ప్రజాస్వామ్యంలో అలాంటి భాష ప్రమాదకరం అని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కరణల అమలు సాధ్యం కాదు అనే వారు అసమర్థుల కిందే లెక్క అని స్పష్టం చేశారు.

Posted

Lokesh Red book ki bayapadda Loksatta

Red book tho rajakeeya prakampanalu choostunam

Posted
17 minutes ago, psycopk said:

 

 

Ayanaku anta prema vuntee mana chandra anna meeda he should have not started a new political party altogether... he could have joined TDP kada.. why even loksatta ?

In the past he worked under NTR kada... but basically mana chandra-anna backstabbing episodes  deggara nunchi chusaaru kabatti he might have started new political party ..

Also ayana yevariki maddatu istee vallu damal antunnaru... recently he supported TRS and KTR 1-1 interviews kuda vunnayi and cut chestee congress gelichindi.. adi matter telugu tammulu ..

  • Haha 1
Posted

Chandrababu: జయప్రకాశ్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: చంద్రబాబు 

20-03-2024 Wed 21:07 | Andhra
  • ఏపీలో ఎన్డీయే కూటమికి మద్దతు పలికిన జేపీ
  • హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వెల్లడి
  • భావసారూప్యత ఉన్నవారందరూ కలిసి రావాలని విజ్ఞప్తి
 
Chandrababu welcomes Jayaprakash Narayan decision to support NDA alliance in AP

ఏపీ ఎన్నికల్లో తాము టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు పలుకుతున్నామని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రకటించడం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. 

ప్రగతిశీల, ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలన్న జయప్రకాశ్ నారాయణ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటోందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి భావసారూప్యత కలిగిన అందరు వ్యక్తులు, సంస్థలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు.

  • psycopk changed the title to Lokesh and CBN thank JP for his support

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...